Telugu to English Dictionary: comedy

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకిలిపడు
(p. 3) aṅkilipaḍu ankili-paḍu. v. i. To obstruct to come in the way. అడ్డుపడు. అంకిలిపెట్టు v. t. To prevent.
అంటనిల్లు
(p. 8) aṇṭanillu antasillu [Tel.] v. i. To come near, to approach. చేరు. 'ఆరదంబులరదంబులతో నటసిలినడుచుచు.' ఉ.హరి. iv.
అండి
(p. 9) aṇḍi anḍi. [Tel.] Sir, O sir, O ye! ఏమండి what, sir! రాకండి please do not come అట్లు చెప్పకండి please do not say so.
అందము
(p. 14) andamu andamu. [Tel.] n. Beauty. సౌందర్యము. Manner. నాలుగందాల or అన్ని అందాల in every way. Carr. 1248. అందపడు andapaḍu. [Tel.] v. to become beautiful, handsome, అందపరుచు to cause to be beautiful, to adorn.
అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అక్కర
(p. 20) akkara akkara. [Tel.] n. Necessity, occasion, want, need, desire, అగత్యము. అక్కరతీర్చు to relieve from want. అది నాకక్కరలేదు I do not want it. దీనితో నీకేమి అక్కర what have you to do with this? నీవక్కడికి రావలసిన అక్కరయేమి what business had you to come there? అక్కరకొద్దీ మాట్లాడుట to speak as necessity demands. అది అక్కరకురాదు it will be of no use. వాడికి ఆ పని అక్కరపట్టలేదు he does not care for it. అక్కరకాడు one who is in need. అక్కరగలవాడు; అక్కరగండడు one who has an interest in an affair. శ్రద్ధగలవాడు; అక్కరపడు, అక్కరగొను to feel an interest in a thing. అక్కరకలిగియుండు, అక్కరపాటు a state of necessity. అక్కరపడుట.
అగత్యము
(p. 23) agatyamu agatyamu. [Tel.] n. Necessity, need. అవశ్యకత. అగత్యము adj. Urgent, important, needful. అవశ్యమైన, అగత్యములేని unnecessary. అగత్యమైనపని an urgent affair. ఆ మాటనుగురించి నీకేమి అగత్యము what is that to you? అగత్యముగా adv. Urgently, assuredly, positively, by all means. అవశ్యముగా అగత్యముగా రా you must certainly come.
అగస్త్యుడు
(p. 24) agastyuḍu agastyuḍu. [Skt.] n. Name of a certain sage. కుంభసంభవుడు. అగస్త్యశాకము the leaves of a leguminous tree which are dressed and eaten, అనిసెచెట్టు; అగస్త్యనక్షత్రము the star Canopus. అగస్త్యచారము the cource of Canopus. అగస్త్యాదయము the rise of Canopus. అగస్త్యభ్రాత (lit: the brother of Agastya.) a new-comer, who tries to make out that he is a great personage.
అగు
(p. 25) agu agu. [Tel.] (commongly written అవు), v. To be, to become, to prove to be. The present p|| is అగుచు, or అవుచు as అగుచున్నాడు or అవుచున్నాడు he is becoming. మిక్కిలి సిరి అగును much fortune will result. The past p|| is అయి as దొంగ అయి turned a rogue, become a thief. The root in A of అగు is కా as అట్లా కారాదు it cannot happen so. Aorist p|| అగు, అగునట్టి, అయ్యే, అయ్యెడి as క్రూరుడగు cruel. శాలివాహనశక వర్షంబులు 1466 అగునట్టి క్రోధి సంవత్సర కార్తీకశుద్ధ 5 శనివారము Saturday the 5th of the bright fortnight of the month Kārtika in the year Krodhi 'which is' the year 1466 (of the Salivahana æra.) ఇది దొంగతనము అయ్యేపనిగనుక as this is a matter in which a man might prove a rogue. Past Rel. p|| అయిన as నాది అయిన గుర్రము a horse of mine. The imperatives are కమ్ము plu. కండి. Causal forms కాజేయు or కావించు. Negative aorist కాదు, &c. అగుర = అగను+ర = అవును. It is so. 1. To be, to become, as కాకి కోకిలయగునె can a crow become a cuckoo? వాడు ఏమయినాడు what has become of him? దొంగ అయినాడు he proved to be a thief. వాడు నేరస్థుడైనాడు he was found guilty. ఆ పని అవును కాకపోవును that undertaking may or may not be accomplished. వానికి ఆకలి అవుతున్నది he is hungry. ఇట్లు రాత్రియగుట as it was now night. బాలుడగుట as he is but a child. 2. To be made, to be finished, to be spent or expended, to elapse, as పని శీఘ్రముగా కావలెను the work must be done soon. వివాహమగుము marry her. ఆ పెండ్లి అయినది the marriage took place. భోజనమయినది dinner is over. రాజదర్పనమయినది I got a sight of the king. అయినదాన్ని చూపు shew what has been done. ఆ పని అయినది the work is over, it is done. కావచ్చినది it is nearly done. రూకలు అయిపోయినది the money is expended. సంవత్సరము అయినది a year has passed. నెల అవుతున్నది it is about a month since. అర్థమయినదా do you understand it? సాకు భావముకాతేదు I do not understand it. భావముయనది I understand it. స్నానము కావించు to bathe, or to cause to bathe. తీర్పుకాలేదు no decision has been given. మ్రుచ్చిలితెచ్చుట మగతనం బగునె is it a manly thing to steal? 3. To be proper or fit, to be agreeable, as ఇచ్చట నుండనగునే మనకు is it fit for us to remain here? కాని పని an improper or unbecoming act. అట్లా చేయనవునా is it right to do so? పగలు కాచినపాలు ఆ రాత్రికి అవును milk boiled the same day is fit for use that night. అతనికీ నాకు కానందున as we are not on good terms. అయినవాండ్లున్ను కానివాండ్లున్ను friends and enemies. 4. To grow, as ఈ తోటలో ఏమి అవుతవి what is grown in this garden? ఇక్కడ వరి కఅదు rice does not grow here. 5. (Governing a dative) To stand in relation, as వాడు నీకేమవుతాడు how is he related to you? నాకు కావలసినవారు my relations. వానికి మేము ఏమీకాము we are in no way related to him. 6. Added to some nouns it gives them a verbal significance, as వారు ఎప్పుడు ప్రయాణమవుతారు when will they start or set out? విభాగాలు అయి వేరింటి కాపురము చేస్తున్నారు they seperated and live apart.
