(v), (a), కాదనుట, లేదనుట, లేదని సాధించుట, అపలాపించుట,వర్జించుట. he denied me the money ఆ రూకలు నాకు యివ్వనన్నాడు.I hope you will not * me this యిది నాకు కావలెదీన్ని యివ్వనకుండాతమరు దయచేయవలెను. he denied me leave నాకు సెలవు యిచ్చేదిలేదన్నాడు. he denied me the smallest trifle యెంత కొంచెమడిగినాయివ్వలేదు, రవంతైనా లేదన్నాడు, లేశమైన లేదన్నాడు. his fatherdenied him nothing తండ్రి కొడుకు మనసు వచ్చినట్టెల్లా పోనిచ్చినాడు.he denied my request నా మనివిని అంగీకరించిపోయినాడు. he denied them his favour అతడు వారి మీద దయచేయలేదు.he denied his child తన బిడ్డను త్యజించినాడు. he denied hischildren nothing and thus spoiled them బిడ్డలు కావలెనన్నదెల్లా వాండ్లకిచ్చి చెరిపినాడు. I * that అదికాదు, అట్లాలేదు. he denied the charge తాను అట్లా చేయలేదని యెగరగొట్టి మాట్లాడినాడు.నేను దాన్ని అచ్చుకోవలసినది లేదన్నాడు. he denied the statementmade in his letter తనజాబులో వ్రాసిన సంగతి నిజముకాదన్నాడు.he says that they are brothers ! this I * ! వాండ్లు అన్నదమ్ములనివాడంటాడు, నేను కాదంటాను. he says the thieves are there :this she denies ఆ దొంగలు అక్కడ వున్నారని వాడంటాడు అది లేదంటున్నది. they denied the marriage ఆ పెండ్లి జరిగినదేలేదని సాధిస్తారు. he denies all knoweldge of them వాండ్లనుబొత్తిగా యెరగనన్నాడు. he would not deny his appetite వాడు కడుపుకట్టడు. he denied his religion స్వమత ద్రోహియైనాడు. he denieshaving done so తాను అట్లా చేయలేదని అన్నాడు. they * havingthe money ఆ రూకలు తమవద్దలేనది సాధిస్తారు. they * that thisdeed ever existed యీ పత్రము పుట్టనేలేదంటారు. he denied that thiswas his letter యిది తాను వ్రాసిన జాబు కాదన్నాడు. to * himselfor to * his lusts విరక్తిగా వుండుట, జితేంద్రియుడుగా వుండుట,తనకు యేదిన్ని వద్దనివుండుట, వైరాగ్యముగా వుండుట.a mink denied his lusts వాడు కామాన్ని వర్జించినాడు. he deniedhimself clothes that he might buy books తనకు పైకిబట్టలు లేకపోయినా పోతున్నది పుస్తకములు కొంటేచాలు నన్నాడు.he denied himself nothing తనకు ఒకటిన్ని కాదనలేదు, వాడికికాదనేటిది ఒకటిన్ని లేదు, వాడికి అన్నిన్ని యిష్టమే, అనగా తనకు యిష్టమైనదాన్ని వొకటినైనా వొద్దనలేదు అన్ని తిన్నాడు,అనగా తనకిష్టమైనదంతా తీసుకున్నాడు. One who denies hisGod దేవద్రోహి. One who denies his father పితృద్రోహి.God denied them children దేవుడు వాండ్లకు సంతానమునుయివ్వలేదు.