Telugu to English Dictionary: యెరుక

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

(p. 1) a a. 7. [Tel.] A suffix meaning 'By oneself without the help of another'. సర్వమును నీవ యెరుగుదువు. Or, without a rival, e. g., 'శత్రుక్షయంబు చేసి యెవ్వరికి నీక తామ యేలు చుండెమనియెడి మోహంబున.' భాగ. xii 18.
అరకొర
(p. 78) arakora or అరగొర arakora. [Tel.] Sticking. అనుమానము, సందేహము. 'కరకంఠభక్తుల కరకొరలేక వెరబిబ్రతుకు పొమ్మువేయును నేల.' BD. v. 327. 'తానున్ బతియున్ మనమున నరగొరయెరుగక.' Parij. v. 74.
అరుణము
(p. 82) aruṇamu aruṇamu. [Skt.] adj. Red. ఎర్రని. అరుణత or అరుణిమ. n. Pink, dark red. ఎరుపు. ఇంచుకయెరుపు, కపిల వర్ణము, సంధ్యా రాగము. అరుణుడు aruṇuḍu. n. Sun. The charioteer of the sun. సూర్యుడు, సూర్యసారథి. అరుణోదయము aruṇōdayamu. n. The dawn of the day. వేకువజాము.
ఎరుగు
(p. 190) erugu erugu. [Tel.] v. a. To know, be aware of, to understand. తెలిసికొను, గ్రహించు. వాడు దానిని ఎరిగి చేసినాడు he did it on purpose or intentionally, or ఎరుగక చేసిరి they did it unintentionally ఉపకారము ఎరిగినవారై being grateful, feeling one's kindness. మీరు ఎరిగియుండవలసినది I call upon you to be witness or to observe this. సత్తువయెరిగి లంకణముకట్టవలసినది let the patient be kept fasting in proportion to this strength. ఎరుగని ignorant, innocent. దేహమెరుగక being stupified, or insensible. ఎరుగవా don't you know? ఎరుగను I do not know. మేము కుడిచెయ్యి ఎడమచెయ్యి యెరుగనివారమై as we are such simple people that we do not know our right hand from our left నేను బుద్ధి యెరుగకమునుపే when I was an infant, before I knew anything. ఎరిగితెచ్చుట గాని యెరుగక కాదు I was well aware of what I was bringing: I did not bring it unknowingly. పాటు యెరుగని భాగ్యము fortune that knows no decline. ఎరుగమి erugami. n. Ignorance తెలియమి.
కామి
(p. 273) kāmi kāmi. [Tel. neg. noun from అవు.] n. The not being. That which is not or nil. కొరగాములు evil doings, naughty pranks. 'ఇంక నెన్నండు నిట్టి కొరగాములు సేయక బుద్ధిమంతుడవై యుండిమనిన నతండు లజ్జావనతవదనుండగుచు నచ్చోటువాసి గంగాద్వారంబున కరిగియందు' M. III. vi. 'క 'ఏనట్లు చూచి చెప్పితిగాని యది రణంబుపాటిగామి యెరుగుదున్' M. IX. ii. 114.
కింకిరి
(p. 281) kiṅkiri kiṇkiri. [Tel.] n. Anger. కోపము. Nastiness: రోత కింకిరచేయు to foul or defile బిడ్డ యెరుగుట. 'యోగినరుని చీరె పైగింకిరిచేయ.' Navan, 315. కింకిరిపడు kinkiri-paḍu. v. n. To get angry. కోపగిల్లు. To feel nasty రోతపడు. కింకిరిపాటు kinkiri-pāḷu. n. Getting angry. కోపపడుట. Feeling disgusted with రోతపడుట. 'అతిథినినుగొరనేనియు మతిగింకిరి పడకయోలమాసగొనక.' M. XIII. i. 55.
