Telugu to English Dictionary: వలెనని

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అని
(p. 52) ani ani. [Tel.] (Past p|| of అను to say) Having said. This is translated by the word 'That' or 'so' or the infinitive mood is used, as వారు అక్కడ ఉండినారని అన్నాడు he told me that they were there. అవతల వెళ్లరాదని తిరిగీ వస్తిమి we did not think it right to go on and returned; we thought we must not go further; so we came back. నన్ను పొమ్మని చెప్పెను he told me to go. తన సొమ్మని యెంచి considering it his own. దాన్ని నాకని కొన్నాడు he bought it for me. కావలెనని అక్కడికి పోయినాడు he went there on purpose. పండ్లను పటపటమని కొరికినాడు he gnashed his teeth. ఘమ్మని fragrantly. తళుక్కని brilliantly. గడగడమని మాట్లాడినాడు he spoke rapidly. ఈగలు జుమ్మని ముసురు కొన్నవి the flies covered it buzzingly. నీవు ఈ శాలువ కప్పుకొంటే గుమ్మని ఉండును if you wear this shawl it feels warm: or, you will feel warm.
అనిపించు
(p. 52) anipiñcu anipinṭsụ. [Tel. causative of అను.] v. n. To cause one to say. జ్వరములో ఉరికె నీళ్లు తాగవలెననిపించును in a fever one is inclined to drink constantly. ఇంత చల్లగాలి కొట్టితే ఎండకాలమనిపించదు while this cool breeze blows it does not seem to be summer (lit.) the heat is not felt. యోగ్యుడనిపించుకొన్నాడు he was considered a good man.
అను
(p. 53) anu anu. [Tel.] v. n. To say, to think, to suppose. చెప్పు, తలచు, ఎంచు. (Past p.|| అని. Relative p.|| అనిన or అన్న, Aor. p.|| అనే, అనెడి, అనెడు, అనేటి. Neg. p.|| అనని.) అట్లా అంటాడు so he says. కావలెననే మనసు a desire to have it. తళుక్కుమను to shine or glitter. చేతితో ఇట్లా అన్నాడు he did so with his hand. అనుటయు on his saying so. అనగా may be translated 'or;' thus అచలముగా కొండ Achalam or hill; Achalam which means a hill. అనుడు adv. On (his) saying this. అనగా, అనేటప్పటికి, అనవుడు. అనుకొను anu-konu. [Tel.] v. n. To say, suppose, think, (middle voice of అను to say or think.) నేను ఇది యిస్తాననుకొన్నాడు he thought that I would give him this.
ఉద్యాపనము
(p. 159) udyāpanamu ud-yuktamu.[Skt.] adj. Attempted. Zealous, resolved, determined. ఉద్యోక్తుడు He who is ready or prepared. యత్నించువాడు, సిద్ధముగానున్నవాడు. అక్కడికి పోవలెనని ఉద్యోక్తుడై being about to go. జాబు వ్రాయుటకు ఉద్యోక్తుడనై when I was going to write the letter. క్రూరమైన పనికి ఉద్యుక్తుడై ready to do a cruel deed.
పని
(p. 708) pani pani. [Tel.] n. Work, a task. కర్మము. Business, employment, వ్యాపారము. Workmenship, శిల్పము. ఈ కట్టడమునందు మంచిపని చేసియున్నారు there is good workmanship in this building. An affair, act, matter. Service, utility, purpose, object, intention, design. ప్రయోజనము. An order, duty, నియోగము. పనిమీద ఉన్నాడు he is busy. మంచిపని very well, well, good. మంచిపనిచేసినావు you did well or right. అతని పనిచూస్తున్నాను I am engaged in his service: I am acting for him. అతనిపని తీర్చినారు they settled his business, or they killed him. ఇక్కడ నీకేమిపని what business have you here? This word is sometimes omitted in translating; as in నీపనిపట్టిస్తాను I will punish you. ఇంతపనికి నన్నేల వెంటబెట్టుకొనివచ్చినావు why have you brought me for such a trifle or pretence? పనికిమాలి (or) పనిచెడి కూర్చున్నాడు he is sitting idle. వారు వ్యాధిచేత పనిచెడిరి they became infirm through illness. వానితో విరోధము పనికిరాదు he will not stand quarrelling. దాన్ని సంపాదించడము ఎంతపని it is no great matter to get it. నాపని చెరిపినారు they spoiled my work. పనిచెరువుకథలు idle stories. పనికి వచ్చే useful. పనికివచ్చే పిల్లకాయ a promising boy. పనికిరాని or పనికిమాలి useless. అక్కడికి నీవు ఏపనిమీద పోయినావు useless. అక్కడికి నీవు ఏపనిమీద పోయినావు about what business did you go there? నీపనిని నీవు చూచుకొనుము mind your own business. అక్కడికి పోవలసినపనిలేదు there is no need of going there. ఇప్పట్లో వానిపని యిట్లు ఉన్నది he is now in this state. అట్లు చెప్ప పని లేదు there is no need of saying so. పనిగొను pani-gonu. v. a. To undertake a work, to engage in a business. పూనుకొను. To employ, నియోగించు. 