(v), ( a), to receive తీసుకొనుట, పుచ్చుకొనుట. he took a coach-manబండివాణ్ని పెట్టుకొన్నాడు, అనగా కొలువులో పెట్టుకొన్నాడు. he took an impressionof the seal ఆ ముద్రతో ముద్ర వేసినాడు. I took him along with me నాతో కూడాపిలుచుకొని పోయినాడు. he took them aside and gave them this adviceవాండ్లను అవతలికి పిలుచుకొనిపోయి యీ బుద్ధి చెప్పినాడు. he took her in marriageదాన్ని పెండ్లాడినాడు. she took the child over the bridge ఆ బిడ్డను వారధిదాటించినది. he took me through the wood నన్ను అడివి దాటించినాడు. you may* your own time in paying the money నీకిష్టమయినప్పుడు చెల్లించవచ్చును. itwill * ten days to finish this యిది ముగియడానకు పది దినాలు పట్టును. itwill * ten rupees to repair the box ఆ పెట్టెను చక్కపెట్టడానకు పది రూపాయలుపట్టును. it will * much time దీనికి నిండా కాలము పట్టును. it will * much timeదీనికి నిండా కాలము పట్టును. they * the fish in baskets చేపలను వూతలలోపట్టుతారు. the seize, to catch పట్టుకొనుట, లంకించుకొనుట. they took the thief ఆ దొంగను పట్టుకొన్నారు. he does not think God will * account of this దీన్నిదేవుడు విచారించునని వాడు యెంచలేదు. he took their advice వాండ్ల బుద్ధి విన్నాడు. he took aim and shot the bird వాడు గురిపెట్టి ఆ పక్షిని వేసినాడు. he took anairing గాలిసవారి పోయినాడు. he stopped to * breath వూపిరి తిప్పుకోవడమునకైనిలిచినాడు. to * care జాగ్రతగా వుండుట. * care భద్రము. he took care of hischildren బిడ్డలను విచారించుకొన్నాడు, బిడ్డలను తన విచారణలో వుంచుకొన్నాడు. shedoes not * care of her children అది తన బిడ్డల జోళి విచారించదు. I will * mychance of finding him at home వాడు యింట్లో వుండునేమో చూతాము. he tookcold వానికి జలుబు చేసినది. he took counsel with them వాండ్లతో ఆలోచించినాడు. what course did they * ? వాండ్లేదోవ పట్టి పోయినారు, వాండ్లు యేపని చేసినారు.he took a dislike to her వాడికి దాని మీద అసహ్యము పుట్టినది. he took a drinkof water కొంచెము నీళ్ళు తాగినాడు. the poison did not * effect ఆ విషమెక్కలేదు. as the spell did not * effect upon him యీ మంత్రము వాడిమీదపారలేదు గనక. he took the field యుద్ధానికి బయిలుదేరినాడు. to * fireరగులుకొనుట. they took fight పారిపోయిరి. the birds took flight పక్షులుయెగిరిపోయినవి. he took fright at the sight of a snake పామును చూచిభయపడ్డాడు. he took heart ధైర్యము తెచ్చుకొన్నాడు. he took heed to hisconduct జాగ్రతగా నడుచుకొన్నాడు. he took the hint I gave and went awayనేను చేసిన జాడ తెలుసుకొని పోయినాడు. to * hold of పట్టుకొనుట. he took hold ofher hand దాని చెయిపట్టుకొన్నాడు. he took a jump or skip వొక గంతు వేసినాడు.he took a kiss ముద్దు పెట్టుకొన్నాడు. he took the law of me నా మీదవ్యాజ్యము తెచ్చినాడు. when he took leave తాను శలవు పుచ్చుకోగానె. may I * theliberty to tell you one thing ? నేను అమర్యాదగా వొకటి చెప్పుతానుక్షమించవలెను. never * the liberties అమర్యాద చేయరాదు. the painter tookhis likeness very well చిత్రకారుడు వాణ్ని సరిగ్గా వ్రాసినాడు. they * their mealsin this place యీ స్థలములో భోజనము చేస్తారు. he does not * my meaningright వాడు నా భావము సరిగ్గా గ్రహించలేదు. do you * ? నీకు అథర్మమైనదా, నీకుభావము తెలిసినదా. he took the measure of the stone ఆ రాయిని కొలిచినాడు.he took measures to do this దీన్ని చేయడమునకు వుపాయములు వెతికినాడు. hetook the medicine ఆ మందు తిన్నాడు. he took a mouthful బొక్కెడు తిన్నాడు.he took his uncle's name మామ పేరు పెట్టుకొన్నాడు. he