కొలది
(p. 323) koladi or కొద్ది koladi. [Tel.] n. Extent, measure, height, depth, limit. పరిమితి. Means, mode. Power, glory. శక్యము. 'తలపుకొలది బడదు దైవికమేకాని' (Vēma) not according to our will but as god wills. నీకొలదియెరుంగక in ignorance of thy power. ఏకొలదినైనా by all means. ఆయన చిత్తము కొలదియెరింగి in conformity with his pleasure. L. XVII. 136. 'నోటికొలందుల మాట్లాడి.' L. VII. 481. saying anything that came into his mouth. As an affix, కొలది or కొద్ది. In proportion to, according to, in conformity to. నాలుగు ఏండ్లకొలది చదివిరి they studied for four years. మోకాలికొలది నీరు water up to the knee. ఈకొలది thus far, so much, such. 'గుడ్లకొలదిగ కన్నీరు గ్రుక్కుకొనుచు.' Suca. iii. 156. R. v. 187. M. XII. i. 242.
దేవుడు
(p. 608) dēvuḍu dēvudu. [Skt.] n. God. A deity, దేవత, వేలుపు. దేవ dēva. adj. Of God, దేవుని యొక్క. దేవకాంచనము dēva-kānchanamu. n. A certain tree. Bauhinia purpurea. దేవత dēvata. n. A deity, generally a goddess; but also a god, వేలుపు, దేవుడు. గ్రాందేవత the village goddess. దేవతరువు దేవతరువు dēva-taruvu. n. A heavenly tree, కల్పవృక్షము. A venerable tree. దేవతాజీవము dēvatā-jīvamu. n. A godlike or harmless creature. 'ఆ తెలివి యెరుగనట్టి దేవతాజీవుల, వనరిదెచ్చబిడ్డవలెనుసాకి, పాపమెరుగకంతబట్టి చంపుదురయా.' Vēma. దేవతాడిచెట్టు dēvatāḍi-cheṭṭu. n. The tree called గరాగరీ. Andropogon serratus. డావరడంగిచెట్టు. దేవత్వము dēvatvamu. n. Divinity, deification, apotheosis. 'అశ్మాపియాతిదేవత్వం మహద్భిఃసుప్రతిష్ఠితః. ' A stone even attains divinity when consecrated by the noble. (Hitopadesa. i. 45.) దేవదత్తము dēva-dattamu. n. Lit. the gift of god. The name of the conch of Arjuna, అర్జునునిశంఖము. దేవదత్తుడు and యజ్ఞదత్తుడు are two names in Sanskrit Law or Logic like John Doe and Richard Roe, or Titius and Seius, or Omar and Zeid in Arabic Law. దేవదారువు dēva-dāruvu. n. The Cedar: the Himalayan Cedar. Cedrus deodara. (Watts.) commonly called deodar. The Erythroxylon dreolatum (Linn.) Uvaria longifolia. Rox. iii. 664, 666. సురవృక్షము, అమరద్రుమము. Chittagong wood; usually called cedar. చారలదేవదారువు the Trincomalli wood. Berrya ammonilla (Watts.) దేవదాసి dēva-dāsi. n. A dancing girl employed in a temple. దేవనాగరి dēva-nāgari. n. The name of the character in which Sanskrit is usually printed. దేవభూతము or దేవసాయుజ్యము dēva-bhūtamu. n. Divinity, దేవత్వము. దేవమణి dēva-maṇi. n. A fortunate curl on a horse's neck. గుర్రముమెడసుడి, అశ్వములకు ఉండే సుడివి. శేషము. చింతామణి, మహామేద అనే చెట్టు. R. i. 131. Also, కాస్తుభము. (q. v.) దేవమాతృకము dēva-mātṛikamu. n. A country or land which is dependent on providence, i.e., watered by rain only, not by streams. వృష్ట్యంబుసంపన్న వ్రీహిపాలితదేశము. వాననీళ్ల చేత పండే పైరులుగల దేశము. దేవయజ్ఞము dēva-yagnyamu. n. The body sacrifice called వైశ్యదేవము. A sacrifice, హోమము, వేలిమి. దేవయానము dēva-yānamu. n. The car or vehicle of a god, దేవతావిమానము. దేవర dēvara. n. God. దేవుడు. A lord or master స్వామి. My lord, Sir. A title of respect used in addressing superiors. దేవరవారు your honour. ఇంటిదేవరలు household deities. కులదేవతలు