Telugu to English Dictionary: arrived

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అనాగతము
(p. 50) anāgatamu an-āgatamu. [Skt.] adj. Not come, not arrived, future. భవిష్యత్తు అయిన అనాగతము n. The future. భవిష్యత్తు అనాగతమును చెప్పుట to foretell. అనాగతవేడి n. A prophet: one who 'knows that which has not happened.' సంభవింప బోవుదాన్ని యెరిగినవాడు.
అష్ట
(p. 100) aṣṭa ashṭa [Skt. cf. Eng. 'Eight,' Lat. Octo.] adj. Eight.--అష్టకష్టములు The eight unpleasant circumstances liable to occur in the course of life. [Viz. దేశాంతర గమనము foreign travel, భార్యావియోగము separation from one's wife. కష్టకాలములో ప్రియబంధుదర్శనము friends and relations arriving in the time of trouble, ఎంగిలితినడము eating the leavings of others, తన, శత్రువులతో స్నేహము చేయడము courting one's enemies, పరాన్నమునకు కాచియుండడము looking for food from strangers, సభలో అప్రతిష్ఠవచ్చుట being ignorant in an assembly of wise men, దరిద్రమనుభవించడము suffering poverty.] అష్టకోణి an octagon, అష్టదిక్కులు the eight points of the compass.--అష్టదిక్పాలకులు the regents of the eight points of the compass, viz. Indra of the East, Agni of the South-east, Yama of the South, Nairriti of the South-west, Varuṇa of the West, Marut of the North-west, Kubēra of the North, and Iṣana of the South-east.--అష్టదిగ్గజములు the elephants supporting the eight corners of the earth-అష్టనగములు the eight serpents supporting the eight angles or points of the world. Their names are as follow: వాసుకి, అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కార్కోటకుడు. అష్టవదులు a certain set of songs of eight lines in length.-అష్టపాత్రములు the eight vessels used in a sacrifice.--అష్టభాగ్యములు the eight requisites to the regal state; as రాజ్యము territory, భండారము wealth, సేన్యము an army, ఏనుగులు elephants, గుర్రములు horses, ఛత్రము an umbrella, చామరము a fly fan or whisk, ఆందోళిక a palanquin.--అష్టభోగములు the eight sources of pleasure, viz., ఇల్లు house, పరుపు bed,వస్త్రము raiment, అభరణము jewels, స్త్రీలు women, పుష్పము, flowers, గంధము perfume, తాంబూలము areca nuts and betel-leaves.--అష్టమదములు eight kinds of pride, viz., అన్నమదము luxury in food, అర్థమదము pride of wealth, స్త్రీమదము pride of lust, విద్యామదము pride of learning, కులమదము, pride of rank and family, రూపమదము pride of beauty, ఉద్యోగమదము pride of station, యౌవనమదము pride of youth.-- అష్టస్వామ్యములు the eight respects in which an absolute conveyance is made, viz., విక్రయ, దాన, వినిమయ, జల, తరు, పాషాణ, విధి, నిక్షేపములు -- అష్టాంగములు See under అంగము. సాష్టాంగదండము prostration in worship. -అష్టాపదము an eight legged dragon: a spider. అష్టావధానము See under అవధానము. అష్టైశ్వర్యములు complete comfort, every blessing, also eight attributes, viz., అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము.
అస్మత్
(p. 104) asmat , అస్మదీయము asmat. [Skt.] (pron.) Mine, my. నా, నాది. అస్మదాగమనము my arrival. అస్మదాదులకు to me and others.
ఉఠావుఠి
(p. 152) uṭhāvuṭhi or హుఠా హుఠి uṭhā-huṭhi. [H.] n. Hastiness. అతిత్వర. ఉఠావుఠిపయనము a forced march. ఉఠావుఠిగా వచ్చి చేరిరి they arrived in a great hurry.
