Telugu to English Dictionary: దెబ్బన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంటించు
(p. 8) aṇṭiñcu antintsu. [Tel.] v. a. To paste, stick, glue cause to adhere. To unite, join. To light or set on fire. కాలినమన్ను కాలనిమన్ను అంటదు burnt earth will not adhere to moist, i. e. we shall never be friends. వాణ్ని తేలు అంటించినది a scorpion stung him. వానికి మంచి దెబ్బలు అంటించినారు they gave him a good thrashing. ఆ సమయములో ఒక మాటను అంటించినాడు he put in a word at that moment.
కట్టు
(p. 231) kaṭṭu kaṭṭu. [Tel.] v. n. To cease or stop, gather or form as clouds or a boil, or lump; to be with young (used of animals.) భేది కట్టినది the diarrhoea ceased. మబ్బులుకట్టినవి clouds have gathered. నెత్తురు వెల్లువకట్టినది there was a gush of blood వానికి దెబ్బతగిలి నెత్తురు కట్టినది he received a contusion from a blow. గడ్డలుకట్టిన congealed, become hard. తూటుకట్టినది there is a hole formed.
గుబులు
(p. 378) gubulu or గుబులుకొను gubulu. [Tel.] v. n. To spread as scent, to be redolent. 'జవ్వాజతావి గుబులుకొనంగన్.' T. iii. 76. గుబులుగా gubulu-gā. adv. Aloud, thunderingly, (as drums) గుర్రాలమీద నగారా దెబ్బలు గుబులుగ వేసిరిగా the kettle drums sounded dub-a-dub-dub. గుబులు గుబులు or గుభుల్ గుభుల్ gubulu-gubulu. adv. Resoundingly, aloud, as thunder. 'దుందుభుల్ గుభుల్ గుభులుమనియె.' Vasu. v. 3.
తగులు
(p. 501) tagulu tagulu. [Tel.] v. a. & n. To happen, occur, turn up, appear. To belong to. appertain to, to come in contact with, to touch, hit, strike. To be caught; got, found, joined, entangled, understood. To be received (as a blow), incurred (as expense or punishment.) n. See under తగులము. ఆ యింటికి నిప్పుతగిలినది the house caught fire. ఇక్కడ గాలి తగులుచున్నది the wind strikes here, here we get the breeze. పెండ్లితగిలినది there was a marriage. ప్రయాణము తగిలినది he had occasion to make a journey. అక్కడ మంచినీళ్లు తగిలినవి there we found fresh water. వానికి దెబ్బతగిలినది he received a blow. కుండ కాలికి తగిలినది the pot touched my foot. ఓడ మెరకు తగిలినది the ship ran aground. వానికి రోగముతగలకుండ to prevent his catching the disease. అతనితిట్లు నాకు తగలలేదు his abuse did not affect me. ఇది వానిమనసునకు తగిలినది this was impressed upon his mind. వెంటతగులు to pursue. తగులుకొని వచ్చిరి they attacked, they followed. అడ్డముతగులు to oppose, to come in the way. పదిరూకలు తగిలినవి it cost ten cash. తగులుకొను tagulu-konu. v. n. To be involved or entangled with. చిక్కుకొను. To fall in love with. వలచు. To catch fire. అది వాణ్ని తగులుకొనిపోయినది she has gone off with him. ఆ యిల్లు తగులుకొన్నది the house caught fire. తగలబడు or తగులబడు tagala-baḍu. v. n. To burn or be set on fire. ఇల్లు తగలబడ్డది the house was burnt. తగలబెట్టు or తగులబెట్టు tagala-beṭṭu. v. a. To set fire to, to kindle, to burn అడివిని తగలబెట్టిరి they burned the forest. తగులుబడి tagulu-baḍi. n. Expense, charge, cost, outlay. పట్టుబడి. తగులుబాటు tagulu-bāṭu. n. Charge, cost, expense. తగులవడు to be caught. చిక్కు, పట్టుపడు.
