(v), ( a), కనుక్కొనుట, కనిపెట్టుట,పొందుట. I found it అది నాకుదొరికినది, చిక్కినది. I found much assistance from this యిందు చేతినిండాసహాయమును పొందినాను. I found two books there నాకు అక్కడ రెండుపుస్తకములు అగుపడ్డవి. I could not * the word ఆ మాట నాకు చిక్కలేదు.I found him at home యింట్లో దొరికినాడు. I found he went there వాడుఅక్కడికి వెళ్లినాడని తెలిసినది. he found no opportunity వాడికి సమయముచిక్కలేదు.how could he * it in his heart to say this ? యిట్లా చెప్పేటందుకువాడికి యెట్లా నోరాడినదో ? how could he * it in his heart to beat her ?దాన్ని కొట్టేటందుకు వాడికి యెట్లా చేతులయినవో? as he could not * it in hisheart to do so అట్లా చేసేటందుకు వాడికి మనసు రానందున . I now * that themoney is his ఆ రూకలు వాడివని నాకు యిప్పుడు తెలిసినది. how do you * your selfto-day నేడు నీకు వొళ్లు యేట్లా వున్నది ? I found it cold to-day .యీ వేళ నాకు చలిగా వున్నది. he found it difficult వాడికి అది కష్టముగావుండినది. you will * it easy అది నీకు సులభముగా వుండును. I found itbetter to pay the money రూకలు చెల్లించడమే మేలని నాకు తోచినది. the jury found him guilty జూరీలు వాడు నేరస్థుడన్నారు. the juryfound this a true bill యిది విమర్శకు తేవలసిన ఫిర్యాదని జూరీలుఅన్నారు. the water found it's way through the bank ఆ నీళ్లు కట్టగుండాదారి చేసుకొని బయలుదేరినవి. he found fault with me నా మీద తప్పుపట్టినాడు, నన్నుకూకలు పెట్టినాడు. after ten years the letter found it's way into my hands పది యేండ్లకు తరువాత ఆ జాబు తనంతటనే నాచేతికివచ్చినది. did you * the account ? ఆ లెక్క సరిగ్గా వున్నదా? No : I foundit wrong అది తప్పనితెలిసినది. he gave me a room but I found myselfతన యింట్లో చోటు మాత్రము యిచ్చినాడు గాని భోజనము నాకు నేనే జాగ్రత్త చేసుకొన్నాను.they found the ship in provisions ఆ వాడకు కావలసిన భోజనసామగ్రీలనుజాగ్రత్త చేసినారు. you write the book and I will * you in paperand pen నీవు ఆ పుస్తకము వ్రాయి, కాగిదాలు పేనాలు నేను జాగ్రత్త చేస్తాను.the ship was completely found for six months ఆ వాడలో ఆరు నెలలకుభోజన సామాగ్రి యధేష్టముగా వుండినది. I found out the meaningఆ అర్ధమును కనుక్కొన్నాను. I found out the puzzle. ఆ విడకథనువిచ్చినాను, ఆ మర్మమును భేదించినాను. I found him out వాని కుట్రనుకనుక్కొన్నాను, వాన్ని కనిపెట్టినాను. he found out this medicineయీ మందును కల్పించినాడు, యీ మందును కొత్తగా కలగచేసినాడు.