ఎండ
(p. 179) eṇḍa enḍa. [Tel.] n. Heat, sunshine, glare, radiance, ఎండయెక్కినది the sun is high. చిరుఎండ the soft heat of the morning or evening; రేయెండ moonshine. వాడు వచ్చినప్పుడు నిండా యెండయెక్కినది it was late in the day when he arrived. ఎండకాచునప్పుడు when it is hot. నీకు ఎండ తగిలినది, or, నీ ముఖమునకు ఎండతగిలినది you look hot or fatigued, ఎండకన్నెరుగనివాడు one whose 'eye knows not the sunbeam,' i.e., who lives in the shade. ఎండకాలము eṇḍa-kālamu. n. The hot weather. ఎండగట్టు eṇḍa-gaṭṭu. v. t. To tie up (as a cloth) in the sun to dry. ఎండిపోవు. ఎండదెబ్బ eṇḍa-gāli. n. A burning wind. ఎండగోట్టు eṇḍa-goṭṭu. v. i. To dry up or wither ఎండిసోవు. ఎండదెబ్బ eṇḍa-debba. n. A stroke of the sun. ఎండదొర or ఎండరేడు eṇḍa-dora. n. The sun. ఎండపొద్దు eṇḍa-poddu. n. Noon. ఎండమావి eṇḍa-māvi. n. The mirage మృగతృష్ణ. ఎండబెట్టు eṇḍa-beṭṭu. v. t. To put out to dry. ఎదురెండ the sun against the face.
ఎడ
(p. 184) eḍa eḍa. [Tel.] n. Place, space, చోటు; Interval, medium distance. చోటు, అవకాశము, దూరము. An interval of time గడువు. Breach or obstacle విఘ్నము. Business వ్యవహారము. Peace. సంధి. ఎడగల further off. నూరుబారలు యెడగా 100 fathoms off. తనకు బలము లేనియెడ while or if he is powerless. తానియెడ on his not coming. ఊరుచేరినయెడ on his arrival at the village. ఎడ eḍa. adj. Tender, young, లేత. Middle నడుమ. ఎడదూడ a weaned (i.e., separated) calf. కోడియెడ a chicken. ఎడబిడ్డ the last but one child. తొంటియెడ in the former place. ఎడపోవువాడు a gobetween. BD. iii. 737. ఎడలేకున్న continuous, without interval or break. ఎడను or ఎడల regarding, concerning, of, about. నాయెడ towards me. గురునియెడ towards the teacher. ఇడినయెడ on giving, కానియెడ if it is not so. మియడవాయెడ towards you and me. ఇట్లప్పురంబు చేరునెడ on arrival at the town. ఎడగాపెట్టు to set aside, reserve. ఎడకట్టు eḍa-kaṭṭu. v. n. To find a place for itself. To gather or form as a boil ఆరినపుండు మరల చీముపట్టు, చేర్చు. ఎడకత్తె eḍa-katte. n. A bawd. ఎడకాడు eḍa-kāḍu n. A go-between, a pimp. ఎడకారు eḍa-kāru. n. An untimely crop, a crop produced out of season' before the rains. వ్యత్యయకృషి. ఎడకారుగా పుట్టిన forced, grown out of season, succedaneous.
కడ
(p. 234) kaḍa kaḍa. [Tel.] An affix. (Added to the roots of some verbs it forms nouns or adjectives;) రాకడ arrival, coming. పోకడ going. తేరుగడ settlement. మనుగడ (from మను to live) lifetime.
కొంచెము
(p. 314) koñcemu or కొంచియము konchemu. [Tel.] n. A little. Littlleness న్యూనత. కొంచెము కొంచెముగా little by little. కొంచెముగా ఎంచు to esteem slightly. కొంచెములో వచ్చినాడు in a little (time) he arrived, i.e., very soon. కొంచెపు బుద్ధి little sense. adj. Little, small, trifling, slight, petty, the least: contemptible, vile, low. కొంచెపువాడు a low fellow. కొంచెముసేపటికి in a short time. కొంచెముచేయు or కొంచెపరుచు konchemu-chēyu. v. a. To diminish. To wrong or injure. కొంచెపుపాటి kon-chepu-pāṭi. adj. Small, middle-sized. కొంచెమున konchemu-na. adv. In the least, for a trifle. కొంచెకత్తె konche-katte. n. A low or common woman. అల్పురాలు, సామాన్యురాలు. కొంచెకాడు konche-kāḍu. n. A low or common man. అల్పుడు సామాన్యుడు. కొంచెతనము konche-. tanamu. n. Littleness: leanness అల్పభావము, సన్నదనము. కొంచెపడు konche-paḍu. v. n. To be wanting, to lack. తక్కువపడు. To become lean సన్నగిలు.