తిను
(p. 528) tinu tinu. [Tel.] v. a. To eat. భుజించు. To suffer or undergo (blows, abuse, hardship, or punishment.) వానివద్ధ దెబ్బలు తిన్నాను I was beaten or flogged by him. గడ్డితిను to eat grass, i.e., to make a beast or fool of oneself. అన్నము తింటారా గడ్డి తింటారా are you men or brutes? తినివేయు to devour (one's property.) తినిపించు tini-p-inṭsu. (caus. from తిను.) v. t. To cause to eat. వాణ్ని మన్ను తినిపించినాను I made him eat dirt. తినుబండములు tinu-banḍamulu. n. Eatables. తినుబండారపువస్తువులు provisions.
తీయు
(p. 534) tīyu tīyu. [Tel.] v. a. To take. To draw out, take out, extract. ఈడ్చు. To open. excavate, dig. To deduct, take away, subtract. To find (a place in a book), to discover, bring to light. To turn out, discharge, remove. To exact, receive (payment.) To collect, gather, levy as a tax, a fine, పన్ను, లేక అపరాధమునుతీయు. To pull off, take off. To extinguish or put out. To buy. కొను. See తీసికొను. దెబ్బతీయు to give a blow. చెరువుతీయు, బావితీయు. to sink or dig a well or tank. పాతరతీయు to open a pit or granary. పాలుతీయు to milk. జాడతీయు to trace, detect. చేరదీయు to draw towards, to patronise, take into one's service, to embrace. సానదీయు to whet on a stone. గోళ్లుతీయు to cut the nails. దోవతీయు to clear the way, to prepare a path. అతనిసిగ్గుతీసిరి they disgraced him. తాళముతీయు to unlock. వాకిలితీయు to open a door. విడతీయు to loosen or separate. వేరుగాతీయు to separate. ఎండకంచు తీసినట్టు ఉన్నది the sun is a dazzling as (though reflected from) polished metal. తీయు. v. n. To go off, cease, diminish, disappear, be dispelled, intermit, desist from. To draw back, withdraw, retire, stand aside. To contract, shrivel, crack, open, split. జ్వరముతీసినది the fever went down. వెన్నుతీయు to come forth, or be produced (as a sprout,) to bud. కాళ్లు తీయుచున్నవి my legs throb or ache. ఏరు తీసిపోయినది the river has gone down. వెనక తీయు to fail, retire, withdraw, retreat, hesitate, or flinch. నాలుకతీసినది my tongue is dry, I am thirsty. వాని ఒళ్లు మిక్కిలి తీసిపోయినది he is greatly fallen away in flesh. నీళ్లు తీసిపోవు to dry up, sink, diminish, be exhausted. బలమంతా తీసిపోయినది my strength has gone. పాతర తీసియున్నది the granary was opened. తీయక unintermittingly, without intermission. వెనకతీయక without hesitation. తియ్యకుండా unfailingly, uninterruptedly, without intermission. తీయని incessant, unceasing. తీయించు tīyinṭsu. v. a. To cause to remove, get removed. తీసివేయు tīsi-vēyu. v. t. To take away. To dismiss. To sever ఖండించు. తీసివేతకాకితాలు tīsi-vēta-kāki-talu. n. Outside sheets of paper: paper that is taken away. తీసిపోవు tīsi-pōvu. v. n. To diminish. తగ్గు. తీసుక for తీసుకొని bringing. తీసుకరా bring. తీసుకపో take away. తీసికొను or తీసుకొను tīsi-konu. v. a. To take, &c.; to buy; to eat or drink, &c. పనితీసుకొను to exact service. వాడు చాలా దినములనుంచి తీసుకొంటున్నాడు he has been lingering for a long time. దండముతీసుకొనెను he acknowledged or accepted the salutation.