applied particularly to the manes of married women, ముత్తైదువలు. Your reverence, a phrase among Jangams. జంగములకు శ్రేష్ఠనామము. దేవలుడు dēvaluḍu. n. A temporary paid priest or incumbent. A term of contempt, like priestling. A sacristan, beadle, or attendant in a temple, గుడిలో దేవుణ్ని పూజచేసేవాడు, తంబళవాడు, నంబివాడు. దేవళము dēvaḷamu. n. A temple, గుడి, దేవాలయము. దేవవర్ధకి dēva-varthaki. n. The 'artist of the gods,' a title of Visvakarma. దేవసరులు dēvasarulu. n. A sort of grain. దేవాంబరము dēv-āmbaramu. n. A sort of cloth. BD. iii. 120. దేవాజీవి or దేవాజీవుడు dēvā-jīvi. n. An attendant on an idol, దేవలుడు; a godlike creature, one that does no harm, as a bird. దేవాదాయము dēv-ādāyamu. n. The income of a temple. An endowment to a temple, land given for the unkeep of a temple, land given for the unkeep of a temple free of all rent. గుడిమాన్యము. దేవానాంప్రియము dēvānām-priyamu. n. Lit. The beloved of the gods, i.e., a goat. మేక. దేవానాంప్రియుడు dēvānām-priyuḍu. n. A foolish or ignorant man. మూర్ఖుడు. దేవాయుధములు dēv-āyudḥamulu. n. Stones and cudgels. రాళ్లు దుడ్డుకర్రలు. (దేవశబ్దమునకు యజ్ఞము అర్ధముచేసి యజ్ఞమందు ఆయుధములు రాళ్లు దుడ్లు మొదలైనవి గలవు గనుక ఆ సంబంధమునుపట్టి యీ పదము ప్రయోగించినారు.) A. vi. 100. దేవాలయము dēv-ālayamu. n. A temple. దేవళము. దేవి dēvi. n. A goddess, particularly Parvati. A queen. Cf. పుట్టపుదేవి. Madam. Lady. దేవేరి or దేవెరి dēvēri. n. A queen, a lady. దొరసాని, రాజపత్ని.
పఠితము
(p. 703) paṭhitamu patitamu. [Skt.] adj. Fallen, alighted, defeated, overthrown. Wicked, abandoned. పఠితత్వము patitatvamu. n. The state of having fallen from one's office or righteousness. పఠితుడు pati-luḍu. n. A fallen creature, a sinner. పడినవాడు, పదవిచెడినవాడు. ఏమియెరుగని పఠితుగా (for పతితుడుగా) ఉన్నాడు he is as innocent as the babe unborn. పతితపావనుడు a restorer of the fallen, a saviour of sinners.
మగ
(p. 940) maga maga. [Tel.] adj. Male. మగపోణిమి యెరుగనిది a pure maid. మగలమగడు a phrase meaning the chief of men, a hero. గండరగండడు. 'నయనయుగళివెలి దామరలమ గలమగలై, డాలెగయు.' Swa. iv. 169. మగకరువు want of men. మగటిమి or మగంటిమి magaṭimi. n. Manliness. పౌరుషము, పుంస్త్వము, మగతనము, శౌర్యము. మగడు or మగండు magaḍu. n. A male, a man, పురుషుడు, మగవాడు. A husband, పెనిమిటి. A ruler, a king. రాజు. A hero, a courageous man, శూరుడు 'మగువలుమగలని యెరుగడు.' R. ii. 112. 'మన్నెరాజులకెల్ల మగడనైయుండు, నన్నైనదల చకనాముద్దుకూన.' L. viii. 30. మగతనము maga-tanamu. n. Manliness, potency. పుంస్త్వము, పౌరుషము. మగది magadi. n. The male of any animal. మగనాలు maga-n-ālu. (మగని + ఆలు.) n. A woman whose husband is alive. మగడుగలస్త్రీ. A good woman. మగపాడి maga-pāḍi. n. Courage, manliness, శౌర్యము. మగబీర maga-bīra. n. Malabar Cat-mint. Anisomelos malabarica. మగమానికము or మగరాయి maga-mānikamu. n. A diamond. వజ్రము. మగమానికపువాలు or మగరాతివాలు maga-mānikapu-vālu. n. Indra's thunderbolt. వజ్రాయుధము. మగరూరీ magarūrī. [H.] n. Haughtiness, arrogance. మగలింగము maga-lingamu. n. A common plant called 'the stinker.' Rox. i. 109. మగవాడు maga-vāḍu. n. A man, a male, పురుషుడు. A hero, శూరుడు.
