English to Telugu Dictionary

This is the world's leading online source for english to telugu definitions/meanings, we have been helping millions of people improve their use of the telugu language with its free online services.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Admirable
(interj), భళి భళీ, శాబాష్.
Yard
(n), ( s), a measure of three feet గజము. * or court * ముంగిలి. back * పెరడు. church * క్రీస్తు గుడిలో శవమును పాతే చోటు, శ్మశానము. dock * వాడలు చక్కచేసే దొరువు the support for sails వాడ చాపలు కట్టడముకై వాడ స్తంబాలకు అడ్డముగా కట్టే కర్ర. or penis మేఢ్రము, లింగము. a bull's * ఎద్దు చేరు.
Occupation
(n), ( s), పని, వృత్తి, ఉద్యోగము. during the enemy's * of our town శత్రృవులు మా వూరిని ఆక్రమించుకొని వుండినప్పుడు.
Bedropped
(adj), చుక్కలుగల.Velvet * with gold చుక్కలు చుక్కలుగా సరిగె బుట్టాలు వేసిన మొహమలు.
Ramification
(n), ( s), శాఖోపశాఖలు. this plot had many *s యీ కుట్రశాఖోపశాఖలుగా పెరిగినది, యీ కుట్రలో నుంచి అనేక కుట్రలు బైలుదేరినవి.The *s of a discourse పరిపరి విధములైన ప్రసంగము.
Teatotal
(adj), మదద్రవ్యములు, తాగని మత సంబంధమైన.
Unguarded
(adj), not watched, not defended, careless జాగ్రతలేని,కావలిలేని, భద్రము లేని. these were * expressions ముందు ఆలోచన లేకుండాచెప్పిన మాటలు.
Hurlbat
(n), ( s), or whirlbat దువ్వేరాయి, విసిరివేసే రాయి.
Patois
(n), ( s), యాసమాటలు.
Timepiece
(n), ( s), an excellent watch దివ్యమైన గడియారము.
Fosterage
(n), ( s), పెంచడము, పోషణము, రక్షణము.
Outlaw
(n), ( s), బందిపోటు దొంగ, బందిపోటు మొదలైనవి మన మహాపాతకి.అడవిదొంగ, ధర్మబహిభ్నూతుడు, భ్రష్ట్యవ్యవహారి, ఫలానివాణ్నిపట్టుకొన్నవాడికి బహుమానము చేస్తామని ప్రకటన చేయబడ్డ ఖూనివాడు.gypsies are *s యెరుకలవాండ్లు చట్టానికి లోబడవాండ్లు కారు. Thefox and the wolf are *s నక్క తోడేలు దుష్ట జంతువులు,
To Forge
(v), ( a), (smith's work) కమ్మరపనిచేసుట. he *d a new keyకొత్తబీగముచేసినాడు.he *d the iron well ఆ యినుమును బాగా సాగకొట్టినాడు.( in writing ) కల్పించుట, సృష్టించుట. he *d a bond తప్పు పత్రముసృష్టించినారు. he *d my signature నా చేవ్రాలువలె తప్పుచేవ్రాలుచేసినాడు.