took no notice of us ఆయన మమ్మున కండ్లెత్తి చూడ లేదు. he took an oath ప్రమాణము చేసినాడు. hetook occasion to say this సమయము చూచుకొని యీ మాట చెప్పినాడు. he tookoffence at this దీని మీద అసహ్యము వచ్చినది. he took the opportunity tosay this సమయము చూచుకొని యీ మాట చెప్పినాడు. he took pains to masterit దాన్ని సాధించడమునకై బహు ప్రయాసపడ్డాడు. he took my part నాపక్ష మైనాడు.God took their part వాండ్లకు దైవ సహాయము వుండినది. you must takepatience నీకు తాళిమి వుండవలసినది. he took pity upon them వాండ్లను గురించిజాలిపడ్డాడు. to * place కలుగుట, సంభవించుట. a marriage took place పెండ్లితటస్థమైనది. if elision *s place లోపము వస్తే. a suit cannot * placeవ్యాజ్యము రారాదు. what more took place ? యింకా యేమి సంభవించినది, యింకాయేమి జరిగినది. he *s a pride in doing this యిది చేయడము వాడికి వొక గర్వము.they took a resolution వొక నిశ్చయము చేసిరి. to * revenge పగదీర్చుకొనుట.the plant did not * root ఆ చెట్టుకు యింకా వేళ్లు పారలేదు. these words tookroot in his mind యీ మాటలు వాని మనస్సులో పాదుకొన్నవి or నాటుకొన్నవి. hetook a run and leapt over the well పరుగెత్తి ఆ బావి దాటినాడు. * a seatకూరర్చుణ్నుండి. to * shame సిగ్గుపడుట. the demon took the shape of ahorse ఆ రాక్షసుడు అశ్వరూపమును వహించినాడు. he took shelter there అక్కడదాగినాడు. he took ship వాడ యెక్కినాడు. he took snuff పొడి వేసుకొన్నాడు, పొడిపీల్చినాడు. why should you * thought about this ? యిందున గురించి యేలవిచారపడుతావు. come and * turn in the garden వచ్చి తోటలో తిరుగు. she tookthe veil కాషాయాలు పుచ్చుకొన్నది, సన్యసించినది. he took a view of the villagefrom the hill ఆ కొండ మీద నుంచి ఆ వూరిని బాగా చూచినాడు, ఆ కొండ మీద నుండి ఆ వూరివలె కాకితము మీద వ్రాసినాడు. he took a voyage వాడ యెక్కి పోయినాడు. the dog took the water or took to the water కుక్క నీళ్ళలో దుమికి యీదినది. he took his may దోవ బట్టినాడు, he took a wife పెండ్లి చేసుకొన్నాడు. he took her to wife దాన్ని పెండ్లాడినాడు. the story took wind ఆ కథ బయిట పడ్డది. I took his word and went there వాడి మాట నమ్మి అక్కడికి పోతిని. he took them at their word వాండ్ల మాట పట్టుకొని వాండ్లనే చెరిపినాడు. he took it ill యిది అన్యాయముగా యెంచినాడు, I * it he is wrong వాడు తప్పినట్టు నాకు తోస్తున్నది. I took it in another sense నేను వేరే అర్థము చేసుకొన్నాను. I * it he went పోయినాడని తోస్తున్నది. he will * it very kindly if you go there నీవు అక్కడికి పోతే వాడికి సంతోషముగా వుండును. he took it very unkindly that you should say this నీవు యీ మాట అనడమువల్ల వాడికి నిండా అసహ్యము వచ్చినది. he certainly was angry, but ( * this along with you ) he has reason వాడు కోపము చేసినది సరే దానికి హేతువు వున్నది సుమీ. it is true that he was in debt, but ( * this along with you ) he has paid his debts వాడు అప్పులు పడ్డది వాస్తవమేకాని ఆ అప్పులను చెల్లించివేసినాడు సుమీ. he will * amiss if you speak to his wife వాడి పెండ్లాముతో నీవు మాట్లాడితే నీ మీద వాడికి ఆయాసము వచ్చును. why should you * thisamiss ? దీనికి యెందుకు ఆగ్రహపడుతావు. he took away the chair కూర్చీ అవతలికి తీసుకపోయినాడు. to * away a man's bread వొకని కూటిలో రాయి వేసుట. God took away her child దేవుడు దాని బిడ్డను తీసుకొని పోయినాడు, అనగా దానిబిడ్డ చచ్చిపోయినది.the cold or fright or tickling took away my breath నాకు వూపిరి తిరగక పోయినది, వుడ్డు గుడుచుకొన్నాను. he took her by the hand దాన్ని