Telugu to English Dictionary: walking

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఇలు
(p. 140) ilu ilu. (See ఇల్లు.) ఇలుచుట్టు ilu-ṭsuṭṭu. [Tel. from చుట్టు.] n. Lustration, walking round a house to keep away demons. ఇలురేడు ilu-rēḍu. n. The master of the house. ఇలువడి iluvaḍi. n. Respectable birth. కులీనత. Good conduct. మంచి నడత. భార. శాంతి. iii. 'అలువడనున్న చేసి.' భాగ. 10 న్కం. ఇలువరుస ilu-varusa. Family, race, consanguinity. వంశానుక్రమము. ఇలువరుసగా at each house, from house to house. ఇలువేలుపు or ఇలువేల్పు ilu-vēlupu. A patron saint or god. The household god కులదేవత.
కాలుకంబము
(p. 277) kālukambamu the side post of a door. కాలి kāli. infl. of కాలు the foot. ఎర్రకాలి కొంగ the painted stork, Pscudotantalus leucocephalus. (F.B.I.) కాలిదారి or కాలిదోవ or కాలిబాట kāli-dāri. n. A foot path. కాలినడ or కాల్నడ walking, going on foot. కాల్నడవాడు kālnaḍa-vāḍu. n. A pedestrian, one on foot. కాలిబంటు or కాలుమానిసి kāli-baṇṭu. n. An Infantry man, a foot soldier. పదాతి. కాలుబలము or కాల్బలము Infantry. కాలివేళ్లు kāli-vēḷḷu. n. The toes.
(p. 345) g ga. [Tel. & Skt. formed from the shape of the legs in walking.] The letter G as in great. Some Telugu words at pleasure change the letter G into V. Thus పగలు or పవలు, తీగ or తీవ. So in English, thus: guile and wile; gate and way; guard and ward; guise, and wise.
చరము
(p. 406) caramu charamu. [Skt.] adj. Moveable, locomotive, migratory. Trembling, shaking, unsteady. చరాస్తి personal or moveable property. చరస్థిరరూపకములు property personal and real. దృష్టిచరము visible. శ్రుతిచరము audible. స్పర్శచరము tangible. చర వృక్షములు (Kalah. i. 101.) moving or walking trees. n. An animal or moving creature. చరాచరములు the animate and inanimate creation. తిరుగునదియను తిరుగనిదియునైనది, జగత్తు. చరుడు charuḍu. n. A spy వేగువాడు. చరించు charinṭsu. v. n. To wander, to roam. తిరుగు. To live, conduct oneself; behave. To go on, continue. v. t. To do or observe; to perform. చేయు. 'వ్రతముల్ చరించెనధికేచ్ఛన్ గుంభకర్ణుండు.' భార. అర. vi.
చెంగు
(p. 426) ceṅgu chengu. [Tel.] v. n. To be loosened (as a knot) వీడిపోవు, తొలగు. To with draw, to retreat వెనుదీయు. To lose or fail in a game ఓడిపోవు. చెంగి ఆడు to talk indifferently. అక్కరపట్టనట్టుగా మాట్లాడు. చెంగిచెంగిపోవు to loiter in walking. కాయచెంగినది (at games with small balls) the ball stopped, or missed. రెండుగుంటలు చెంగినవి there are two holes without balls. చెంగగొట్టు to defeat ఓడించు.
నడచు
(p. 630) naḍacu Same as నడుచు. (q. v.) నడ or నడక naḍa. n. A walk, walking, stepping, motion, movement. గమనము. Pace, step, manner of walking, gait. A trip or journey. పడవ మూడునడలు వచ్చినది the boat made three trips. adj. Walking, moving. locomotive. నడకొండలు moving mountains. నడపీనుగు a walking corpse: a fool, a good for nothing man. Sumati. § 69. నడక naḍaka. n. A walk, walking. నడగడు nada-gaḍu. (నడ+కాడు.) n. A horse. గుర్రము. నడగొట్టు nada-goṭṭu. (నడ+కొట్టు.) v. n. To stand, to remain, to be, నిలుచు, ఉండు. నడ౛ోడు naḍa-dzōdu. n. A foot soldier. కాలిబంటు, పదాతి. నడత nadata. n. Conduct, behaviour. నడవడి, ప్రవర్తనము.