'పనిగొనవుతెలియగ బరికించి చూచిన.' Vēma. పనితనము pani-ta-namu. n. Workmanship, elegance. పనితనముగల ఒక మంచము a handsome bed. పనితొడవులు pani-toḍarulu. n. Worked or embossed jewels. పనిపడు or పనివడు pani-paḍu. v. n. To busy oneself with. to engage in, పూనుకొను. To concern oneself with, అక్కరపడు. పనివడి or పనిపడి pani-paḍi. adv. Intentionally. కావలెనని, ప్రయత్నపూర్వకముగా. 'పరులను పనిపడి దూషించెనేని పాపము వచ్చున్.' V. P. iv. 249. పనివాటులు jobs, work. పనిముట్టు or పనిమటము pani-muṭṭu. n. An instrument, tool, impelement. కొరముట్టు, ఉపకరణము. 'పనిమటములుగొంచు పయనమైరండు.' Pal. 314. పనివంచు, పని పంచు or పనిగొను pani-vanṭsu. v. a. To command. నియోగించు. పనివాడు pani-vāḍu. n. A servant: a good workman. పనివిను pani-vinu. v. n. To obtain permission, to take leave. To proceed, to go or come. 'దేవర కీర్తి వెక్కసంబుగ జెప్పవిని చూడగోరి, పనివిని నేను మాభాగ్యంబుకతన.' H.D.i. 847.
పురపుర
(p. 769) purapura pura-pura. [Tel. anuk.] adv. Much, greatly, మిక్కిలి. పురపురపొక్కు to sorrow bitterly, deeply, inconsolably. 'గురులార మీరు నాకై పురపుర బొక్కంగవలదు.' G. v. 235. ఆ దెబ్బకు వానిచెంప పురపురవాచినది his cheek swelled much form the blow. పురపురలాడు purapural-āḍu. v. n. To be eager, మిక్కిలి అపేక్షపడు. ఏదైనను తినవలెనని వానినోరు పురపురలాడుచున్నది he is eager for some food.
బుభుక్ష
(p. 892) bubhukṣa bubhuksha. [Skt.] n. Hunger. భుజింపవలెననుకోరిక, ఆకలి. బుభుక్షితుడు bubhukshituḍu. n. A hungry man. ఆకలిగొనినవాడు.
బుభుత్స
(p. 892) bubhutsa bubhutsa. [Skt.] n. A desire to learn or to be taught. బోధగొనవలెనను ఇచ్ఛ.
భ్రమ
(p. 930) bhrama or భ్రమము bhrama. [Skt.] n. Whirling round, gyration. గిరగిర తిరగడము. Error or obliquity of judgement. Delusion, misapprehension. Misconception, illusion. Desire, wish, fondness, longing. భ్రాంతి, వానికి కొడుకును చూడవలెనని నిండా భ్రమగానున్నది he wishes very much to see his son. adj. Erroneous. తబ్బిబ్బైన. భ్రమపుమాటలు nonsense. భ్రమణము or భ్రమి bhramaṇamu. n. Whirling, turning, going round, wandering. భ్రమపడు bhrama-paḍu. v. n. To err, be mistaken, be deluded. భ్రమపరచు bhrama-paraṭsu. v. a. To mislead, delude. భ్రమప్రమాదము bhrama-pramādamu. n. A blunder, oversight. భ్రమము, భ్రమియు or బ్రమియు bhramayu. v. n. To err, be deceived. To be confused, perplexed. భ్రమరము bhramaramu. n. The large black carpenter bee, తుమ్మెద. The poets compare braids of black hair to clustering bees. A large kind of wasp. భ్రమరకీటన్యాయము like the caterpillars which the wasp places in its nest as food for its grubs; these are supposed to change into wasps; the similitude is used to point out the entire change produced in the mind of a pupil. భ్రమరకము bhramarakamu. n. Hair curled upon the forehead, నొసట చుట్టలుచుట్టలుగా జీరాడే ముంగురులు. A top, బొంగరము. భ్రమరి bhramari. n. A female bee. ఆడుతుమ్మెద. భ్రమరించు bhramarinṭsu. v. n. To circle round, భ్రమరించు, or భ్రమించు or భ్రమియంచు bhraminṭsu. v. n. To turn round, to spin round. To be confused, misled, deluded. M. I. i. 157. భ్రమనుపొందు, తిరుగు.
