Telugu to English Dictionary: friendship

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఒద్దిక
(p. 211) oddika oddika. [Tel.] n. Concord, union, friendship అనుకూల్యము. The weights in a pair of scales, a counterpoise col ఒక వస్తువునకు సరియెత్తుగానుంచి తూచేరాళ్లు మొదలైనవి ప్రతిమానము
కలుపు
(p. 259) kalupu kalupu. [Tel. causal of కలియు.] n. A mixture. Weeds. పైరులోని కసపు మొదలైనవి. Curds పెరుగు. v. a. To mix. To join, unite. To bring together. To receive (into one's family or caste). దాన్ని కులములో కలుపుకొన్నారు they received or admitted her into the caste అతణ్ని కలుపుకొని యెందరు అయినారు including him how many were there? కలుపుకోలుతనము or కలుపుకోలు kalupu-kōlu-lanamu.n. Intimacy, friendship. అభేదము.
ద్యోతకము
(p. 616) dyōtakamu dyōtakamu. [Skt.] adj. Illuminating. ప్రకాశింపజేయునది. Conveying, shewing. స్నేహద్యోతకము what shews friendship. ద్యోతము dyōtamu. n. Light, heat. ప్రకాశము, ఎండ. ద్యోతించు dyōtinṭsu. v. n. To shine, or flash. ప్రకాశించు. ద్యోవీధి dyō-rīdhi. n. The path of light, i.e., the sky.
నీరు
(p. 668) nīru nīru. [Tel. of. Tam. తన్నీర్.] n. Water. ఉదకము. Fluid. టెంకాయనీరు cocoanut water. Bad humors in the body. బళ్లునిరుపట్టినది the body is bloated. Urine, మూత్రము. కొత్తనీరు freshes in a river or rain water. కన్నీరు a tear. plu: నీళ్లు water. కంట నీళ్లుపెట్టుకొన్నది She shed tears. మంచినీళ్లు తాగినతీరుగా coolly, as easily as if drinking water. నీరుగుట to melt away, perish, turn to water. బంగారునీరు gilding, gold water. బంగారునీరుపోయు to gild, to dissolve gold. నీటికానుపు or నీటిచూలి nīṭi-kānupu n. Lit Water-born, i.e., Fire, అగ్ని. నీటికుప్ప, నీరుకుప్ప, నీటిరాశి, నీరువామి or నీర్వామి nīṭi-kuppa. n. The sea. సముద్రము. నీటితాత nīṭi-tāta. n. The wind. వాయువు. నీటిదయ్యము nīṭi-dayyamu. n. A water-sprite. జలగ్రహము. నీటిపుట్టుగు, నీటుపుట్టుగు or నీటుపుట్టువ nīṭi-puṭṭugu. n. A lotus, నీటియిక్క nīṭi-yikka. n. A jewel worn on the breast of Vishṇu. కాస్తుభము. నీటిరిక్క nīṭi-rikka. n. The constellation called పూర్వాషాఢా నక్షత్రము. నీటిరేడు or నీటిరాయుడు nīṭi-rēḍu. n. Varuna, the god of the Ocean. నీటిరేనిరిక్క nīṭi-rēni-rikka. n. The constellation called శతభిత్తు. నీరాకు nīrāku. (నీరు+ఆకు.) n. Moss, water-weeds. పాచి. నీరాట or నీరాటము nīr-āṭa. (నీరు+అట.) n. Bathing, a bath. స్నానము. Sporting in water, జలక్రీడ. నీరాడు nīr-āḍu. v. n. To bathe. స్నానముచేయు, క్రుంకు. n. Hot water poured on a curry while being cooked, కూరాటిలోపయు వేణ్నీళ్లు. నీరామని nīr-āmani (నీరు+ఆమని.) n. The rainy season. వర్షఋతువు. నీరారుచు or నీరార్చు nīr-āruḷsu. v. a. To cause to bathe నీరాడజేయు. To create a friendship between, స్నేహము చేయించు. నీరాటము nīrāṭamu. n. Bathing, స్నానము, 'కయిచేసినృపరాత్మజకెంతో, నీరాటమొనర్చియు శృంగారించి' Bilh. iii. 203. An aquatic animal. 