Telugu to English Dictionary: లాడుతూ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అట్టు
(p. 32) aṭṭu or అట్టుగా aṭṭu. [Tel.] adv. (A particle) So that, as, according to. అతడు వచ్చేటట్టు వ్రాయుము write a letter so that he may come. మీరు చెప్పినట్టుగా చేస్తిని I did as you bid me. ఆయన చెప్పినట్టు according to his order. వాడు ఇంకా అవతలకు పోవునట్టు అగుపడ్డాడు he seemed as though he would go further. నేను చెప్పినట్టు చేసినాడు he did as I said. వారు సాగిపోయినట్టుగా చెప్పెను he said that they had passed on. అట్టు గాక or అట్లాకాక aṭṭugāka. adv. Without being so. అట్టుల aṭṭula. adv. As soon as, soon after. వెంటనే. 'చెట్టు దిగి వచ్చినట్టుల.' H. ii. 47. Just as. ఆప్రకారము. అట్టే (for అట్లాగే) aṭṭē. [Tel.] adv. Thus. So. In the same manner, as it was. అట్టే ఉండనీ leave it as it is. నొప్పి అట్టే ఉన్నది the pain is in the same state. అట్టే పోయినాడు he went off straightway. అట్టే మాట్లాడుతూ ఉండినాడు he was talking straight on. ఆ గుర్రములట్టే ఉన్నవి the horses are as they were: they are untouched.
అల్లాడు
(p. 90) allāḍu or అల్లలాడు allāḍu. [Tel. అల్ల+ఆడు] v. n. To shake, move, wave, toss about, to wander about, to be in distress. ఆడు, గాలికి కొట్టుకొను, తిరుగు, సంచరించు, కడగండ్లబడు. 'ధరాచక్రమల్లాడె.' N. iv. 288. ధ్వజపటము గాలికి అల్లాడుచున్నది the flag flutters in the wind. కూటి అల్లాడుతాడు he is in want of bread. కొలువుకు అల్లాడుతాడు he is in trouble for want of employment. అల్లాటము allāṭamu [Tel.] n. A to-andfro movement, wandering about. అల్లారుదు or అల్లార్చు allāruṭsu. [Tel.] v. a. To shake, move, vibrate, agitate, wag, wave. ఆడించు, విసురు. 'ఘనవాలమల్లార్చు.' N. i. 144. అల్లారుముద్దు allāru-muddu. [Tel. అల్ల+ఆరు+ముద్దు.] Prettiness, agreeableness, sweetness. జనసమ్మతి, అతిప్రేమాస్పదము. అల్లారుముద్దుగా ad. Prettily, agreeably, sweetly, pleasantly. జనసమ్మతిగా, అందరికి సంతోషముగా, ముచ్చటగా. 'పడుచుదనమున వేడుకపడుచున్నాడు ముద్దరాండ్రకు నల్లారు ముద్దుగాను.' N. ix. 102.
చిదచిద
(p. 415) cidacida chida-chida. [Tel.] n. Damp. ఆ నేల చిదచిదలాడుతున్నది that ground is moist.
చూరు
(p. 452) cūru ṭsūru. [Tel.] n. A cornice, border, ledge: shelf on a wall: the eaves of a roof. కాలుపట్టియీడ్చితే చూరుపట్టి వ్రేలాడుతాను though you haul me by the legs I will hang on to the eaves, i.e., though thou reject me I will not cease to cling to thee. చూరు v. n. To be charred or smoked. చూరుకర్ర or పొగ చూరుకర్ర charred wood చూరుకమ్మి or చూరుపట్టె ṭsūru-kammi. n. The lath that closes in a shelving roof ముంజూరున పెండెకు ఎత్తుగావేసిన కమ్మి. చూరుకుట్టు ṭsūru-kuṭṭu. n. The roof bands. చూరెలుక ṭsūr-cluka. n. The eaves' mouse, or house-mouse.
నేరుచు
(p. 681) nērucu or నేర్చు nēruṭsu. [Tel.] v. a. To learn. Added to other infinitives it is translated by the English verb Can. రానేరను I cannot come. తెలియనేరరైరి they were unable to know. చూడనేర్తునే can I bear to see it? నేర్చినేర్చి మాట్లాడుతాడు he is talkative or chatters. నేరక nēraka. adj. Being unable to. రాజరక being unable to come. adv. Unawares, unconsciously, involuntarily. నేర్చినేరక చేసినపని an act committed unconsciously or ignorantly. నేరకచేసినాను I did it unintentionally or unconsciously. నేరరు they cannot do it. 'నీవు ఇచ్చిన శాపంబు గ్రమ్మరింపనేర్తేని గ్రమ్మరింపుము.' M. I. i. 150. నేరబోతు nēra-bōtu. (నేరమి+పోతు.) n. An ignorant man, తెలియనివాడు. నేరమి nērami. n. Ignorance. అజ్ఙానము A mistake, fault, దోషము. అడనేరమి ignorance of acting, want of power to act. పాడనేరమి inability to sing. నేరము nēramu. n. A criminal offence, a crime. తప్పు, అపరాధము. నేరస్థుడు nērasthuḍu. n. A criminal, an offender. నేరిమి nērimi. n. Knowledge, skill, dexterity. నేర్పు, సామర్థ్యము. నేరుచుకొను, నేర్చుకొను or నేర్చికొను nēruṭsu-konu. v. a. To learn. నేరుపరి, నేర్పరి, నేరుపుకాడు, నేర్పుకాడు or నేరుపులాడు nērup-ari. n. A wit, an ingenious or skilful person, a genius. సమర్థుడు. నేరుపు or నేర్పు nērupu. v. a. To teach, నేరవజేయు. n. Art, skill, craft, cunning. A pretext. నేర్పులు arts, wiles, contrivances. నేరుపుగా or నేర్పుగా nērupu-gā. adv. Artfully, duly, skilfully. నేర్పించు nērpinṭsu. v. a. To make one learn, to teach, to cause to teach.