చెయి పట్టుకొన్నాడు. he took it by force of my hands నా చేతులో నుంచి దాన్ని తీసుక్కొన్నాడు. they took down the beam దూలమును దించినారు. he took down what they said వాండ్లుచెప్పినదాన్ని వ్రాసుకొన్నాడు, will * down his pride వాడి కొవ్వును అణుస్తాను. they took down the roof of the house ఆ యింటి పై పూరిని విచ్చివేసినారు. theytook down the wall ఆ గోడను పడగొట్టినారు. to suppose యెంచుకొనుట,అనుకొనుట. I took the tree for a man చెట్టును చూచి మనిషి అనుకొంటిని. I tookthe wood for stone ఆ కొయ్యను చూచి రాయి అనుకొంటిని. I took it for grantedhe would come వాడు వచ్చుననుకొంటిని. you must pay for it; I * itfor granted that you have the money దానికి నీవు రూకలు చెల్లించవలసినది నీదగ్గర రూకలు వుండవలెను. I was a stranger and he took me in నేనుపరదేశస్థుణ్ని అయినందున నాకు తన యింట్లో స్థలము యిచ్చినాడు. he took me in about this horse యీ గుర్రము విషయములో నన్ను మోసబుచ్చినాడు. after he tookthe work in hand ఆ పనికి మొదలుపెట్టిన తర్వాత, పూనుకొన్న తర్వాత. he *s inthe gazette వాడికి నిత్యము సమాచార పత్రిక వస్తున్నది. he took in a piece ofground కొంత నేలను తన నేలతో చేర్చుకొన్నాడు. he took in sail వాడ చాపనుదించినాడు. thou shalt not * God's name in vain వృథాగా దేవుడి పేరు యెత్తరాదు.they took it into consideration దీన్ని విమర్శించినారు. he took this into his head that I was his enemy నేను తనకు శత్రువునని పిచ్చిగా అనుకొన్నాడు, భ్రమపడ్డాడు. he took her into his arms దాన్ని కౌగలించుకొన్నాడు, ఆలింగనము చేసుకొన్నాడు. he took the law into his own hands దివాణము మూలకముగా కాకుండా తానే శిక్ష చేసినాడు. to * off తీసివేసుట, విడిచివేసుట, వీడ్చుట. he took off his clothes బట్టలు విడిచివేసినాడు. he took off the tiger's skin పులి తోలును దోచినాడు. a fever took him off జ్వరము వాణ్ని కొంచపోయినది. the boy took off hisfather's way of walking ఆ పిల్ల కాయ తండ్రివలె యెగతాళిగా నడిచినాడు. the school boy took off his master's way of talking పల్లె కూటపు పిల్లకాయ వుపాధ్యాయులవలె యెకసక్యముగా మాట్లాడినాడు. * off your hands చేతులు అవతలికి తియ్యి. I took it offhis hands అతని వద్ద కొనుక్కొన్నాను. to * off an impression అచ్చువేసుట, ముద్ర వేసుట. they took off a thousand impressions of the book వెయ్యి ప్రతులు అచ్చువేయించినారు. he took himself off i.e. he went away వాడు వెళ్ళినాడు. he took the ring off his finger తన వేలి వుంగరమును తీసినాడు. he took off his hat తల మీది టోపిని చేత తీసుకొన్నాడు. the surgeon took off his leg వయిద్యుడు వాని కాలు కోసివేసినాడు. she took on very much about this యిందున గురించి చాలా వ్యసనపడ్డది. he took out the nail ఆ చీలను పెరికినాడు, వూడదీసినాడు. he took the loom to pieces ఆ మగ్గమును వేరే వేరేగా వీడ్చివేసినాడు. this took the pride out ofthem యిందువల్ల వాండ్లకు గర్వభంగమైనది. taking these things together I believed the story వీటినంతా యోచించి ఆ మాటను నమ్మినాను. the bearers took up the palanqueen బోయీలు పాలకీని యెత్తుకొన్నారు. he took me up very angrily నా మీద కోపము చేసినాడు, చీవాట్లు పెట్టినాడు. they took the matter up ఆ సంగతిని విమర్శ చేసినారు. to * up quarters దిగుట, బసచేసుట. he took up his quarters in the lodge చావట్లో దిగినాడు. he took too much upon himself నిండా గర్వించినాడు. I will * upon myself to say that they are wrong వాండ్లు తప్పినారు అందుకు నేను వున్నాను these goods took very well here యీ సరుకులు యిక్కడ బాగా అమ్ముడుబోతవి.