(n), ( s), imagination భావన, యెన్నిక, తలంపు, భావము.they have a * that you are gone నీవు పోయినావనుకొన్నారు.I have some * that I have seen this book before యీ పుస్తకమునునేను మునుపు చూచినట్టు తోస్తున్నది. this is a mere or empty *యిది వట్టి భ్రమ. a foolish * వెర్రి యోచన. inclination మనసు, యిష్టము.యిచ్ఛ, ఆశ. have you any * for that house ఆ యిల్లేమైనా నీకు యిష్టమా.having no * to do so అట్లా చేయడమునకు యిష్టములేనందున. I have *no for that అది నాకు యిష్టము లేదు. the horse does not strike my *ఆ గుర్రము నాకు యిష్టము లేదు. she took a * to him అది వాణ్నివలచినది. he has no * for food వాడికి అన్నముమీద యిష్టములేదు,బుద్ధిలేదు. she wears a * dress దానికి యిష్టమైన వేషము వేసుకొంటున్నది.అనగా కులాచా ర,మతాచారములకు విరుద్ధముగా దానికి మనసు వచ్చినవేషము వేసుకొంటున్నది. * work చిత్రపని, చిత్రవిచిత్రమైనపని.a * ball ప్రతిమనిషిన్ని మారువేషములు వేసుకొనివచ్చే విందు.a * man వలపుగాడు, సొగసుగాడు.