దెబ్బ
(p. 607) debba debba. [Tel.] n. A blow, a stroke. దెబ్బలుతిను to suffer blows, to be beaten. ముంచిదబ్బ a good blow. దెబ్బలుకొట్టు or వేయు debbalu-koṭṭu. v. t. To beat. దెబ్బాటు debbāṭu. (దెబ్బ+పాటు.) n. Heavy rain. బలష్ఠమైనవాన
నిండు
(p. 648) niṇḍu ninḍu. [Tel.] v. n. To be filled, to be full. పూర్ణమగు. నింట or నిండుట ninṭa. n. Fullness, as of water (జల) పూరము. నిండ, నిండా or నిండుగా ninḍa. adv. Fully. Much, entirely, utterly. Perfectly, నిండాదెబ్బలుకొట్టినాడు he struck many blows. నిండాదండములు పెట్టినాడు he offered many compliments. వాన నిండాకురిసినది it rained heavily. నిండా సంతోషించినాడు he was much pleased. నిండాభయపడిరి they feared greatly. నిండారు or నిండబడు ninḍ-āru. v. n. To be full. నిండారు or నిండు n. Fullness, completion. పూర్ణత్వము. నిండించు ninḍintsu. v. a. To fill. నిండు or నిండైన ninḍu. adj. Full, abundant, much. నిండు కుండ a full vessel. నిండుకుండ తొణకదు a full pot does not spill. నిండుమనిషి a pregnant woman. నిండుకొను ninḍu konu v. n. To be filled: (metaph.) to be pacified, to be silent. ఈవేళ నా యింట్లో నిండుకొని ఉన్నది a phrase meaning (by rule of contrary) I have nothing to eat or give.
పురపుర
(p. 769) purapura pura-pura. [Tel. anuk.] adv. Much, greatly, మిక్కిలి. పురపురపొక్కు to sorrow bitterly, deeply, inconsolably. 'గురులార మీరు నాకై పురపుర బొక్కంగవలదు.' G. v. 235. ఆ దెబ్బకు వానిచెంప పురపురవాచినది his cheek swelled much form the blow. పురపురలాడు purapural-āḍu. v. n. To be eager, మిక్కిలి అపేక్షపడు. ఏదైనను తినవలెనని వానినోరు పురపురలాడుచున్నది he is eager for some food.
పెటపెట
(p. 786) peṭapeṭa peṭa-peṭa. [Tel. anuk.] n. A crashing or gnashing noise, a loud sound. కొయ్యమొదలైనవి బద్దలగుధ్వని. పెటపెటమను or పెటపెటలాడు peṭa-peṭa-m-anu. v. n. To produce a crashing sound. పెటపెట అను ధ్వనికలదిఅగు. పెటులు, పెటలు, పెటిలు or పెట్లు peṭulu. v. n. To crack or split, as paint, or as grain does when roasted. To explode or go off, as a gun. పగుళ్లుపారు, చిట్లు. 'కల్పాంత దీర్ఘనిర్ఘాతసంఘంబులు పెళపెళపెళమంచు పెటిలిపడిన.' N. iv. 244. పెట్లుక్రోవి, పెట్లదిమ్మె or పెట్లకంబము peṭlu-krōvi. n. A matchlock, a gun rocket or small cannon fixed in processions, అదురువేటుగొట్టము. పెట్లమారి petla-māri. n. One who makes himself or herself liable to be constantly beaten, దెబ్బలు తిను స్వభావముగలవాడు, లేక, స్వభావము గలది. పెట్లప్పు peṭl-uppu. n. Saltpetre, nitre. పెట్లుప్పుద్రావకము peṭl-uppu-drāvakamu. n. Nitric acid. పెటుకు or పెటుక్కు peṭuku. n. A snapping sound, పెటుక్కుమనేధ్వని. Disgust, విరసము. వెటులు or పెట్లు peṭulu. n. plu. The explosions or reports of a gun rocket. అదురువేట్లు. 'సీ పెటులుచప్పుడులాత్మ భీరుస్వయంగ్రాహ పరిరంభసుఖము ఖేచరులకొసగ.' Swa. v. 52. టీ పెటులుచప్పుడులు, అదురువేట్లధ్వనులు. పెటిలించు, పెటలించు or పెట్లించు peṭilinṭsu. v. a. To explode, to burst. పేలినల్దిక్కులను చెదరునట్లుచేయు. 'పేరినలవణంపు ఘట్టములు దృస్యదిరమ్మద దావముల్ దవుల్కొనిపెటిలించు నార్బటులకోయనగా.' A. iv. 122.
