(n), ( s), యజమానుడు, దొర, ప్రభువు, నాయకుడు, యేలవాడు. the * of the land ఆ నేలకు సొంతగాడు. an appellation of respect గారు అన్నట్టు పేరుకు ముందరవచ్చే మర్యాద శబ్దము. or teacher ఉపాధ్యాయులు, గురువు. a dancing * నట్టువుడు. a fencing * సామునేర్పేవాడు. (or sound scholar) a * of English యింగ్లీషులో పూర్ణుడు, యింగ్లీషులో పండితుడు. an English * యింగ్లీషుభాష నేర్పేవాడు,పండితుడు, పూర్ణుడు. Is your * at home? No మీ దొర యింట్లో వున్నాడా,లేడు. you will soon be * of this language యిందులో శీఘ్రముగా పండితుడవు అవుతావు. Musulmans were that time *s అప్పుడు తురకలు దొరలుగా వుండినారు. he is now * of Tamil వాడు యిప్పుడు అరవములో పూర్ణుడైవున్నాడు. they struggled for some time and at last he was * వాండ్లు కొంత సేపు పోరాడినారు తుదకు వీడు గెలిసిననాడు. a *carpenter వడ్లమేస్త్రి. when he became * of the property ఆయాస్తి అతనికి స్వాధీనమైన తరువాత. that horse is * of my weight ఆ గుర్రమునన్ను మోయగలదు. he made himself * of the language ఆ భాషను సాధించినాడు. he is his own * వాడు స్వతంత్రుడు. works of the ancient *s or painters పూర్వీకపు శాస్త్రజ్ఙుల పని, అనగా దివ్యమైనపనులు. * of arts శాస్త్రి, అన్నట్టు, యిది వొక పట్టము,అనగా విద్యా నిర్వాహాకుడు, పండితుడు. * of the ceremonies పెత్తనగాడు. the * key అన్ని బీగాలకున్ను సరిపడే తాళముచెవి. this grammar is a * key to the language ఆ భాషకు యీ వ్యాకరణ గ్రంథము సర్వపయోగకరముగా వున్నది, అనగా అన్ని విధాల వుపయోగిస్తున్నది.this was his * devise to ruin them వాండ్లను చెరపడానకై చేసిన ముఖ్యమైన యుక్తి. Master అనే శబ్ధము నీచులవిషయమందున్ను ప్రయోగించడము కద్దు, యేలాగంటే, I say * can you make a chair for me? ఒరే అన్నా నాకు వొక కురిచి చేసియిస్తావా. In John. III. 10. ******** In Matt. XXII. 16. గురు A+ ఉపదేశకుడు. P+. బోధకుడు. K+ XXIII. 8. 10.*****గురు A+. Note. Master Ellis (మాస్తరెల్లిస్) అంటే యెల్లిస్ అనే చిన్నవాడు.Mr. (Mister) Ellis (మిస్తరిల్లిస్) అంటే యెల్లిస్ దొరగారు, ఉచ్చారణలో యింత అర్థభేదమున్నది గనక యెల్లిస్ దౌరగారు అనవలసినప్పుడు Master Ellis మాస్తరెల్లిస్ అంటే యెగతాళిగా వుంటున్నది. To Master, v. a. సాధిమచుట, జయించుట. he *ed Engligh యింగ్లీషు విద్యను సాధించినాడు. they *ed the town ఆ పట్టణమును జయించినారు. he *ed his passions కామక్రోధాదులను అణిచినాడు. the sword was solong that I could not * it. కత్తి పొడుగాటిది గనుక తిప్పలేక పోతిని.