(v), ( a), మోసుకొని, పోవుట, వెంట బెట్టుకొని పోవుట. he carried me with him నన్ను వెంట బెట్టుకొని పోయినాడు. he carried his coat in his hand చొక్కాను చేతులో యెత్తుకొని పోయినాడు. or to gain జయించుట, గెలుచుట. or effect సాధించుట, జయించుట, నిర్వహించుట. he carried his point తన పట్టును నెరవేర్చినాడు. they carried the town by assault ఆ పట్టణమును లగ్ధ లెక్కి జయించినారు. or bear ధరించుట. She carried the child on her hip ఆ బిడ్డను చంకబెట్టుకొని పోయినది. the horse carries his head very well ఆ గుర్రము తలను యెత్తుగా పెట్టుకొని పోతున్నది. he carries a sceptre in his hand చేతిలో సెంగోలును ధరిస్తాడు, అనగా రాజముద్రను ధరిస్తాడు. he always carries money in his pocket వాడు యేవేళా రూకలను జేబులో పెట్టుకొంటాడు. the wind carried the sound ten miles గాలి చేత ఆ ధ్వని ఆమడ దూరము పోయినది. this dog feteches and carries యీ కుక్క దేన్ని అయినా తెమ్మంటె తెస్తుంది, తీసుకపోతుంది. he carried arms ten years పది యేండ్లు శిఫాయిగా వుండినాడు. to * away యెత్తుకొని పోవుట, కొంచ పోవుట. he carried them away captive వాండ్లను చరబట్టుకొని పోయినాడు. they besieged the town for ten days and at last carried it by the sword పది దినాలు ముట్టుడి వేసుకొని వుండి తుదకు కత్తి యెత్తి జయించిరి. to * down ఆ ప్రవాహము గోడలను యిడియగొట్టినది. he carries himself wisely వివేకముగా ప్రవర్తిస్తున్నాడు. to * into execution జరిగించుట, నడిపించుట, నెరవేర్చుట.to * off తీసుకొనిపోవుట, తోలుకొని పోవుట. a fever carried him off జ్వరము వాణ్నితుంచుకొని పోయినది. to* on జరిగించుట, సాగించుట. to * on trade వర్తకముజరిగించుట. he carried on the school for twenty years ఆ పల్లి కూటమునుయిరువై యేండ్ల దాకా జరిపించినాడు. they carried on the war for ten years పది యండ్లు యుద్ధము చేసినారు. they carried the hedge round the garden తోట చుట్టూ కంచె వేసినారు. he carries himself as a friend స్నేహితుడై ప్రవర్తించినాడు. he carries talesl చాడీలు చెప్పుతున్నాడు he carried the business through ఆ పనిని కొనసాగించినాడు, the Government carried him through గవర్నమెంటువారు వాణ్ని కడతేర్చినారు. he carried this bill through the House of Commons యీ చట్టమును పుట్టించే లాగున అందరును ఆమోదించేటట్టు చేసినాడు. I carried him through the Ramayanam వాడికి రామాయణము కడవెళ్లా చదివించినాను. the favour of God carried him through all these difficulties దైవకటాక్షము చేత వాడికి ఆపదలన్ని తప్పినవి. they carried up the wall ten feet ఆ గోడను పది అడుగుల పొడుగు లేపినాను. folly carries its punishment with it దుర్మార్గమును శిక్ష వెంబడించే వుంటుంది. he carried it with a high hand దాన్నిదాష్టీకముగా జరిగించినాడు. (in arithmentic) write two and * one రెండు వేసి వకటిన్నవాత్సార్యా. he carried the sun forward or over ఆ మొత్తమును పైన వేసుకొన్నాడు. this carries no proof with it యిందుకు సాక్ష్యము లేదు. this carried conviction to his mind యిందువల్ల వాడి మనసులో వుండే అనుమానము తీరింది. he carries every thing before him వాడికి అన్ని విధాలా జయముగా వున్నది.