'క నీరాటవనాటములకు, బోరాటంబెట్లుగలిగె పురుషోత్తముచే. నారాటమెట్లుమానెను, ఘోరాటవిలోన భద్రకుంజరమునకున్. ' B. VIII. 110. నీరుకట్టు or నీరుపెట్టు to water, to irrigate. నీటికాలువ a watercourse. నీరావు nīr-āvu. n. The 'water cow,' i.e., the boat-fly, an aquatic insect called notonccta. నీరుకట్టు or నీరరికట్టు nīru-kaṭṭu. n. Ischuria, a stoppage of urine. మూత్రబంధరోగము. నీరుకట్టె, నీరుకట్టియ or నీరుపాము nīru-kaṭṭe. n. A water snake. నీరుకాకి nīru-kāki. n. A cormorant. నీరుకాయ nīru-kāya. n. A sort of jelly or blubber found on the sea beach. A bubble of water, నీటిబుగ్గ, బుద్బుదము. నీరుకాయవాడు or నీరుకాయమోడు nīrukāya-vāḍu. n. A man of the sea, a triton. నీటిమనుష్యుడు. నీరుకాసు nīru-kāsu. n. Alms given at bathing places. 'తీర్థసన్నిధి మంత్రములుచెప్పి నీరుకాసులుగడించి.' H. ii. 166. నీరుకుక్క nīru-kukka. n. The common otter, Lutra vulgaris ( F.B.I.) నీరుకోతి nīru-kōti. n. A water monkey. నీరుకోడి nīru-kōḍi. n. A water-fowl. నీరుగండి nīru-ganḍi. n. A large snake, పెనుబాము, అజగరము. నీరుగన్నేరు nīru-gannēru. n. A species of oleander, హింజలము. నీరుగొబ్బి nīru-gobbi. n. A kind of tree, ఇక్షురము. నీరుగోరంట nīru-gōranṭa. n. A light tinted గోరంట; a species of this plant which has a light, red tint. నీరుచిచ్చు or నీర్చిచ్చు nīru-chiṭsṭsu. n. Fire said to exist under the ocean, బడబాగ్ని, బాడబము. నీరుచురుకు nīru-ṭsuruku. n. Heat of urine, a disease. నీరుజీలుగ nīru-jīluga. n. A plant. Ӕeschynomene aspera (E. P.) నీరుట్టుభూమి nīr-uṭṭu-bhūmi. [నీరు+ఉట్టు for పుట్టు.] n. Land under which there are springs. నీరుటెంకి .nīru-ṭenki n. A lake, జలాశయము. నీరుడి nīruḍi. (నీరు+ఊడు.) n. A disease in which excessive urine is passed, diabetes. Urine. ముత్రము. నీరుడుము a water iguana, నీటిఉడుము. నీరుతాలుపు or నీటుతాల్పు nīru-tālupu. n. A cloud, మబ్బు. నీరుతిట్ట nīru-tiṭṭa. n. The sea. నముద్రము నిరుతిత్తి nīru-titti. n. The bladder, మూత్రకోశము. నీరుతుట్ర. నీరుదొత్త nīru-tuṭra. n. A water snake. నీరుదోమ nīru-dōma. n. A water mosquito. నీరుద్రిమ్మరి a water animal, జలజంతువు. నీరు పంది nīru-pandi. n. The porpoise. వారి. కిటి. నీరుపచ్చ nīru-paṭsṭsa. n. A sort of emerald. నీరుపాడి nīru-pāḍi. A plant called కార్కోటి. నీరుపాప nīru-pāpa. n. A sort of mermaid, described as a dumb monster somewhat resembling a man in limbs. నీటుమనుష్యుడు. నీరుపిల్లి nīru-pilli. n. A water cat, an otter. నీరువ్రబ్బచెట్టు nīru-prabba-cheṭṭu. n. A kind of plant, the reton plant, Bolomus rotong. జల వేతసి. నీరుబొద్ది nīru-boddi. n. A sort of vegetable. See బొద్ది. నీరుమజ్జిగ or నీరుచల్ల nīru-majjiga. n. Thin buttermilk. చాలా నీళ్లు కలిసిన చల్ల. నీరుమట్టము nīru-maṭṭamu. n. Water level. నీళ్లునిలుచు ప్రమాణము. నీరుమట్టపుపలక an instrument called a water-level. నీరుముంపు nīru-mumpu. adj. Watery, జలప్రాయము. నీరుముట్టు nīru-muṭṭu. v. n. To touch water, జలస్పర్శముచేయు; to make water, so called because the Hindus afterwards touch water as purification. 