ప్రళయము
(p. 838) praḷayamu pra-ḷayamu. [Skt. ప్ర+లయము.] n. Destruction. The final destruction of the world. కల్పాంతము. Danger, calamity, అపాయము. Death, మృత్యువు. ప్రళయకాలము an awful or protentous period. జలప్రళయము the Deluge. ప్రళయముగా pra-ḷayamu-gā. adv. In a flood, in a deluge. Prodigiously, hugely, grandly. ఇంతటిలో వానప్రళయముగా వచ్చినది the rain came in floods. రాజు ప్రళయముగా బయలుదేరినాడు the king set out very grandly. వానిపని బహుప్రళయముగానున్నది he lives in grand style, his business goes on thrivingly. ప్రళయముగా మాట్లాడుతాడు he talks pompously. ఏరు ప్రళయముగా పారుచున్నది the river is rushing furiously.
మాట
(p. 970) māṭa māṭa. [Tel.] n. A word, పదము. A promise, వాగ్దత్తము, ప్రతిజ్ఞావచనము. Slander, నింద. Opinion, rumour, వృత్తాంతము. అతడు నీ మాట చెప్పలేదు he did not speak of you. ఇది వేరే మాట this is another affair, another thing. వానిమాటకాదు this is not about him, I am not talking about him. గడియకు ఒకమాట చెప్పినాడు he changed his mind every hour. మంచిమాట (interj.) Very well. దాన్ని గురించి రెండో మాటలేదు there is no alternative. వారివిద్ద మాటలుపడినాడు he was reproached or reprimanded by them. In some phrases the word మాట need not be translated. Thus, ఆమె తిరిగీ వస్తున్నదనేమాట తెలిసి knowing that she would return. నేను దానిని కొన్నమాట రూఢి it is very true I bought it. ఆమాటే యెరుగను I know nothing of it. ఇందుచేత మాటవచ్చును by this you will get into disgrace. అతడు మాటతప్పలేదు he did not fail in his promise. మాట తప్పినవాడు మాలవాడు a promise breaker is a pariah, i.e., is a mean wretch. నేను పోయినమాట వానికి ఎట్లా తెలిసినది how did he know that I was gone? అతడు పోయేమాట ఉండేమాటా does he propose to go or stay? వాడు ఉండేమాట యింకా తెలియలేదు I do not as yet know that he will remain. మాటకుమాట word for word, literally. నా మాట అడుగుదాటకు transgress not my command. తనమీద మాటరాకుండా ఇట్లా చేసెను he did this to avoid blame. మాటవినుట to obey. ఎంతమాట what nonsense! వానిమాట వాని ఒడిలో వేసినాను I acted as he desired. నీకు మాట నాకు మూట a command is easy to give but hard to perform, or a word from you will make me rich. వెయ్యిమాటలేల why discuss it at length, in a word. ఆ పెండ్లి మాట యీ గ్రంథములో లేదు there is no mention of the marriage in this book నామాటవేరు, నీమాట వేరు I say one thing you say another, my opinion is different from yours, my case is quite different from yours. వానికి నాకు మాటలు లేవు he and I are not on speaking terms. వానితో నీకేమిమాటలు why do you speak with him? ఈమాట వింటే ఆయన యేమనును if he hears of this what will he say? కడపటిమాటయేమి what was the upshot of the business? ఇప్పట్లో వాని మాట సాగదు he has now no influence. కడకు వానిమాటే ముందరికివచ్చినది at last his words proved true. దానిని గురించి ఇంకా యేమాటా తెలియలేదు I do not yet know the result. మాటలకు పట్టుకొంటే విడవడు if he begins talking he will never stop. అదెక్కడిమాట what nonsense! such a thing is impossible. మాటలు మంచివే కాణి మనసు మంచిదికాదు he talks well but has a bad heart. ఇంకా మాటలు రాని బిడ్డ a child that cannot yet speak. వానికి ఆ ఊరిలో మాట వాసికద్దు లేక మాట సాగుతుంది he has influence in the town. ఆయన మాటకు ఎదురులేదు his word is law. మాటలకుమాత్రము పేదరికములేదు as far as words go he is rich enough. ఒక మాట యిచ్చి పదిమాటలు తీసుకొన్నాడు his reproaches were returned ten-fold. మాటకాడు māṭa-kāḍu. n. A good public speaker, సభయందు భయములేక మాటాడువాడు, వక్త. మాటకారి māṭa-kāri. n. A skilful speaker, యుక్తిగా మాటాడువాడు. A talkative person, వాచాలుడు. మాటలమారి māṭala-māri. n. A talkative person, మిక్కిలి మాటాడువాడు. మాటలాడు, మాటాడు or మాట్లాడు māṭa-l-āḍu. v. n. To speak, talk, converse, to reproach. నన్నెందుకు ఊరికె మాటలాడుతావు why reproach me for nothing? S. iii. 41.