Fenny
(adj), చిత్తడిభూమిగావుండే, చితచితమనివుండే, పర్రగావుండే
Rather
(adv), more willingly with better liking మనఃపూర్వకముగా,మనసార,ఇష్టముగా. somewhat కాస్త, కొంచెము, రవంత. preferably to the other; withbetter reason ఉత్తమము, మేలు, వాసి. in a greater degree than otherwise బహుశా, సుఖముగా, హాయిగా. especially ముఖ్యముగా, విశేషముగా. moreproperly యుక్తముగా, సరిగ్గా. this is the picture of a cow or * of a buffaloఇది ఆవుపట మనేటందు కంటె బహుశః యెనుముపట మన వచ్చును. he wore a capor * a turband on his head వాడు వేసుకొన్నది కుళ్లాయివలె వున్నదనడమున కంటెబహుశా పాగవలె వున్నదనవచ్చును. he lived in a house or * a hovel on thehill కొండ మీది వొక యింట్లో వుండినాడు అది యిల్లనరాదు అయితె వొక గుడిసెలోవుండినాడు. the fruit is like a lime or * an orange అది నిమ్మపండు వంటిదిఅయితే సరిగ్గా కిచ్చిలి పండువంటిది. this feels like silk or * like shawl దీన్నితాకితే పట్టువలె వున్నది, అయితే సరిగ్గా శాలువ వలె వున్నది. this tastes of salt or * of saltpetre దీన్ని నోట్లో వేసుకొంటే వుప్పువలె వున్నది అయితే సరిగ్గా పెట్లుప్పువలె వున్నది. * a slender sword కొంచెము సన్నపాటి కత్తి. the stick was * big ఆ కర్ర రవంత లావుగా వుండినది. this is * large ఇది కొంచెము పెద్దది. this is * black ఇది రవంత నల్లగా వున్నది. I think the price is * high ఇప్పుడు కొంచెము వెల పొడిగి వున్నదేమో. * than see it he ran away దాన్ని చూడలేక పారిపోయినాడు. I had * read Telugu than Tamilఅరవాని కంటె తెలుగు చదవడము నాకు యిష్టముగా వున్నది.why should I go ? I had * stay at home today బయిట యెందుకుపొయ్యేదినేడు హాయిగా యింట్లో కూర్చుంటాను, బయిట యెందుకు పొయ్యేది యీ వేళ యింట్లో వుండడము నాకు సంతోషము. he had * die than submit ఒకనికిలొంగడము కంటె వాడికి చావడము యిష్టము, లోబడేటందుకంటె సుఖముగా ప్రాణమువిడుచును. you may go on horse back I had * go on foot నీవు కావలిస్తేగుర్రము మీదపో, నేను హాయిగా నడిచివస్తాను. I will not give rupees I would *go without అది లేకపోయినా పోతున్నది గాని నేను పది రూపాయలు ఇవ్వను. theyhad * eat rice than bread; but they would * die than eat flesh రొట్టెనుతినడము కంటె వాండ్లకు అన్నము తినడము యిష్టము, వాండ్లు మాంసమును తినడమునకంటె సుఖముగా ప్రాణమును విడుతురు. he would * drink wine than water నీళ్ళకంటె వాడికి సారాయి తాగడము యిష్టము. I will read this but I would * readSanscrit దీన్ని చదువుతాను గాని అయితే నా మనసంతా సంస్కృతము మీద వున్నది. Iwould * go tomorrow రేపు పోతే మంచిది, రేపు పోతే వాసి. I was notdistressed for food but * had plenty నాకు కూటికి కష్టమనేది లేదు నా వద్దవిస్తారము వుండెను. he is not ignorant he is * a good scholar వాడు శుద్ధతెలియని వాడనేది యెక్కడ వాడు కొంచెము చదువుకొన్న వాడాయెనే. do you call .her .agirl ? she is a * woman దాన్ని పడుచు అంటావా అది యెక్కడ పడుచు అది నిండుఆడదాయెనే. it is* too much to hear such a man abused అట్లాంటి వాణ్నిదూషించగా వినడమనేటిది యెంత మాట.
To Unthrone
(v), ( a), to cast down పడదోసుట, రాజ్యభ్రష్టుణ్నిగా చేసుట.
Linchpin
(n), ( s), యిరుసాణి, యిరుసు యొక్క చీల.
Butter
(n), ( s), ఒక తరహా గిన్నె.
Empyrean
(n), ( s), తేజోమండలము, జ్యోతిర్మండలము, అగ్నిలోకము.
Chaste
(adj), పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, వ్యభిచారము లేని, కచ్ఛశుద్ధిగల. a * woman కచ్ఛశుద్ధి గలది, పతివ్రత, సుశీల. a * style పిచ్చి శృంగారము లేని శయ్య. the Sacuntala is written in a very * style శాకుంతలము యొక్క శయ్య మహా సరళముగా వున్నది. the * tree వావిలి చెట్టు.