మడ్డి
(p. 945) maḍḍi maḍḍi. [Tel.] n. Dregs, lees, sediment మడ్డి స్తంభము a pole or mast smeared with lees, up which boys climb, on festival days, for prizes places on the top. ఆముదపుమడ్డి the dregs of castor-oil. adj. Foul, dull, stupid, awkward, clumsy. మడ్డియెరుపు a dull red. మడ్డితిండి foul feeding. మడ్డినిద్ర deathlike sleep, dead sleep. వాడు వట్టిమడ్డి he is a blockhead. మడ్డికాగితము maḍḍi-kāgitamu. n. Coarse paper, ముతకకాగితము. మడ్డిచెక్క maḍḍi-chekka. n. A sort of forest wood used for dyeing cloth red. Morinda citrifolia. Ainsl. ii. 254. Morinda bracteata. Rox. i. 544. Wight's Plate, 126. ములగచెక్క. మడ్డితనము maḍḍi-tanamu. n. Rudeness, rusticity, clownishness, stupidity, ఎడ్డెతనము, మోటతనము, మోద్దైయుండడము. మడ్డిమైనము maḍḍi-mainamu. n. Bees-wax. ముతక మైనము.
మాట
(p. 970) māṭa māṭa. [Tel.] n. A word, పదము. A promise, వాగ్దత్తము, ప్రతిజ్ఞావచనము. Slander, నింద. Opinion, rumour, వృత్తాంతము. అతడు నీ మాట చెప్పలేదు he did not speak of you. ఇది వేరే మాట this is another affair, another thing. వానిమాటకాదు this is not about him, I am not talking about him. గడియకు ఒకమాట చెప్పినాడు he changed his mind every hour. మంచిమాట (interj.) Very well. దాన్ని గురించి రెండో మాటలేదు there is no alternative. వారివిద్ద మాటలుపడినాడు he was reproached or reprimanded by them. In some phrases the word మాట need not be translated. Thus, ఆమె తిరిగీ వస్తున్నదనేమాట తెలిసి knowing that she would return. నేను దానిని కొన్నమాట రూఢి it is very true I bought it. ఆమాటే యెరుగను I know nothing of it. ఇందుచేత మాటవచ్చును by this you will get into disgrace. అతడు మాటతప్పలేదు he did not fail in his promise. మాట తప్పినవాడు మాలవాడు a promise breaker is a pariah, i.e., is a mean wretch. నేను పోయినమాట వానికి ఎట్లా తెలిసినది how did he know that I was gone? అతడు పోయేమాట ఉండేమాటా does he propose to go or stay? వాడు ఉండేమాట యింకా తెలియలేదు I do not as yet know that he will remain. మాటకుమాట word for word, literally. నా మాట అడుగుదాటకు transgress not my command. తనమీద మాటరాకుండా ఇట్లా చేసెను he did this to avoid blame. మాటవినుట to obey. ఎంతమాట what nonsense! వానిమాట వాని ఒడిలో వేసినాను I acted as he desired. నీకు మాట నాకు మూట a command is easy to give but hard to perform, or a word from you will make me rich. వెయ్యిమాటలేల why discuss it at length, in a word. ఆ పెండ్లి మాట యీ గ్రంథములో లేదు there is no mention of the marriage in this book నామాటవేరు, నీమాట వేరు I say one thing you say another, my opinion is different from yours, my case is quite different from yours. వానికి