అగ్గపడు
(p. 25) aggapaḍu agga-paḍu. [Tel.] v. n. To bow, yield, to become subject. వశమగు See అగ్గము.
అట
(p. 30) aṭa ata. [Tel.] or అంట (contraction of అంటున్నారు they say) It is said, they say. వాడు వచ్చెనట they say he is come. రావటే for రావటవే, i.e., రానంటావే యేమే what, will you not come? కోపమటే, i.e., కోపమాయేమే what, are you angry? బాలుడటేనాడు what! do you call him a child? అటరా is a contraction for అంటావురా dost thou say so?
అట్టు
(p. 32) aṭṭu or అట్టుగా aṭṭu. [Tel.] adv. (A particle) So that, as, according to. అతడు వచ్చేటట్టు వ్రాయుము write a letter so that he may come. మీరు చెప్పినట్టుగా చేస్తిని I did as you bid me. ఆయన చెప్పినట్టు according to his order. వాడు ఇంకా అవతలకు పోవునట్టు అగుపడ్డాడు he seemed as though he would go further. నేను చెప్పినట్టు చేసినాడు he did as I said. వారు సాగిపోయినట్టుగా చెప్పెను he said that they had passed on. అట్టు గాక or అట్లాకాక aṭṭugāka. adv. Without being so. అట్టుల aṭṭula. adv. As soon as, soon after. వెంటనే. 'చెట్టు దిగి వచ్చినట్టుల.' H. ii. 47. Just as. ఆప్రకారము. అట్టే (for అట్లాగే) aṭṭē. [Tel.] adv. Thus. So. In the same manner, as it was. అట్టే ఉండనీ leave it as it is. నొప్పి అట్టే ఉన్నది the pain is in the same state. అట్టే పోయినాడు he went off straightway. అట్టే మాట్లాడుతూ ఉండినాడు he was talking straight on. ఆ గుర్రములట్టే ఉన్నవి the horses are as they were: they are untouched.
అట్లు
(p. 33) aṭlu aṭlu. [Tel.] (adv.) So, as, according to. అట్ల aṭla. [Tel.] adv. Like, as. వాడు చెప్పినట్ల as he said. ఎప్పటియట్ల as usual. శత్రువులట్ల like enemies. తనయట్ల పంజ్తివారును people like himself. అట్లా aṭlā. [Tel.] adv. So, thus. అట్లా చెప్పినాడు he said so. అట్లా ఉన్నది it is so. అట్లా పో go there. ఇట్లా రా come here. ఇట్లాగంటి aṭlāgaṇti. [Tel.] adj. Such. అలాగంటి, అలాటి. అట్లాగా or అలాగా. Is it so? అట్లాగు aṭlāgu. [Tel. from అట్లు+లాగు.] adv. Thus, so. అట్లాగే just so, yes, very well, అలాగు. అట్లాటి aṭlāti. [Tel.] adj. Such, like this, like that అలాగంటి. అట్లేని if so.
అడ
(p. 33) aḍa aḍa. [Tel.] n. A lump, clot, mass (as of dates, sugar, hair, &c.) ముద్ద, చింతపండడలు lumps of tamarind. అడకట్టు or అడగొను to become clotted. ముద్దకట్టుకొను. తల అడలుకట్టినది the hair became matted, all the tresses are matted together. అడచేయు aḍa-chēyu. [Tel.] v. To knead and make into lump.
అడపర
(p. 34) aḍapara aḍapara. [Tel.] n. A lump, a clod. ముద్ద, అట్టు. అడపరగట్టు to become a lump.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close