To Cut
(v), ( a), కోసుట, నరుకుట, తెంచుట తెగవేసుట, చివ్వుట, చెక్కుట, కాటుబెట్టుట.this knife will not * యీ కత్తి తెగదు. to * betelnut ఒత్తుట. he * the limesinto halves ఆ నిమ్మకాయలను రెండేసి బద్దలు చేసినాడు. to * greens తరుగుట. to *with scissars కత్తిరించుట. you must * your hair మంగల వాడి వద్ద వెంట్రుకలుకత్తిరించుకో. these words * him to the heart యీ మాటలు వాడి మనస్సులోగాలముగా నాటినవి కోస్తున్నవి. the water has * the bank నీళ్లు కట్టను తెగకోసినది.to timber మానును కొట్టుట నరుకుట. that road *s my garden ఆ దారి నా తోటనడమ పోతున్నది. he * them or he cut their acquaintance వాండ్ల విహితమువిడిచిపెట్టినాడు. he * my wages నా సంబళములో కొంచెము పట్టుకొన్నాడు. to *away చివ్వుట. the calf *s capers దూడగంతులు, వేస్తున్నది. to * down నరుకుటto * down a man after being hanged వురితీసిన పీనుగను దించుట. he * aqueer figure వికారమైన వేషము వేసుకున్నాడు, మారు రూపు ధరించినాడు. he * agrand figure in the world నిండా ప్రసిద్ధుడుగా వుండినాడు. to * a joke పరిహాసముచేసుట. the horse has * his knees ` గుర్రానికి మోకాళ్లు కొట్టుకొని పోయినివి. to * off నరకుట, తెగవేయుట, కొట్టివేసుట. he * off their entire army వాండ్ల దండునంతాధ్వంసము చేసినాడు, సమూలనాశనము చేసినాడు. disease * them off in youthరోగము వాండ్లను వయస్సులో తుంచుకొని పోయినది. the river came in a floodand * us off from them యేరు వెల్లువ వచ్చినందున వాండ్లతో మేము కలిసేటందుకులేకపోయినది. If you * off my pension what can I do నా కూట్లో రాయి వేస్తేనేనేమి చేసేది. this *s him off from all hope of success యిందు వల్ల తనకుకూడివస్తున్నదన్న ఆశలేక పోయినది. the final vowel of this word is * off యీశబ్దమునకు అంత్యమందు వుండే అచ్చు లోపించినది. to * out or prepare సిద్ధముచేసుట. he * out two cups out of the ivory ఆ దంతములో తొలిచి రెండు చిప్పలుచేసినాడు. he * a face out of the stone ఆ రాతిలో ఒక ముఖమును చెక్కినాడు. he* a piece out of the wood ఆ కొయ్యలో ఒక తునక నరుక్కొన్నాడు. he * me outనన్ను వోడకొట్టినాడు. I have work * out for the next 2 years నాకు యింకారెండేండ్లకు పనిసిద్ధముగా వున్నది. to * to pieces బద్దలు చేయుట. * the mattershort వెయ్యి యేల, వెయ్యి మాటలే తుదకు, మెట్టుకు. he * the matter short ఆసంగతిని ఒక దెబ్బలో తీర్చినాడు. the child has * a tooth ఆ బిడ్డకు పల్లు మొలిచినది.
Discontentedly
(adv), అతృప్తిగా, అసమాధానముగా.
To Regain
(v), ( a), మళ్లీ పొందుట. when he *ed the shore వాడు మళ్లీ గట్టుకువచ్చి చేరినప్పుడు. he *ed his health వొళ్లు కుదిరినది. he *ed his spirits వాడికిదైర్యము వచ్చినది, ధైర్యమును తెచ్చుకొన్నాడు.
To Humble
(v), ( a), అణగదొక్కుట, అణుచుట. he *d their pride వాండ్ల గర్వమునుఅణిచినాడు. he *d himself to them వాండ్లకు లొంగినాడు.
Expertly
(adv), నేర్పుగా, నిపుణతగా, చమత్కారముగా.
Mandali Bangla Font
Mandali
Download
View Count : 30425
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 24347
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 21560
Suguna Bangla Font
Suguna
Download
View Count : 18585
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 16003
NTR Bangla Font
NTR
Download
View Count : 15327
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 14597
Gidugu Bangla Font
Gidugu
Download
View Count : 13416

Please like, if you love this website