నెమలి
(p. 676) nemali , నెమిలి, నెమ్మి or నెమ్మిలి nemali. [Tel.] n. A peacock. నెమలి అడుగు a certain plant, పూతికరజము అనే చెట్టు. H. iv. 18. నెమలికన్నులు the eyes in a peacock's train. నెమలిచెట్టు nemali-cheṭṭu. n. A tree called త్రిపాది. నెమలి౛ుట్టుఆకు nemali-ḍzuṭṭu-āku. n. A certain medicinal plant. నెమలిమొగ్గ nemali-mogga. n. (lit: The peacock's spreading its tail:) An attitude assumed by dancing girls, walking on the hands with the feet in the air. నెమలివడ్లు nemali-vaḍlu. n. A kind of rice. శాలిధాన్య విశేషము.
పాదము
(p. 738) pādamu pādamu. [Skt.] n. A foot. అడుగు. A root, వేరు. A quarter, పాతిక. A foot or line of verse being a quarter of a stanza. పద్యములో నాలుగవభాగము. A ray of light, కిరణము. A small hill at the foot of a mountain. కొండదరి దిబ్బ. తమ పాదాలనే నమ్మివచ్చినాను I came in reliance on your honour as my protector. This is a mere conversational compliment, like 'I kiss your hands' in Spanish. పాదతీర్థము water made holy by washing a saint's feet. పాదపద్మములు lotus-like feet. పాదలాక్ష red paint for the feet of women, పారాణి. తమపాదాలసముఖానకు నా కుమారుణ్ని తెచ్చి అప్పగిస్తున్నాను permit me to introduce my son to your honour's protection. వాడు తండ్రిపాదాలమీద పడెను he fell on his father's feet. తమపాదాలవద్ద before your honour, in your presence. తమపాదాల శరణుచొచ్చినాను I throw myself on your goodness. పాదచారి pāda-chāri. n. A foot passenger. కాలిబంటు. One who goes walking, నడచి పోవువాడు. పాదజుడు pādajuḍu. n. A Sudra, because born from the feet of Brahma. పాదత్రాణము pāda-trāṇamu. n. A shoe or boot. పైజారు. పాదపము pādapamu. n. A tree. పాదపూర్ణము pāda-pūrṇamu. n. An unnecessary word inserted in verse, to fill up the measure, such as in Sanskrit the words తు, హి, చ, స్మ, హి, వై, or, in Telugu poetry the words, ఒగి, తగ, మరి, ఇల, మహి , or verbs, చెలగు, ఒప్పు, &c. పాదరసము pāda-rasamu. n. Quick-silver, mercury. రసము. పాదలి pādali. n. A base or low man, అధముడు. 'పాపపు విప్రుని పనికిగామున్ను, తాపికాడైన పాదలిమందడీడు.' HD. iii. 110.
ప్రదక్షిణము
(p. 832) pradakṣiṇamu pra-dakshiṇamu. [Skt.] n. Circumambulation. Paying homage (to a god, &c.) by solemnly walking round it with the right hand towards it. అప్రదక్షిణముగానుండే శంఖము a right hand shell (which is consdered a curiosity) being the Perinthium, the volutes of which turn (what is commonly called) the wrong way.
ప్రవృత్తి
(p. 839) pravṛtti pra-vṛitti. [Skt.] n. Pace, manner of walking, నడక. Entrance, ప్రవేశము. Means of livelihood, బ్రతుకుతెరువు. A story, నృత్తాంతము. Activity, occupation; conduct, నడవడి. Inclination, design, disposition. ఉద్దేశము, స్వభావము.