'నీటిచేరువకొరగాదు నీరుముట్ట.' వి. పు. iv. నీరుల్లి nīr-ulli. n. An onion. Alliumcepa [Watts.] నీరువంగ or నీటివంగ nīru-vanga. n. A kind of brinjal. నీరుపట్టు or నీర్వట్టు nīru-vaṭṭu. n. Thirst. దప్పి. పిపాస. నీరుపట్టుగొను to be thirsty. నీరువత్తిగ or నీరొట్టు nīru-vattiga. n. A sort of sweetmeat. H. i. 117. పేణీలు. నీరేనుగు nīr-ēnugu. n. A water elephant, నీటిగజము.
పరిచయము
(p. 717) paricayamu or పరిచితి pari-chayamu. [Skt.] n. Acquaintance, intimacy, knowledge. ఎరుక, స్నేహము. పరిచయించు pari-chayinṭsu. v. n. To contract friendship. స్నేహించు. పరిచితము parichitamu. adj. Known, acquainted with. పరిచయముగల.
పల్లాయనము
(p. 727) pallāyanamu pallāyanamu. [Tel.] n. Relationship, friendship. ఆప్తత. పల్లాయనమువాడు a friend, ఆప్తుడు.
పేరిమి
(p. 796) pērimi or పేర్మి pērimi. [Tel. పేరు+ఇమి.] n. Excess, greatness, eminence. అతిశయము, గౌరవము. Affection, friendship. ప్రేమ, స్నేహము. 'యాదవవీరుల కాసమయంబున మద్యసానోద్యోగమదమునేర్మి.' M. XVI. i.67. పేరిమికాడు pērimi-kāḍu. n. A great man, గొప్పవాడు, ఘనుడు.
పొందు
(p. 801) pondu or ఒందు pondu. [Tel.] v. n. To wink, (కన్ను) వాలు. To gain, obtain, get, acquire. To reach, attain to. To have, enjoy. To suffer, experience, meet with joy, grief or death, &c. ప్రాపించు. వానిని లక్ష్మిపొందినది good luck has be fallen him. అవమానమును పొందినాడు he incurred disgrace. సంతోషమును పొందినాడు he was pleased. నష్టమును పొందినాడు he incurred loss. విఘ్నమొందక meeting with no obstacle or cheek. నరకమును పొందినాడు he fell into hell. కన్నుపొందు to sleep. 'ఆ కడుపు నిండగుడువ గానమిరేయెల్ల, గన్నుపొందకున్న కరముడస్సి, యున్నవాడనాకు.' M. I. vi. 322. కన్నుపొందకున్న, అనగా నిద్రలేకుండా ఉండడముచేత. Also, to have intercourse with. కలయు. n. Fitness. suitability, agreement. పొందిక intercourse, friendship, స్నేహము. Joining, union, సంధి. The act of obtaining a thing ప్రాప్తి. Sameness, want of difference, అభేదము. Agreeableness, అనుకూల్యము. adj. Friendly, స్నేహితుడు. 'రాలపొందెరింగి రాలగూర్చినభంగిలోను పొందెరింగిలోనుపరచి.' Vēma. 637. పొందుకాడు ponḍu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొందుకొను pondu-konu. v. n. To be fixed or established, నెలకొను. పొందుపడు pondu-paḍu. v. n. To be agreeable or fit, సరిపడు, అనుకూలించు. పొందుపాటు ponda-pāṭu. n. Convenience, suitability, aid, help. వానికి ఆ రూకలు పొందుపాటు కాలేదు he could not get the money. పొందుపాటుచేయు to arrange, అనుకూలముచేయు. పొందించు pondinṭsu. To cause to obtain, get, or experience. నన్ను ఈ శ్రమ పొందించినారు they caused me this trouble. 'మగువత నంబునజగముల తగులము బొందింప గొంతదడవెముకుందా.' B. viii. 446. పొందిక pondika. n., Fitness, agreement, aptness. ఇమిడిక. Intercourse, సహవాసము, కలయిక. 'సీతాకాంతముని స్త్రీల పొందిక లుమరగి.' R. v. 59.
