(n), ( s), మెడ, అర్రు. or bosom రొమ్ములు. she has a handsome * దాని చండ్లు అందముగా వున్నవి. she covered her * with a handkerchief రొమ్ములను బట్టతో కప్పుకొన్నది. a * of land కంఠ భూమి, అనగా రెండు భూ ఖండములకు నడుమ సంధిగా వుండే సన్నపాటి భూమి. you have now broken the * of the business ఆ పనిలో వుండే ముఖ్యమైన కష్టములను గడిచినావు, ఈ భాష యిక నీకు సులభమే. I have broken the * of the affair ఆ పనిలో వుండే సంకటమును సాధించినాను, యికను సులభమే. stiff *ed మూర్ఖమైన, పెడసరమైన, మొండి.