(v), ( a), కొట్టుట. he *ed his head against the wall గోడమీద తలను కొట్టుకున్నాడు. he *ed his foot against stoneపోతూవుండగా కాలు రాతిమీద కొట్టుకున్నది, రాతిమీద తగిలినది.he *ed his hand through the glass at me ఒక దెబ్బతో అద్దమునడిమికి దొండి చేసుకుని నా మీద చెయ్యి వేసినాడు. the waves *edthe ship against the rock అలలు వాడను తీసుకునిపోయి ఆ కొండమీదకొట్టినది. he *ed the water in her face దాని ముఖము మీద నీళ్లుచల్లినాడు. he *ed the bottle to pieces ఆ బుడ్డిని విసిరికొట్టితునక తునకలుగా చేసినాడు. he *ed off or out a letter a poema plan, a picture &c, లటుక్కున తలచుకొని, నిమిషములో వ్రాసినాడు.he *ed out a new plain లటుక్కున ఒక కొత్త యుక్తిని కల్పించినాడు.to * out ఫాటా కొట్టుట, కొట్టివేసుట. he *ed out these threeitems యీ మూడు పద్దులను కొట్టివేసినాడు, ఫాటా కొట్టినాడు.In writing this paper you have not *ed your T's నీవు యింగ్లీషు వ్రాయడములో టీ అనే అక్షరములకు అడ్డుగీతలువేయలేదు. or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. . or todepress అణగకొట్టుట. this news *ed his spirits యీ సమాచారమువిని కుంగి పోయినాడు.