కొత్తరికము
(p. 318) kottarikamu kotta-rikamu. [Tel.] n. Newness, novelty, freshness. చేరిన కొత్తరకము shortly after he arrived.
గా
(p. 362) gā gā. [Tel.] n. (an adverbial affix being the infinitive కా of అగు) తండ్రిగా ఉండినాడు he was like a father to me దొరగా ఉండెను. he was as master, or he was master. మూడుగా తెలుస్తున్నది it looks like three. గమిగా వచ్చినారు they came in a crowd. నల్లగానున్నది it is black; Added to verbs. It means when, while, as or since. ఈ పని కాగానే as soon as ever this is finished. వాడు చేరగా on his arrival, when he arrived. మీరు ఆ పనిని చేయుచుండగా while you are doing that work.
చేరు
(p. 436) cēru chēru. [Tel.] v. n. To arrive, reach the destination, come to hand. To be close or in contact. To lean ఒరగు. To draw near or approach సమీపించు. To be connected with, united to. To be added, joined, included. To belong, appertain. To be assembled or collected. ఆపద్దు ఈ లెక్కలో చేరదు that item does not belong to this account. ఇది ఆ చట్టములో చేరదు this does not fall under that rule. వాకిలి చేరమూసినావా have you shut the door? తలుపుచేరదెరిచి (BD. v. 234.) setting the door ajar. చెచ్చెరనారాజు చేరంగపిలిచి calling him near or close. చేరపట్టు to bring close (as a boat to ship.) n. A string, a cord, a string of pearls or flowers. సరము, త్రాడు, గొలుసు. A row or a string of spawn in fish. ఉట్టిచేరు the cord on which a net hangs. పాలచేరులు the milk glands. కురువిందచేరులు necklaces of Kuruvinda seeds. కనకపుచేర్లు gold chains. చేరుచు or చేర్చు chēruṭsu. v. t. To put together, to join, unite, mix, combine, include, add. చేరజేయు. To assemble, accumulate. To admit, as a member, to introduce. కౌగిటచేర్చు to embrace. చేరుకొను chēru-konu. v. a. To touch, to lean upon, to join. శత్రువులతో చేరుకొన్నాడు he joined the enemy. చేరుగడ chēru-gaḍa. n. Nearness సమీపము. A refuge, దిక్కు, శరణము. adj. Near సమీపమైన. చేరుగొండి chēru-gonḍi. adj. Stray, strayed. Mischievous. దుష్టము, చేరుగొండి పశువు a stray cow; a wife who has been irregularly married. చేరుచుక్క or చేర్చుక్క chēru-ṭsukka. n. A jewel worn on the forehead. ముత్యాలబొట్టు, పాపటబొట్టు. చేరుడు chēruḍu. adj. Accidental, what comes by chance, not expected. చేరుడుపశువులు stray cattle. చేరుడు బియ్యము rice that is roughly pounded or bruised. చేరుపు, చేర్పు or చేరుబడి chērupu. n. Nearness, closeness, connection. చేరుపుదిమ్మ an abutment. చేరుపాటు chēru-pāṭu. n. Arrival. చేరువ or చేర్వ chēruva. n. Nearness, neighbour-hood; సమీపము. An assemblage, సమూహము, An army, host. సేన. adj. Near. సమీపమైన. చేరువకాడు chēruva-kāḍu. n. The leader of an assembly, a chairman, ఒక సమూహమునకధిపతి. A commander of an army సేనాధిపతి. సేనాధిపతి. A watchman కావలివాడు. చేరువకోల, చేరులకోల, చేర్కోల or చేర్లకోల chēruva-kōla. n. A whip. ౛ాటి కొరడా చేరుబొందు chēru-bondu. n. A strap of leather to beat with కొట్టే తోలు పట్టెడ.
తలికి
(p. 517) taliki or తలికె taliki. [Tel.] affix. Before, until. నేను రాకతలికి or నేను వచ్చేతలికి before I arrived, until I come.