రాగ
(p. 1071) rāga rāga. [Tel.] n. A bad creature, దుష్టుడు. లాగదాగుడురాగ a serpent, సర్పము. 'లాగదాగుడురాగ ప్రోగులిడెడుప్రోడ.' (Aṭasṭsa Telugu Rāmayan,) i.e., Siva, the hero who wears as an earrring a serpent that hides in a hole. An adulteress, జారిణి. A proud or wicked man, ఉద్ధతుడు, ధూర్తుడు. adj. Shrewish wicked. గయ్యాళి, దుష్ట, చెడుగరమైన. 'కూతురురరాగైన మాతతప్పు అశ్వంబుచెడుగైన నారోహకుని తప్పు.' Nrisim. §. 12. రాగతుంగ a kind of grass called భద్రముస్తకము. రాగతనము rāgatanamu. n. Envy, malice. మాత్సర్యము. 'లోగనించు కైనరాగతనంబునదో చివలువలెల్ల దాచినావు గీజుపోరకిమ్ము నేజవవలెనన్న.' Appa kavi. ii. 36. రాగంట్లమారి rāganṭla-māri. n. A blackguard, a villain. పోకిరి, గండాగుండి. 'వాడు నానాటికభివృద్ధివరలబెరిగి, కాకలనుదీరిగడిమీరిగట్టిసారి, రాలుగాయతనాన బేరజపుదారినారితేరినే రాగంట్లమారియయ్యె.' H. v. 126.
లూలామాలము
(p. 1106) lūlāmālamu lūlā-mālamu. [Tel.] n. Cheating, wheedling, defruading. మోసము, వంచన. 'క లూలామాలపుమాటలు, చాలుననిననలిగితన నిజంబగురూపం, బాలోనదెలుపవలెనని, నీలగ్రీవుడు నిటలనేత్రముజూపన్.' Kālahasti. iii. 194.
వలయు
(p. 1139) valayu valayu. [Tel.] v. n. To be liked, desired or wanted. ఇష్టమగు, విహితమగు. To be needful, or necessary, ఆవశ్యకమగు. To be proper, యుక్తమగు. To be surrounded, వలయతమగు. 'మృగమువలయంబారెన్.' పంచ. నా. ii. 'స్వబుద్ధిరాజుకు విశేషింపవలయు' (P. i. 391.) the use of his own judgment is much needed in a king. 'కయ్యమునకు నెయ్యమునకు వియ్యమునకు సమతవలయు.' (ib. ii. 47.) in combat, in inter-marriage, and in friendship equality is wanted; or, there should be a similarity. 'ఔగాములరయవలయు.' (ib. iv. 431.) you should look to the chances of gain or loss, of success or failure. వలె, వలెను, వలసినది or వలయును are added as auxiliaries, to the Root in the Infinitive of any verb; to give the idea of obligation or necessity; నేను ఇమటికి పోవలెను I must go home. నీవు ఇక్కడికి రావలెను you must come here, you should come here, I hope you will come here. తమదయ రావలెను మా దరిద్రము తీరవలెను I hope your favour will come and that my poverty will be removed. ఆయన రేపో ఎల్లుండో రావలెను he must be here tomorrow or the next day, i.e., we expect him here tomorrow or the next day. వాడు దానితమ్ముడుగా ఉండవలెను I suppose he must be her brother. నాకు ఆ పుస్తకము కావలెను I want that book. వాణ్ని చంపియుండవలెను they must have killed him. నీకు అట్లురావలెను this serves you right. నీవు సందేహింపవలసినదిలేదు you need not doubt it, there is no occasion to doubt it. వాణ్ని పిలువవలెనని అక్కడికి వెళ్లితిని I went there to call him. ఈ పని చేయవలెనని పోవుచుండగా as I was going there to do this. జగడమాడవలెనని వస్తివా did you come on purpose (or wanting) to quarrel? వలసి (the past p|| of వలయు.) ఇవ్వవలసి యిస్తిని I paid it, because I had to. 'నిశాచరునుద్యోగంబుచూచుకొనవలసి.' Swa. iv. 163. అట్లు చేయవలసివచ్చును it will become necessary to do so. వలసిన (past part of వలయు) is used as an affix (similar to the Latin-ibilis or endus). చెల్లింపవలసిన సొమ్ము money due, the sum payable. 'వ;సినసంపదల్ గలుగవా.' T. ii. 34. టీ వలసిన, కావలసినటువంటి. వలసె or వలసెను (the past tense of వలయు) it became necessary, or requisite. వానితో చెప్పవలసె I was obliged to tell him. 'వినిపింపరాని కార్యము వినిపింపగవలసె.' Swa. iv. 176. The negative aorist of this, వలవదు, వలదు, See under వలదు.