నాకు మాటలు లేవు he and I are not on speaking terms. వానితో నీకేమిమాటలు why do you speak with him? ఈమాట వింటే ఆయన యేమనును if he hears of this what will he say? కడపటిమాటయేమి what was the upshot of the business? ఇప్పట్లో వాని మాట సాగదు he has now no influence. కడకు వానిమాటే ముందరికివచ్చినది at last his words proved true. దానిని గురించి ఇంకా యేమాటా తెలియలేదు I do not yet know the result. మాటలకు పట్టుకొంటే విడవడు if he begins talking he will never stop. అదెక్కడిమాట what nonsense! such a thing is impossible. మాటలు మంచివే కాణి మనసు మంచిదికాదు he talks well but has a bad heart. ఇంకా మాటలు రాని బిడ్డ a child that cannot yet speak. వానికి ఆ ఊరిలో మాట వాసికద్దు లేక మాట సాగుతుంది he has influence in the town. ఆయన మాటకు ఎదురులేదు his word is law. మాటలకుమాత్రము పేదరికములేదు as far as words go he is rich enough. ఒక మాట యిచ్చి పదిమాటలు తీసుకొన్నాడు his reproaches were returned ten-fold. మాటకాడు māṭa-kāḍu. n. A good public speaker, సభయందు భయములేక మాటాడువాడు, వక్త. మాటకారి māṭa-kāri. n. A skilful speaker, యుక్తిగా మాటాడువాడు. A talkative person, వాచాలుడు. మాటలమారి māṭala-māri. n. A talkative person, మిక్కిలి మాటాడువాడు. మాటలాడు, మాటాడు or మాట్లాడు māṭa-l-āḍu. v. n. To speak, talk, converse, to reproach. నన్నెందుకు ఊరికె మాటలాడుతావు why reproach me for nothing? S. iii. 41.
మించు
(p. 982) miñcu minṭsu. [Tel.] v. a. To surpass, excel; to transgress. అతిశయించు, అతిక్రమించు. చదువులోవారిని మించినాడు he surpassed them in learning. అతడు ముందు మించిపోయినాడు he is already gone on. మించిమాట్లాడకు do not talk rashly. పని మించిపోయినది it is now too late, the thing is gone by. చెయ్యిమించవద్దు do not lay a hand upon him, do not take the law into your own hands. ఇంతకుమించి యెరుగను I know nothing more than this. పెదవికి మించినపల్లు a projecting tooth, i.e., a scapegrace, a disobedient fellow, మించిమించియుంటే, లేక, మహా ఉంటే పదిరూపాయీలు ఉండవచ్చును at the utmost there may be ten rupees. ఆరూకలను మించ ఇచ్చివేసినాడు he had already paid the money. 'ఉత్తరంబుమించి యరిగిన' M. III. i. 2. when they first went northwards, ఉత్తరాదికి ముందుగా పోవునప్పటికి మించుకాలు the right leg, కుడికాలు. n. A kind of ring worn on the second toe, కాలిచుట్టు. Excess, ఆధిక్యము. Lightning, మెరుపు. Brightness, ప్రకాశము, మించూనె it flashed. మెరుపునుపొందెను, మెరసెను. 'తొలుదొల్తనుదయాద్రి శిలదాకిమించూని.' A. i. 43. మించుబోడి or మించుబోణి minṭsu-bōḍi. n. A beautiful girl. మెరుపు తీగెవంటిచక్కనిస్త్రీ. మించుదల minṭsudala. n. Transgression. అతిక్రమణము. Excess, greatness, ఆధిక్యము.