పెట్టు
(p. 787) peṭṭu peṭṭu. [Tel.] v. n. To happen. కలుగు. ఉ. హరి. v. a. To put, place. ఉంచు. To lay (eggs), to bring forth (young), కను. To wear, ధరించు. To give, ఇచ్చు. To impute a blame, a crime, &c. మోపు. To raise a wall, కట్టు. To plant, నాటు. To beat, కొట్టు. n. A blow, a thump. దెబ్బ. Bestowal, charity, giving. ఈవి. A time, మారు, తడవ, ఆవృత్తి. When the verb పెట్టు is added to certain verbs like విడుచు, it means Altogether. బొత్తిగా విడిచిపెట్టు to give up entirely. This verb has numerous senses peculiar to certain nouns under which it will be found. పిల్లలుపెట్టు to bear young ones. గుడ్లుపెట్టు to lay eggs. ఆశపెట్టు to tive hopes, tantalise. ఆ తప్పును వానిమీద పెట్టిరి they laid the fault on him. ఆమెకు నూరు రూపాయిల సొమ్ము పెట్టినాడు he gave her a hundred rupees worth of jewels. అన్నముపెట్టు to serve or help food at dinner. కావలిపెట్టు to put a guard over. అపరాధముపెట్టు to pay a fine. నైవేద్యము పెట్టు to offer an oblation. బొబ్బలుపెట్టు to yell. బాధపెట్టు to torture. కనిపెట్టు to watch, to find out, to wait. చెట్లుపెట్టు to plant trees. అట్లు చెయవద్దని నాకు ఒట్లు పెట్టినాడు he adjured me not to do so. పాళ్లుపెట్టు to divide or separate into shares. గురిపెట్టు to take aim. కఠిన పథ్యము పెట్టినాడు he put him on strict diet. అంగడి or దుకాణముపెట్టు to open a shop. ఈ మాటను అంగడిలో పెట్టవద్దు do not talk of this publicity. గోడపెట్టు to build a wall. It is also added to many verbs sometimes without altering the meaning. Thus, చేర్చిపెట్టు or కూడబెట్టు to accumulate store up. పరుండబెట్టు to put to bed. దాచిపెట్టు to conceal or hide. 'ఎవ్వనియింటికి నేడు వారాసులు పెట్టనికోటయై పెరుగుచుండు' Molla. v. 48. దానిని ఒకపెట్టు పెట్టినాడు he gave her a slap. గోడపెట్టు చెంపపెట్టు రెండును వచ్చినవి his luck was bad in both ways. పెట్టుపోతలు శాశ్వతములుకావు meat and drink are momentary matters. మాటలు మా అమ్మవి, పెట్టుసవతితల్లిది the words are those of a mother, but the acts are those of a step-mother. నాల్గుపెట్లు four times. ఒకపెట్టున all at once, simultaneously. పెట్టించు peṭṭinṭsu. v. a. To have it placed or put, &c. మరొకరు ఉంచునట్లు చేయు. నాకు అన్నము పెట్టించినాడు he had food given me. పెట్టుకొను peṭṭu-konu. v. a. To keep, or put, for one's own advantage or use, ఉంచుకొను. కొడుకునకు తన తండ్రిపేరు పెట్టుకొన్నాడు he gave the boy his father's name. ఏముఖము పెట్టుకొని మాట్లాడును has he the face to speak? పెట్టుకోలు peṭṭu-kōlu. n. The act of keeping, పెట్టుకొనుట. పెట్టుచెట్టు peṭṭu-cheṭṭu. n. An epithet of the కల్పవృక్షము. పెట్టుడు peṭṭuḍu. n. Giving, charity, ఈవి, త్యాగము, దానము. పెట్టుబడి peṭṭu-baḍi. n. Money advanced or laid out. An outlay. పెట్టుమండు peṭṭu-mandu. n. A medicine given to acquire complete influence over another, తనకు లోబడియుండుటకుగాను పెట్టేమందు, వశ్యౌషధము. పెట్టుపడు peṭṭu-paḍu. v. n. To receive a blow, to be beaten, దెబ్బతిను.