పట్టు
(p. 698) paṭṭu paṭṭu. [Tel.] v. n. To suffice, to last. చెల్లు. To last a long time, హుకాలము చెల్లు. To begin, ప్రారంభించు. To happen, కలుగు. కలుగు. To cost. To fit or suit. To be possessed by evil spirits. To arrive, as ships. To be imbibed or absorbed, as a dye. To be held or contained. To be affected by disease or pain. v. a. To take, to hold, to catch, to apprehend. గ్రహించు. To take by force, నిర్బంధముచేసి గ్రహించు. దొంగను పట్టి కట్టము catch and tie up the thief. To adopt, అవలంబించు. To blow as a conch. ఈ గోనె ఎంత బియ్యము పట్టును how much rice will this bag hold. ఈ మురుగు నా చేతికి పట్టదు this bangle will not fit my hand. వాడు నిండాసేపు ఊపిరిపట్టలేడు he cannot hold his breath long. చెపట్టు or చెట్టపట్టు chē-paṭṭu. v. a. Lit: To take the hand; to take to wife, to marry. చెయ్యిపట్టు to seize the hand, to ravish a female. దారమునుపట్టు, to twist a cord, నేను. గొడుగుపట్టు to hold an umbrella. కాలుపట్టు to geld. కాళ్లుపట్టు to massage or rub the legs. పగపట్టు to conceive hatred. శంఖముపట్టు to blow a conch. కత్తి సానపట్టు to set or grind a knife or razor. కంపుపట్టు to stink. చుట్టపట్టు to smoke a cigar or cheroot. పొగపట్టు to apply smoke. ఆ బొక్కలో నా చెయ్యి పట్టదు my hand will not go into the hole. తలా ఒకదారి పట్టినారు each of them went by a separate road. ఇంకా కోతపట్టలేదు the reaping has not yet been put in hand. ఆ వ్యాజ్యమును పట్టలేదు they did not admit the lawsuit. దానిగోళ్లకు గోరింటపట్టదు the colouring does not adhere to her nails. ఆ మందు ఈ రోగాన్ని పట్టలేదు the medicine has not affected this sickness. ఆ విద్యను బాగా పట్టి ఉన్నాడు he has taken well to that branch of study. గింజపట్టే సమయము the time when the grain is forming in the ear. ఇమదులో ఎవరికేమి పట్టినది who has any thing to do with this? నాలుగుదినములు పట్టును it will take four days. మనిషిపట్టేమాత్రము only large enough to admit a man. అయిదురూపాయీలు పట్టును it will cost five rupees. ముడు గజాలు పట్టును it will take three yards. మన్నెముపట్టి ఉన్నారు they betook themselves to the highlands. ఆనవాలుపట్టు or గురుతుపట్టు ānavālu-paṭṭu v. a. To identify, recognise, know again, verify. పట్టి పట్టి మాట్లాటెను he spoke in a broken manner. ఎవరినిపట్టితే వారు చెప్పుదురు ask whom you will, and they will tell you. మీరు పట్టిమాట్లాడితే ఆ పని అనుకూలమవును if you speak to the point the matter will be settled. అది నా బుద్ధికి పట్టలేదు I do not take (or comprehend) the meaning. పట్టిచెప్పితే ఆ పిల్లవానికి చదువు బాగావచ్చును if you teach him sedulously the boy will learn well. వాడు దానిని పట్టుకొని పీకులాడుచున్నాడు he is troubling himself about it. వాడు పట్టినదెల్లా బంగారమవుచు వచ్చినది whatever he touched turned to gold. ఆ కోటను పట్టుకొన్నారు they took the fort. ఆ దొంగను పట్టుకొన్నారు they apprehended the thief. నా చెయ్యి పట్టుకొన్నాడు he laid hold of my hand, or, he seized my hand. ఆ వాడుకను పట్టుకొన్నాడు he began the practice. ఒక నెల జీతము పట్టుకొన్నాడు he stopped one month's wages. చెప్పగానే పట్టుకొన్నాడు he understood me the moment I spoke. నడుము పట్టుకొన్నది my loins are strained. [పట్టు is also added to a great number of nouns, to