మిడి
(p. 985) miḍi miḍi. [Tel. from మిడియు.] n. Pride, insolence, మిడిసిపాటు, గర్వము. adj. Proud, insolent, మిడిసపాటుగల. High, raised, ఉన్నతము. మిడిపండ్లు projecting teeth, మిట్టపండ్లు. Sharp, hot, తీక్ష్ణము. మిడిమాధ్యాహ్నము midday, noon. మిడిముళ్లు spurs. మిడికించు miḍi-kinṭsu. v. n. To blink (the eyes), మిణకరించు. 'కమలుమిడికించునుగుడ్లగూబరీతి.' S. iii. 32. blinking like an owl. మిడిగుడ్లు miḍi-guḍlu. n. Large prominent eyes. మిడిగుడ్లవాడు a man with large eyes. మిడిగొను miḍi-gonu. v. n. To glitter, to flash. మెరయు. 'మిడిగొనుపైడిచేకటులు, మేలిమినూలుదండ.' H. iv. 101. మిడినాగు or మిణ్నాగు miḍi-nāgu. n. A springing serpent. The adder. చివుక్కున ఎగిరిపడే సర్పము. మిడిసి మిణ్నాగువలె పడుతాడు he is as proud as a serpent.మిడిపోవు miḍi-pōvu. v. n. To lose brilliance, become blunt, to be spoiled, ౛బ్బుపడు. To become less. To be an exception, తక్కు. To avoid, తొలగు. 'మిగులనొచ్చియు వాడు మిడివోనికడిమి.' HD. i. 2019. మిడినల్లి or మిణ్నల్లి miḍi-nalli. n. A flea. మిడిమేలుపు miḍi-mēlapu. adj. Pragmatic, hot headed, haughty. తలకొట్లమారియైన. తలకొవ్విన. 'అడిగినజీతంబియ్యని మిడిమేలపుదొరనుగొలిచి మిడుకుటకంటెన్. వడిగలయెద్దులగట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలోసుమతీ.' Sumati Satakam. మిడిమేలము miḍi-mēlamu. n. Insolence, haughtiness, మిడసిపాటు. 'మగువలుమగలని యెరుగడు, మృగములకోరసిలడేమి మిడిమేలమితండగపడుననితలచితిమే.' R. ii. 112. మిడియ miḍiya. n. A word of the Veda, వేద వాక్యము. 'క తలచియపుడందొకింతయు దొలుతటితరవాతి మిడియదోచకమరియె వ్వలనరసినశ్రుతిశబ్దము పలకునకున్ రాక పెగడుపరచినగలకన్.' పర. ii. మిడియు miḍiyu. v. n. To flash or fly off as a chip of wood or a drop of water. ఎగురు. ఆ రాతిచెక్క మిడిసిపడినది the chip of the stone leaped out and fell down. మిడివిల్లు miḍi-villu. n. A pellet bow, ఉండవిల్లు. 'తడియుచుకైతవతరుణియెక్కిన మిడివింటిగతినున్న మెలతలుడాసి.' Dab. 170. మిడిసిపడు miḍisi-paḍu. v. n. To bounce, leap; to be insolent, మిట్టిపడు, త్రుళ్లిపడు. మిడిసిపడి చచ్చినాడు he suddenly fell down dead. మిడిసిపాటు miḍisi-pāṭu. n. Bouncing, exultation, pride, త్రుళ్లుట.
ముది
(p. 1003) mudi muḍi. [Tel.] adj. Old, ancient. ముసలి , వృద్ధ, ముదిరిన. 'అచ్చటకేను వచ్చు సమయంబగువేళ యెరుంగదెల్పితే ముచ్చటదీర్తునంచు ముదిముద్దియతో వివరించిపంపగా.' H. ii. 53. 'ఎక్కడ దప్పింపనిదిమదిపోరు.' n. Old age, ముసలితనము, వార్ధకము. ముదిగారము mudigāramu. n. Stubbornness, మూర్ఖ్యము. ముదిమి or ముదితనము mudimí. n. Old age, decrepitude. వృద్ధత్వము. ముదియు mudiyu. v. n. To grow old. 'ముదిసిముప్పున నింత ముదిమరుల్ పొంది.' BD. iv. 1249. ముదివాడు mudi-vāḍu. n. An old man. వృద్ధపురుషుడు. ముదుక or ముతుక muduka. adj. Coarse. నాణెముకాని, ముదుగైన. Old, వృద్ధ. ముదుక or ముదుకడు muduka. n. An old man. వృద్ధుడు. 'ముదుకండయ్యును కుమారమూర్తి వహించెన్.' M. VII. i. 134.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close