(n), ( s), భయము, అపాయము వచ్చుననే భయము, అపాయము, ఆపద, గందము, ప్రమాదము, మోసము, విపత్తు. you are in * of fever if you live in the forestనీవు అడివిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగా వున్నది. this will put your life in * యిందుచేత నీ ప్రాణానికి అపాయము వచ్చును. he ran a * of being killed వాడికి చావుగండము తప్పినది. I ran the * of falling నేను పడబోతిని,పడకుండా తప్పితిని. he ran the * of losing his appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను. you may eat this without * నీవు దీన్ని తింటే మరేమిన్ని భయము లేదు. he did it at the * of his life ప్రాణానికి తెగించి చేసినాడు, ప్రాణానికి వొడ్డి చేసినాడు. I asked him this question at * దీనికి యేమి చెప్పుతాడో చూతామని యీ ప్రశ్న చేసినాను. at all *s you must speak to him యేమి వచ్చినా రాని నీవు అతనితో మాట్లాడవలసినది. a game at * పాచికలలో వొక విధమైన ఆట.