రత్నము
(p. 1064) ratnamu ratnamu. [Skt.] n. A jewel, precious stone, gem. మణి. A masterpiece of fine thing, the best of its kind of species స్వజాతి శ్రేష్ఠము, నవరత్నములు the nine precious stones, viz., మౌక్తికము a pearl, పద్మరాగము an emerald, వజ్రము a diamond. ప్రవాళము a coral, మరకతము. an emerald నీలము a sapphire, గోమేధికము an agate. పుష్యరాగము a ruby, వైడూర్యము a cat's eye. అశ్వరత్నము a jewel of a horse, i.e., a noble stead. స్త్రీరత్నము an unrivalled woman. గగనరత్నము the sun, as the gem of heaven. అప్సరోరత్నములు the most lovely of nymphs. రత్నకంబళము ratna-kamba-lamu. n. A carpet. తివాసీ. రత్నగర్భ .ratna-garbha n. The earth; as producing gems. భూమి. 'వైశ్యకన్యకల్ గీరనగింజలాడుతరి క్రిందనునిచిన దివ్యరత్నముల్ పౌరులు ద్రొక్కుచున్ జనగపాతుకొనంధరణీ పురంధ్రికిన్వారకరత్నగర్భయను నామము బెట్టిరి సత్కవీశ్వరుల్.' T. ii. 20. రత్నగర్భుడు ratna-garbhuḍu. n. Kubēra, the god of wealth, కుబేరుడు. The god of the sea, సముద్రుడు. రత్నసానువు ratna-sānuvu. n. An epithet of Mount Meru as having ' gems in its slopes.' మేరుపర్వతము, హేమాద్రి. రత్నాకరము ratn-ākaramu. n. The abode of gems, that is, the ocean. సముద్రము. రత్నావళి ratnā-vaḷi. n. A necklace of gems.
సందు
(p. 1277) sandu or సంది sandu. [from Skt. సంధి.] n. A small opening, a fissure, crack, hole, బొత్త, చిల్లి, బీటిక. Space, an interval. ఎడము, మధ్యప్రదేశము, మధ్యకాలము. A lane, a narrow street, చిన్నవీధి, గల్లీ. A nook, corner, మూల. A backyard, పెరడు. A period of time, an opportunity, సమయము, సందర్బము. A direction or quarter. చంకసందు the armpit. వేళ్లసందు the space between two fingers. ఇక్కడ సందు విడువు leave a space here. సందిచ్చు to give room or opportunity. వాడు ఎవరికిని సందియ్యకుండా మాట్లాడుతాడు he will let nobody else get a word in, he gives no one an opportunity of speaking. వారిద్దరిసందున వీడు నలిగిపోవుచున్నాడు between the two this man is ruined. సందులు గొందులంతా వెతికినాడు he hunted in every hole and corner. సందుచూచి లోగా చొరబడినాడు he took an opportunity and rushed in సందువాకిలి the back-door, పెరటిగుమ్మము. సందుముట్టు menses occurring at intervals, that is, at irregular periods. 'నేటికి నబ్బెసందు.' T. iii. 87. అనగా నేడు సమయము చిక్కెను. సందిక్రంతజగడములు petty disputes, అల్పమైనజగడములు. సందుకట్టు sandukaṭṭu. n. An interval, మధ్యకాలము. గ్రహణపు సందుకట్టు the time that an eclipse lasts. అమావాస్య సందుకట్టు the period of new moon. నేను పోయి వీడు వచ్చే సందుకట్టులో in the interval between my going and his coming. సందుకొను sandu-konu. v. n. To take or seize an opportunity, సమయము చూచుకొను. To extend spread, వ్యాపించు. v. a. To unite with, కూడు. To be joined to, to marry, పరిగ్రహించు. సందుకొట్టు or సందుతగులు sandu-koṭṭu. v. n. To be injured by a ghost. సందుదోషము sandu-dōshamu. n. Demoniac possession. బిడ్డలకు మాససంధియందు కలుగు బాలగ్రహదోషము. ఆ బిడ్డకు సందుదోషము తగిలినది, సందుకొట్టినది or సందుతగిలినది the child is fairy-struck or injured by a ghost that haunts a particular spot. సందుసీసము sandusīsamu. n. A certain feat in wrestling.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149833
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113044
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101425
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95680
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55836
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51503
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40213
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39115

Please like, if you love this website
close