give them a verbal signification and in such cases it takes its meaning from the noun to which it is affixed; thus:] తప్పుపట్టు to rust. ఇలుకుపట్టు to be sprained. అక్కరపట్టు to be necessary, to be required or to take interest in. కొవ్వుపట్టు to become fat. బూజుపట్టు to grow mouldy, దోవపట్టు to take a road. సత్తువపట్టు to be recovered, as strength. పట్లుపట్టు to be seized with cramp, &c. వాడు లంచము పట్టుచున్నాడు he takes bribes. వాడికి వెర్రిపట్టినది he has gone mad. నాకు చలిపట్టుచున్నది I feel cold. వాని గుణములు నీకు పట్టుపడినవి you have contracted his habits. వానపట్టినప్పుడు when rain came on. అట్లు చేయడానకు నీకేమిపట్టినది what business had you to do this? what made you do this? గడ్డిపట్టినబీళ్లు land covered with grass. వానిమీద తప్పుపట్టినారు they found fault with him. ఆ మందు నోరుపట్టినది the medicine made his mouth swell. వానికి ౛లుబు పట్టినది he has caught cold. నాకు కూరుకు పట్టినది I became drowsy. ఆ దూడ యింకా గడ్డి పట్ట లేదు the calf has not yet taken to grass. పట్టించు paṭṭinṭsu. [causal of పట్టు.] v. a. To cause to hold. To apply oil or ointment, &c. To make one begin. ఆ చిన్నవాడికి అమరము పట్టించినారు they have made him begin (reading) the Amaram. రేపు నీపని పట్టిస్తాను or నీతాళముపట్టిస్తాను I will settle your business to-morrow, i.e., I will punish you. ఆ పెట్టెను వానిచేతి పట్టించుకొనిరా make him bring the box with you. పట్టింపు paṭṭimpu. n. Application. Concern. పిల్లకాయలచేత ఒక పుస్తకము ఆరంభించడము, శ్రద్ధ, అక్కర, పాటింపు. అమరము పట్టింపు అయిన మూడు నెలలకు three months after setting to work on the Amaram. ఆరాధ్యులకు కర్మమందు పట్టింపులేదు the Aradhyas pay no attention to rites. 'లేనిపట్టింపులెల్లను పూనిచాన.' Ila. iii. 29. పట్టు paṭṭu. n. Holding, a hold. గ్రహణము, పట్టుకొనుట. A handful. Pertinacity, resolution, hold, strength, grip, grasp, seizing. గ్రహణము. An external application to a swelling to allay pain, &c. పూత. Ground, for a proceeding, కారణము. A prop; support, favor; a party or side, ఆధారము. A part of scene in a play, స్థానము, విషయము. విరహపుపట్టు an amorous scene,. యుద్ధపుపుట్టు a warlike scene. A feat in wrestling. అది తలకు పట్టు పెట్టుకొని పండుకొన్నది she put a plaster on her temples and went to bed. ఈ వ్యాజ్యములో పట్టులేదు there is no proper plea in this suit. ఒకని పట్టుగా మాట్లాడుట to speak on a man's behalf. ఒక పట్టుగానుండు to inhit pertinaciously. ఉనికిపట్టు a place, a house, an abode. వాడు పట్టినపట్టు వదలడు he will not relinquish his purpose. వాణ్ని పట్టిన పట్టున తీసుకొనివచ్చిరి they brought him as he was. పట్టుస్నానము bathing at the commencement of an eclipse, as opposed to విడుపుస్నానము bathing at its termination. ఆయన పట్టుబిడుపు తెలిసినవాడు he knows where to be lenient and where to be severe. కూతపట్టునేల as far as a cry may be heard. వారికి కర్మములో పట్టులేదు they do not lay much stress upon ceremonies. వాడు ఎంతమాత్రము పట్టు ఇవ్వకుండా మాట్లాడుచున్నాడు he speaks without giving them any handle. చాలా మంది ఆయనపట్టు అయిరి many followed him, or joined his side. పట్టున (with న the sign of the ablative) at, by, close to. కోరడి పట్టు న along the hedge. గాడీపట్టున