(n), ( s), కన్ను, లోచనము. sight చూపు, దృష్టి. when our *s metవాడిదృష్టి నాదృష్టి కలిసినప్పుడు. there is more in this thanmeets the * యిందులో చెప్పి వుండేది వేరు వానిలోని అభిప్రాయమువేరు. he cast his *s over the paper ఆ దస్తావేజును పార చూచినాడు.అనగా గచ్చత్తుగా చూచినాడు. the inner corner of the * కంటికొలికి the puter corner of the * కడకన్ను. pupil of the * కనుపాప, నల్లగుడ్డు.the wite of the * తెల్లగుడ్డు. sore *s కండ్ల నొప్పి, కండ్ల కలక. the *sin a peacock's tail నెమలి పింఛములో వుండే కండ్లు. any small perforationబెజ్జము, కన్ను. the * of a needle సూది బెజ్జము. an * for a hookగాలము, కొండి మొదలైనవాటిని తగిలించే వుంగరము. you must keep your * uponthis నీవు దీనిమీద దృష్టిని వుంచవలసినది. opinion formed by observationతాత్పర్యము.he did it with the * of his owen profit స్వలాభమును విచారించిదాన్ని చేసినాడు. he paid the money with an * to getting this appointmentయీ వుద్యోగము తనకు కావలెననే తాత్పర్యమునుపట్టి యీ రూకలను చెల్లించినాడు.with an * to screen himself తాను చేసినది దాగవలెననే యోచనచేతను.he viewed this with a jaundiced * దాన్ని మహా అసహ్యముగాచూచినాడు. he made large *s at it అందున గురించి ఆశ్చర్యపడ్డాడు.he did it with a single * యీ పనిని పారమార్ధికముగా చేసినాడు.లోకోపకారముగా చేసినాడు. setting God before his *s పైన దేవుడున్నాడనియెంచక. this is of reat importance in thier *s వారి అభిప్రాయములోయిది మహాముఖ్యము. he did it with his *s open వాడు బాగా తెలిసేదీన్ని చేసినాడు, వాడు కావలెనని చేసినాడు. his *s were opened వాడికితెలివివచ్చినది. in doing this he shut his *s to the consequencesయిది యెంతమాత్రము యోచించలేదు. he shut his *s to her conduct అదిపడే పాట్లకు కండ్లు మూసుకొని వూరక వుండినాడు. in the twinking of an *నిమిషములో, రెప్పపాటులో. he kept it under his own * వాడు దాన్నిస్వయముగా విచారించుకొన్నాడు, అనగా తన స్వంత విచారణలోవుంచుకొన్నాడు. the effects of an evil* దృష్టి దోషము.