మట్టి
(p. 943) maṭṭi maṭṭi. [Tel.] n. Earth, soil, mud Scurf or dandruff. మట్టితిన్నపామువలె పడియున్నాడు he is as stupid as a snake gorged with mud. మట్టిగుర్రమున నమ్మి యేటిలోదిగుట to rely on a mud horse and go into a river, i.e., to trust to appearances. మట్టితైలము or మట్టినూనె maṭṭi-tadama. n. Earth oil kerosene or petroleum. మట్టాడు maṭṭ-āḍu. (మట్టి + ఆడు.) v. n. & a. To walk. నడచు. To wander, roam, సంచరించు. To spread, వ్యాపించు. To cut to pieces, తనుమాడు.' అత్తూపుగములు తుత్తమురుదొట్టి మట్టాడి అట్టహాసంబుచేసి.' R. v. 191. మట్టియ Same as మట్టి and మట్టె (q. v.) మట్టు maṭṭu. v. a. To tread or trample, to crush. తొక్కు. n. Trampling, walking over. త్రొక్కుడు. Limit, bounds, measure, restriction, extent; moderation. పర్యంతము. ప్రమాణము. మితి, కొలత, తగ్గుదల. A settle or ring of cord, fibre, &c. to prevent a pot from rolling over, కుదురు. A place, ప్రదేశము. పైమట్టు the upper place or part. అడుగుమట్టు the bottom. ఆ బల్లమట్టుపట్టి తీసుకొనిరా measure the plank కావడిమట్టు the frame or bottom of the slings in a Kāvadi. వానికి తెలివిమట్టు he is wanting in sense. వానితో చెప్పినది నాబుద్ధే మట్టు I was a fool to tell him this. ఈ సంవత్సరము జనముమట్టు this year the assembly is but small. వానికి పుణ్యగతులుమట్టు he has no chance of heaven. మట్టుబీర a kind of బీరకాయ (q. v.) మట్టుగిన్నె a cup with a foot or base attached to it. adj. Limited, small. మితము, తక్కువ. మట్టుకు as far as, up to as much as, in regard to, until, as long as. దీనికి ఒకమట్టుమితములేదు there is no end or limit to it. మట్టుమర్యాదలేనివాడు he who has neither modesty nor moderation. మట్టుమీరవద్దు you must not go beyond bounds. అతడు వచ్చువరకు అని దీనికి ఒకమట్టుపెట్టిరి they laid it aside until his arrival, మనసుచెదరనీక మట్టుపెట్టి.' (Vēma. ii. 278.) curbing and restraining the mind. ఈ మట్టున లేచిపోయిరి with this they went away or thereupon they went away. పోడుగుపడి అంతమట్టున వాన నిలిచినది there was a thunderbolt and then the rain ceased. వానికి అంతమట్టుకు తెలియదు he does not know so much. ఎంతమట్టుకు పోయినావు how far did you go? గొంతుమట్టుకు నీళ్లువస్తున్నవి the water is up to the neck. వాడు ఎంతమట్టుకుంటే అంతమట్టుకు సంతోషిస్తాడు he contents himself with as much as he gets. నా ప్రాణములు ఉన్న మట్టుకు as long as I have life. నామట్టుకు నేను ఉంటాను నీమట్టుకు నీవు ఉండు I shall keep to myself, you keep to yourself. బియ్యము కావలసిన మట్టుకు చిక్కును you can get as much rice as you want. సొమ్ములుమట్టుకు నాకు వద్దు as for the jewels I do not want them. అంతమట్టుకు మంచిపని చేస్తిని so far you did well. ఇంతమట్టుకు వచ్చిన తరువాత ఇకనేమి దాక్షిణ్యము when the matter has come to such a push what is the use of delicacy? వానికి తిండిమట్టుకు బాగా కావలెను he cares for nothing but his dinner. నేనుమట్టుకు పోతిని I alone went. వాని ఒళ్లు శానామట్టుకు నాసిగానున్నది his health is in a great measure recovered. మట్టుఅగు. మట్టుకొను or మట్టుపడు maṭṭu-agu. v. n. To lessen or be diminished. తగ్గు, అడగు. కుదురుపడు. రోగము మట్టుపడినది the disease is moderating. వానికి దాహము మట్టుపడినది his thirst was slackened. మట్టుగా maṭṭu-gā. adv. Moderately, మితముగా. వర్షము మట్టుగానున్నప్పుడు when the rain is moderate. దగ్గు మట్టుగానున్నది the cough is now moderate. మట్టుగా తిన్నాడు he ate moderately. మట్టు చేయు or మట్టుపరచు maṭṭu-chēyu. v. a. To lessen, moderate, diminish. తగ్గించు. వానికి జీతము మట్టుచేసినారు they diminished his pay, వానికి జీతము మట్టుచేసినారు they diminished his pay, వానికి జీతము తగ్గించినారు. మట్టుపెట్టు maṭṭu-peṭṭu. v. a. To keep down, suppress, అడచు. To kill, చంపు. మట్టుమిగులు or మట్టుమీరు maṭṭu-migulu. v. n. To exceed the limits, అతిక్రమించు.
