(n), ( s), కాలము, వేళ, సేపు, పొద్దు, మాటు, మారు, విడుత, సారి, తూరి,పర్యాయము. in the night * రాత్రి పూట. at this * tomorrow రేపు యీ వేళకు. ator by this * ఆ మధ్య, యింతలో. up to the present * he has four sons యీవేళకు వాడికి నలుగురు కొడుకులు వున్నారు. in my grandfather's * మా తాతలనాడు.after a * కొంచెము సేపు తాళి, కొన్నాళ్ళకు తర్వాత. at one * వొకప్పుడు. another *మరివొకప్పుడు. he came another * మరివొక సారి వచ్చినాడు. at any * యెప్పుడైనా. they have held this land * out of mind ఆ నేలను అనాదిగా అనుభవిస్తున్నారు. In old *s పూర్వకాలమందు. seed time విత్తేతరి. Time, as opposed to eternity ఇహము. both in * and in eternity ఇహమందు, పరమందు, ఉభయత్ర. the enjoyments of * ఐహిక సుఖములు. I was not in * for the post నేను తపాలు వేళకు రాకపోతిని, నాకు తపాలు సమయము తప్పినది. he built the house in no * ఆ యింటిని ఆవలీలగా కట్టినాడు. in * you may be rich క్రమేణ నీవు భాగ్యవంతుడవు కావచ్చును. from * to * అప్పుడప్పుడు. have you * now ? మీకు యిప్పుడు తీరునా. I have not * నాకు తీరదు.from that * తుదారభ్య, అది మొదలు. he came in due * or in proper * సమయానికి వచ్చినాడు. you must lose no * in going ఆలస్యము చేయకు వెళ్ళు. * in music తాళము, లయ. beating * in music తాళము కొట్టడము. Times ఇది వొక సమాచార పత్రిక యొక్కపేరు. at *s అప్పుడప్పుడు. at all *s యెల్లప్పుడున్ను, సర్వదా. he accommodates himself to the *s యెప్పుడైనా. four at a * తడవకు నాలుగేశి. four *s నాలుగు మాట్లు. four *s ten is forty నాలుగు పదులు నలభై. three *s as large మూడింతలు పెద్దదైన. you are ten *s bad as he వాడి కంటె నీవు పదింతలు చెడ్డవాడవు, యేడాకులు యెగవేసిన వాడవు. once upon a * there was a king వొక రాజు కలడు. you should read these books one at a * యీ పుస్తకములను వొక టొకటిగా చదవవలసినది. send for them two at a * ఇద్దరిద్దరినిగా రమ్మను. speak one at a * వొకడొకడుగా మాట్లాడండి. the magistrates here sit * and * about ఇక్కడ పోలీసు దొరలు పూటకు వొకరు వచ్చి కూర్చుంటారు. she is near her * ఆపెకు యిప్పుడు కనపొద్దులు. at the same * మెట్టుకు, అయినప్పటికిన్ని. in the mean * అంతట, యింతలో.