Telugu to English Dictionary: పెట్టి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకిలిపడు
(p. 3) aṅkilipaḍu ankili-paḍu. v. i. To obstruct to come in the way. అడ్డుపడు. అంకిలిపెట్టు v. t. To prevent.
అంగడి
(p. 4) aṅgaḍi angadi. [Drav.] (Gen. అంగటి Loc. అంగట, plu. అంగళ్లు) n. A shop. అంగడిపెట్టు to open a shop. అంగళ్లవాడ range of shops. అంగట పోకార్చి selling in the shop. అంగడివీధి a market place. ఆ సంగతిని అంగడిలో పెట్టినాడు he revealed or exposed the matter.
అక
(p. 106) aka āka. [Tel. from ఆగు to stop.] n. A check, an order, a command. Custody. అడ్డగింపు, ఆజ్ఞ, చెర. 'కికురించిరిచ్చిపుచ్చుకొను చోటులవారలాకకులోనుగాకప్పులీక.' Swa. iii. 163. ఆకట్టు (ఆక+కట్టు) ākaṭṭu. v. i. To prevent, hinder, check. నిరోధించు. ఆకపడు āka-paḍu. v. i. To intervene, to interpose. అడ్డిపడు, రామా: కిష్కిం: ఆకపెట్టు āka-peṭṭụ. v. t. To prevent.
అక్షతలు
(p. 21) akṣatalu akshatalu. [Skt.] vulgarly అక్షింతలు n.plu. (lit. unbroken grains.) Grains of raw rice, made yellow with saffron. The red mark worn by some Hindus on the forehead formed of saffron and slaked lime. పసుపురాచిన బియ్యము, పేలాలు. నొసటను పెట్టుకోవడమునకై పసుపు సున్నము కలిపిన బొట్టు.
అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అగడు
(p. 22) agaḍu or అగుడు agadu. [Tel.] n. Ill fame, bad name, clamour, disturbance. నింద, అపవాదము, రచ్చ, రట్టు, అల్లరి. దాన్ని అగుడుపెట్టకు you must not blab of this. అగుడుసేయనటంచు నానబెట్టినగాని.' N. 7. 154. అగడుపడు v. To be blamed; to be confused. నిందపడు, తొట్రుపడు. బెగడువలదనుచుబెట్టిద మగునెవ్వగ నగడుపడుచు నాడుపడుచులే పగవారికి వలదననా పగవారికి నేలయొసగె పద్మజుడనుచున్. Vasu. vi.
అచ్చు
(p. 29) accu aṭṭsu. [Tel.] v. n. To be indebted, suffer loss. ఋణపడు, దండగపెట్టు నీకు నే వచ్చియున్నానా am I indebted to you? దానికి పదిరూపాయలు అచ్చినాను I lost ten rupees by that business. See. అచ్చిఉండు.
అచ్చుకొను
(p. 29) accukonu aṭṭsu-konu. [Tel.] v. n. To pay, pay wrongfully, liquidate. దండగపెట్టు. వాడు దివాణమునకు పది రూపాయలు అచ్చుకొన్నాడు he paid ten Rupees to government. ఆ నేలకుగాను నలభైరూపాయలు అచ్చుకొనియున్నాను. I have suffered, on account of that land, a loss of forty rupees. మేము అచ్చుకొనువారము we will make it good.
అట్టెడ
(p. 33) aṭṭeḍa aṭṭeḍa. [Tel.] n. A sieve. తూర్పారపెట్టిన ధాన్యమును జల్లించే ఒక విధమైన జల్లెడ. A bridge. A part of a fort. 'అట్టెళ్లపైవారు, అట్నాలపైవారు, కోటకొమ్మలకును జేరువనున్నవారు.' Pal. 461.
అడలుచు
(p. 35) aḍalucu aḍaluṭsu. [Tel.] v. a. To daunt. భయపెట్టు.