at the manager. ఈ పట్టున at present, పట్టు feats in wrestling. కాడు జెట్టిపట్లుపట్టగలడు he is able to wrestle. ఆ చుట్టుపట్ల in the adjacent places, in the neighbourhood. చుట్టుపట్ల వాండ్లు neighbours. పట్టు paṭṭu. n. Silk. పట్టుబట్ట a silk cloth. పట్టునూలు silk thread, spun silk. పట్టునూలుపాలెవాండ్లు a class of silk weavers. పట్టునూలువాండ్లు a class of silk dyers. పట్టుపురుగు paṭṭu-purugu. n. A silkworm. Also, an insect called ఇంద్రగోపము. పట్టంచు paṭṭ-anṭsu. (పట్టు+అంచు.) n. A silk border, a border fringed or trimmed with silk. పట్టుకొమ్మ paṭṭu-komma. n. A refuge, stay, support. అధికారము, ఊతకోల. పట్టుకారు Same as పటకారు (q. v.) పట్టుకొను paṭṭu-konu. v. n. &t. To catch, to catch hold of, to seize. పట్టుకోలు paṭṭu-kōlu. n. Catching. పట్టుకొనుట. పట్టుజిట్ట paṭṭu-jiṭṭa. n. A sort of bird. S. i. 187. పట్టెడు paṭṭ-eḍu. adj. A large handful. Lit. 'as much as the hand will hold.' పట్టుజీనువు paṭṭu-jīnuvu. n. A kind of bird, పిగిలిపిట్ట. పట్టుడు paṭṭuḍu. n. Persistence, పట్టుదల. adj. Choice, select. పట్టుడువేట a first rate sheep. పట్టుడావు a picked cow or fine cow. పట్టుదల paṭṭu-dala. n. Affection, favour, Perseverance, persistence. వదలనిపట్టు, అభినివేశము. వానికి దానిమీద నిండా పట్టుదల he has a great regard for it. పట్టుబడి paṭṭu-baḍi. n. A sum received or credited in an account, the worth or coat of any thing, charges, expense, outlay. పట్టుబడు paṭṭu-baḍu. v. n. To be seized or apprehended. చిక్కుకొను. To become plain, విదితమగు. పట్టుసారువ paṭṭu-sāruva. n. A fork-like beam used to hold by while working a pikota or water-lift మీట త్రొక్కువాడు ఆధారముగా పట్టుకొనే పంగలకొయ్య. పట్లు. plu. of పట్ల paṭla. [from పట్టుల.] adv. About, as ఆ చుట్టుపట్ల in that neighbourhood, round-about. With regard to, with reference to, in the event of. వాడు అక్కడ ఉండినపట్ల in case of his being there. ఇంటిపట్ల at home. అతనిపట్ల అన్యాయముచేయకు do him no wrong. ఈపట్ల in this respect, in this matter.
పాటి
(p. 734) pāṭi pāṭi. [Tel.] n. Degree, extent, quantity, size. ప్రమాణము. Value, character, quality, kind, sort. విధము. Fitness. Resemblance, equality, సామ్యము. adj. Equal, సమము. Common, general, సామాన్యము. Due, fit, న్యాయ్యము. Of such a size or character, కొలదిది. పాటికొల an exact measurement. ఈ పాటిచాలును so far will do, thus much is enough. 'పదుగురాడుమాట పాటియై ధరజెల్లు,' the words of many people will carry weight. ఈపాటికి వచ్చియుండును by this time he will have arrived. వానిపాటి యోగ్యత నీకు ఉండినను చాలును it will be enough if you are equal to him. ఏపాటి రూకలు how much money? అది ఒక పాటిగానున్నది it is tolerably good. పాటిరేవు a ford in a river. పాటినేల rich soil (see పాడు.) వీడు ఏపాటివాడు what kind of a man is he? సన్నపాటికర్ర a slender stick. తగుపాటి competent, fit, suitable. కొంచెపాటి small. కొంచెపాటివారు base men, low people. అల్పులు నీకు బుద్ధిచెప్పే పాటివాడు ఇక్కడ లేడు there is no one here fit to advise you. ఇది యేపాటిపని what sort of business is this? పాటిపాటిగా little by little, కొద్దికొద్దిగా. పాటిగొను pāṭi-gonu. v. a. To consider as equal, సరిచేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close