మురి
(p. 1009) muri muri. [Tel.] n. Pride. గర్వము. A coquettish manner of walking, నడకయందలి కులుకు. మురించు or మురియించు murinṭsu. v. a. To turn the face about. 'వికటప్రకటాననముల్ మురింపుచున్.' P. iii. 159. 'కరముగ్రముగ మొగమిరుదెసమరియించి.' M. X. i. 15. మురికాడు muri-kāḍu. n. A proud or conceited person, గర్విష్ఠుడు.
మురియు
(p. 1009) muriyu muriyu. [Tel.] v. n. To exult while walking.నడచునప్పుడు కులుకు. To exult, rejoice in hope, to evince a strong desire. ఉల్లసించు, ఆశపడు. To turn, తిరుగు. Sar. D. 376. 'తొట్రుపల్కులుముద్దు దొల్కునవ్వులుగాంచి మురిసియశోదసమ్మోద మంద.' Radha. i. 10. To turn, as the face (మొగమును) త్రిప్పు. To break, as the point of a spear, &c. తెగు, విరుగు, తునియలగు. మురియబడి muriya-baḍu. v. n. To excel, rejoice, be proud, అతిశయించు. మురిపము or మురిపెము muripamu. n. A proud manner of walking, నడకయందలి కులుకు. Exultation, joy, gladness, gaiety, gracefulness. ముద్దు, ముద్దుతనము. Caressing, fonding, coaxing. ఉల్లాసము, లాలన, శృంగారము, సర సరసత. Pride, గర్వము,. శృంగార గర్వము. మురిపపు or మురిపెపు muripapu. adj. Graceful. సొగసైన. 'మురిపపుచిరునవ్వు.' Padma. iii. 13.
వల
(p. 1136) vala vala. [Tel. for వలను.] adj. Right, కుడి. వలచేయి or వలకేలు the right hand. 'అరుదుగావలచేతనక్షమాలికయు.' DR. Aran. 268. 'వలకేల్దలక్రింద జేర్చుకొని.' P. i. 256. వలకట్టు vala-kaṭṭu. (వలను+కట్టు.). a. To make a thing convenient, అనుకూలపరుచు వలకడ valakaḍa. (వలను+కడ.) n. The South side. దిక్షిణపుదిక్కు. వలగొను (వలను+కొను), వలచుట్టు (వలను+చుట్టు) or వలదిరుగు vala-gonu. v. n. To walk round, circumambulate. ప్రదక్షిణముచేయు, చుట్టుకొను. 'వదాన్యమహీరుహసార్వభౌమునిన్ వలగొని మ్రొక్కి.' Parij. v. 88. వలచుట్టు vala-ṭsuṭṭu. n. The act of walking round anything. వలగొనుట.
వాటు
(p. 1149) vāṭu vāṭu. [Tel. from పడు and పాటు.] n. The act of throwing. వైచుట. A blow, stroke, దెబ్బ. A mode, manner, way, fashion, విధము. రీతి. Convenience. కత్తివాటు an ineision or cut. 'మాయయామాటకు మారుత్తరంబు వాయెత్తగాలేక వాటు దప్పినను, జోహారు వన్నట్లు.' L. vii. 77. Turning over, upsetting. బండి వాటుపడును the cart will upset. వాటుగాలు vāṭu-gālu. n. A lame leg, a leg that has a convulsive twitch in walking. వడవడములో పక్కవాటుగా పోయేకాలు. 'వాటుగాలును రోలువంటినడుము.' HK. iv. 143. 'వాటుగాలనరాదుచేటుదెచ్చు.' S. ii. 20. వాటుగాలు వేసుకొనుచు వచ్చినాడు he came twitching along or limping. వాటురాయి vāṭu-rāyi. n. A stone for slinging, a pebble or stone that could be easily flung at a person, రువ్వడమునకుతగిన రాయి. 'ద్వి ఒలకులబూడిదెయును వాటురాలు.' BD. v. 680. వాటులాడు vāṭul-āḍu. v. n. To fight, కొట్లాడు. వాట్లీడు vāṭl-īḍu. n. A quarrelsome man, కొట్లాడువాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close