అడుచు
(p. 37) aḍucu aḍuṭsu. [Tel.] v. n. To close, to shut. మూసివేయు. అందులో నాలుగు వాకిళ్లు అడిచియున్నవి four of the gates are closed, ఆ గుడ్లను ఈ పెట్టెలో అడుచు (here అడుచు is for అణచు) cram the clothes into the box. Also, v. a. To beat, strike, thrash. To destroy కొట్టు, వళింపచేయు. 'ఎమ్ములిరియుగ శిలతో నడిచిన.' P. i. 729. అడుచుకొను aḍuṭsukonu. v. To contract, choke, be stopped. ఆ కాలవలో ఇసుక అడుచుకొన్నది the channel is choked with sand. వాని రొమ్మడుచుకొన్నది he has a contraction of the chest. గొంతు అడుచుకొన్నది, మాట్లాడకూడలేదు his throat is hoarse, he cannot speak.
అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అడ్డము
(p. 38) aḍḍamu or అడ్డమైన aḍḍamu. [Tel.] adj. Cross. నన్ను అడ్డమైన మాటలు ఆడినాడు he reviled me. అడ్డమైనకూళ్లు any food that comes to the hand. నాకు అడ్డమైనపని పెట్టుతున్నాడు he employs me in anything that comes to hand. వాడు అడ్డదోవలు తొక్కుచున్నాడు he goes the wrong way to work. అడ్డకట్ట aḍḍa-kaṭṭa. [Tel.] n. A dam or bank, an embankment. సేతువు, చేలకు నీళ్లు నిలిచేటందుకు కట్టిన గట్టు. అడ్డకత్తి aḍḍakatti. A broad sword. పట్టిసము. అడ్డకమ్మి aḍḍa-kammi. A cross piece, the cross selvage in cloth. అడ్డకర్ర aḍḍa-karra. A cross-piece of timber: an obstacle: a bar. విఘూతము. నా పనికి అడ్డకర్రలు వేయుచున్నాడు he throws difficulties in my way. See అడ్డము. అడ్డగోడ addagōḍa a cross-wall. అడ్డచాపు aḍḍa-tṣāpu. A cross beam. అడ్డవాసము. అడ్డతల aḍḍa-tala. A narrow projecting head: having a narrow fore head. నిడుపు తల. అడ్డదూలము aḍḍa-dūlamu. A cross beam. అడ్డదోవ aḍḍa-dōva. A crossway. అడ్డపలక aḍḍa-palaka. A cross plank. అడ్డపట్టె. aḍḍa-paṭṭe. A thick board drawn by two oxen used for smoothing a ploughed field after the grain is sown. మడిసమముచేసే మాను. అడ్డుపడు aḍḍa-paḍu. [Tel.] v. n. To interpose, to help; to obstruct, impede. విఘూతమగు, వారించు. నా పనికి అడ్డుపడ్డాడు he threw obstacles in my way. భార్యను కొట్టబోతే కొడుకు అడ్డుపడినాడు as he was going to strike his wife his son interposed. నేనడ్డపడకపోతే వాండ్లు వత్తురు had I not interposed they would have died. అడ్డపాటు aḍḍa-pāṭu. [Tel.] n. Obstacle, hindrance, obstruction. అడ్డి, విఘ్నము. అడ్డబాస aḍḍa-bāsa. n. A nose jewel. బులాకి. అడ్డబొట్టు aḍḍa-boṭṭu. A cross mark worn by the Hindus on their fore-head. అడ్డమాను aḍḍa-mānu. A cross bar. వాడు అడ్డవాట్లు వేస్తున్నాడు he throws impediments in the way.
అడ౛డి
(p. 34) aḍazaḍi aḍazaḍi. [Tel.] n. grief. అల౛డి. దుఃఖము. అడ౛డిపెట్టు v. t. To grieve దుఃఖపరుచు. చ నన్నడ౛డిపెట్టుమాట యిటులాడగ గూడునె యీయకార్యముల్ విడుపులతాంగి. మార్క. i. ఆ.
అదనబదన
(p. 42) adanabadana adana-badana. [Tel.] adv. Safely, without being hurt. Economically. చెక్కుచెదరకుండా, పోణిమిగా. 'అంబునిధితీరమున కులాయంబమర్చికొని కలంగుచు టిట్టిభి గ్రుడ్లు పెట్టి పొదిగె నేమరిపాటు లేకదనబదనకలచబడకుండ నొండొంటి గలిపికొనుచు.' P. i. 616. 'అందనబదననేగూర్చి మాయప్పుదీర్చిపొమ్ము నీవన్న.' Sankara H. iv. 37.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83827
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79499
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63536
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57803
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39184
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38345
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28495
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28186

Please like, if you love this website
close