వివక్ష
(p. 1189) vivakṣa vi-vaksha. [Skt.] n. A wish to speak. చెప్పనిచ్ఛ. Intention, the aim of a speaker, desire. (In Telugu) Difference, distinction, భేదము. వివక్షించు or వివక్షచేయు vi-vakshinṭsu. v. a. To wish to speak. చెప్పవలెనని యిచ్ఛించు. To distinguish, వ్యత్యాసమును కనుగొను. వివక్షితము vi-vakshitamu. adj. Required, or wished to be spoken, wished, desired. చెప్పనిచ్ఛించిన, వాంఛితమైన. వివక్షువు vi-vakshuvu. n. One who wishes to speak, చెప్పనిచ్ఛించువాడు.
విశదము
(p. 1191) viśadamu viṣadamu. [Skt.] adj. White; clear, pure, pellucid. తెల్లని, నిర్మలమైన, పరిశుద్ధమైన. Evident, apparent, manifest. స్పష్టమైన. విశదదుర్మతులు downright villains. Charitra. ii. 1673. n. Clearness, స్పష్టము. విశదపరచు, విశదముచేయు or విశదీకరించు viṣada-paruṭsu. v. a. To particularise, explain, define, manifest. స్పష్టముచేయు. విశదమగు viṣadam-agu. v. n. To come to light, become clear or known. స్పష్టమగు. అతనిజాబువల్ల ఆ సంగతులు విశదమవును his letter will explain or make clear those matters. తమకు విశదము కావలెనని వ్రాసినాను I have written this for your information. విశదములు viṣadamulu. n. plu. Matters, things, particulars. వివరములు.
సంధి
(p. 1278) sandhi sandhi. [Skt.] n. Connection, union combination, junction, coalescence. కూడిక, చేరడము, కలియడము. A joint of the limbs, కీలు. Pacification, peacemaking, conciliation, peace, a treaty. అనుకూలము, సమాధానము. The coalescence of letters in accordance with the laws of euphony. అచ్సంధి the union of vowels. హల్సంధి the union of consonants. ఈయన వారికి సంధి చేసినాడు he made them friends. 'బిట్టుల్కి సంధులు ప్రిదలిగిర్రనుచు.' BD. iv. 359. కుసంధి a bad union. సంధివిగ్రహము peace and war. సంధివిగ్రహాధికారము a war ministry, the duty of a war minister. సంధిబంధనము a ligament. సంధించు san-dhinṭsu. v. a. To cause to meet, to bring together, join, unite. కలుపు, చేర్చు, కూర్చు. సంధించు or సంధిల్లు. v. n. To be joined to or united with, కూడు. సంధితము sandhitamu. adj. Joined, united, connected, bound, చేర్చబడిన, కూర్చబడిన కట్టబడిన. సంధిత్స sandhitsa. n. The desire of joining, an inclination to unite. చేర్చవలెననేయిచ్ఛ. సంధిలు or సంధిల్లు sandhilu. v. n. To happen, occur; to meet. ప్రాప్తమగు, ఎదురుపడు, కలుగు, వచ్చు. 'భక్తిగౌరవము విశ్వాసంబు సంధిల్లగా.' T. ii. 55. 'అచలాత్మజమాటకు లేత నవ్వు సంధిల్ల.' Swa. pref. 2. సంధుడు or సంధురాలు sandhuḍu. n. One who is united with. These words are used in compounds; thus సత్యసంధుడు, సత్యసంధురాలు. a truthful or veracious man or woman.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148334
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111993
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100388
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94774
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55279
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50952
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38572

Please like, if you love this website
close