మన్నన
(p. 953) mannana or మన్నిక mannana. [Tel.] n. Respect, regard, grace, favour, సమ్మానము, గౌరవము, గొప్పచేయడము. 'మనుజనాధునివలన మన్ననలుగనిరి.' V. P. ii. 18. adj. Dear, beloved. ప్రియమైన. 'పాలవెల్లికిన్ మన్నన యన్నునైతిపసిమంతనపుం దెరయైన తొయ్యలిన్.' R. v. 17. మన్నించు manninṭsu. v. a. To respect, మన్ననచేయు, గొప్పచేయు, సమ్మానించు. To excuse, forgive, to pardon. నా తప్పు మన్నించవలెను I pray you to excuse my fault. మన్నింపు mannimpu. n. Respect. గౌరవము. Forgiveness, క్షమాపణ. వానికి దెబ్బలు మన్నింపుచేసినారు they excused him the flogging, i.e., he was not punished.
మోపు
(p. 1046) mōpu mōpu. [Tel. from మోయు.] v. a. To load, place a burden on (another,) మోయుజేయు. To lay (a fault) upon (a person.) To impute, or charge (against another,) ఆరోపించు. To prop up, ఆనించు. చేతులునేలమోపెను he laid or rested his hands on the ground. 'నారిచేసినతప్పు నామీద మోపి.' Sār. D. 545. 'వాడిసూది మోపినయంతటి భూమి ధర్మనందనునకునీక' as much land as the point of a sharp needle can cover, or rest on. Kanyaka Puran. vii. 116. n. A bundle, load, burden. గడ్డిమొదలైనవాటికట్ట, భారము. A bowstring. వింటినారి. adj. Much, heavy, అధికము. ఉత్తరమున వాన నిండామోపుగానున్నది there is rain impending in the north. దెబ్బలు మోపుగాపడినవి the blows fell thick. మోపుగానుండే గాయము a severe wound. 'నగరోపకంఠంబునను మోపువైచి.' B. P. v. 113 మోవరి or మోపుకాడు mōp-ari. n. A sustainer, a supporter, one who props. మూయువాడు, భావవాహకుడు.మోపాది mōpādi. (మోపు + అది.) n. Danger, risk అపాయము, సంకటము. మోపి mōpi. A widow, విధవ, ముండమోపి. ముండమోసినది she wears a shaven pate. మోపించు mōpinṭsu. v. a. (Causal of మోయు.) To cause to bear a burden. To impose. మోయునట్టుచేయు, నిందపెట్టు. ఆ కట్టెలను వానిచేత మోపించిరి they made him carry the fagots of wood. ఆ తప్పును వానిమీద మోపించిరి they caused the fault to be laid upon him. 'మోపరికగుతగ్గు మొగ్గులభరము, మోపించుకొనునట్టి ముగ్ధునికగునె.' BD. page 129. మోపిక mōpika. n. Weight, భారము. Help, aid. కాండ్లమోపికచేసి by the help of the plough. మోపిడు mōp-iḍu. (మోపు + ఇడు.) v. a. To string a bow, విల్లు ఎక్కిడు. మోపుకొను mōpu-konu. v. a. To take upon one's-self. మోపుదల mōpu-dala. n. A charge or accusation. ఆరోపణము. A load, భారము. ఈనమోపుదలగానుండే ఆవు a cow on the point of calving. ఇవ్వ మోపుదలయైన రూకలు money still due, బాకీ ఉన్న సొమ్ము. చాలా మోపుదలగా చెప్పెను he spoke very impressively. వానిమీద నేరము మోపుదల అయినది he was charged with the offence. మోపుదలచేయు mōpudala-chēyu. v. a. To lay, charge, to bring as a charge, impose, ఆ రూకలను నేను ఇచ్చేటట్టు మోపుదలచేసిరి they made the money payable by me. మోపెట్టు mōp-eṭṭu. (మోపు + పెట్టు.) v. a. To place a weight upon, బరువుపెట్టు. ఆ కాగితనములపైని ఈరాయి మోపెట్టు put this weight on those papers. To brace a bow, విల్లు ఎక్కుపెట్టు. 'అర్జునుడు గాండీవంబు మోపెట్టె.' M. v. i. 261.
స్మారకము
(p. 1371) smārakamu smārakamu. [Skt.] adj. That reminds, that refreshes the memory. తలంపును పుట్టించే. n. Consciousness, sense, స్మృతి, తెలివి, బుద్ధిస్వాధీనము. ఆ దెబ్బచేత నాకు స్మారకము తప్పినది the blow made me unconscious. నాకు స్మారకము వచ్చినతరువాత after I came to my senses or recovered my consciousness.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close