పొత్తు
(p. 807) pottu pottu. [Tel.] n. Friendship, partnership, holding in common. స్నేహము, సహవాసము, విశ్వాసము, ఉమ్మడి, అవిభక్తిత. పోరునష్టి, పొత్తులాభము (proverb) quarrelling is a loss, friendship is a gain. పొత్తునగుడుచు to eat together as messmates, బిగిసిగాతిను. వీధులు అందరికిపొత్తు the streets are free or common to all men. ఆ సరుకులు పొత్తున కొన్నారు they bought the goods between them, or as common stock. ఆ పని పొత్తులుపోక పడవేసిపెట్టినారు the work is left undone because they could not settle which of them should do it, ఆ పని నీదంటే నీదని పడవేసిపెట్టినారు. 'నృపుపొత్తుబాముపొత్తుంగపటుండగు మిత్రుపొత్తుగడుసరిపొత్తుం, విపరీత భార్య పొత్తుం నెపమిది నిడువంగవలయు.' Sumati. 129. 'ఇట్టి అవమానపుపొత్తు మనంగ వచ్చునే.' M. IV. iii. 33. పొత్తులవాడు he in whom both parties have an equal right or interest. ఇద్దరికి సమమైనవాడు. 'ఏనుపొత్తులవాడనై యిరువురకును.' ib. XII. v. 257. adj. Friendly, united, associated. స్నేహితము, సంగతము. పొత్తుకాడు pottu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొత్తుకత్తె pottu-katte. n. A female friend. స్నేహితురాలు. పొత్తుగుడుచు pottu-guḍuṭsu. v. n. To avail or come to good. పనికివచ్చు.' సత్యములు పొత్తుగుడుచునా సున్నుతాంగి భళిర సత్యములానలైనచ్చునీకు.' Ila. iv. 21. టీ సత్యములు పొత్తుగుడుచునా, బాసలు కలిసివచ్చునా. పొత్తుగుడుపు pottu-guḍupu. n. Eating together as messmates. పంజ్క్తిభోజనము. పొత్తుచేయు pottu-chēyu. v. n. To make friends with, to cultivate friendship, to associate with, స్నేహము చేయు. పొత్తువు pottuvu. n. An epithet of Sarasvati, సరస్వతి.
పోవు
(p. 822) pōvu pōvu. [Tel.] v. n. To go, proceed. To pass, cease, disappear. To be lost, to die. ఇంటికి పోయినాడు he went home. వానిదోవను వాడు పోయెను he went his way. వానితండ్రి పోయినతరువాత after his father's death. పదిదినములు పోయిన తరువాత after ten days had passed. వాన పోయిన తరువాత after the rain ceased. ఆ పుస్తకముపోయినది the book is lost. వాని కండ్లు పోయినవి he lost his eyes. చిల్లులుపోయిన చెంబు a mug that leaks. పదింటిలో నాలుగుపోతే ఆరు deduct four from ten and six remain. వాడు దానితోపోయినాడు he had (sexual) intercourse with her. Added to infinitives in A, it gives the signification of intent or futurity. వ్రాయబోతే వద్దన్నాడు when I was going to write he told me not to do so. దాన్ని కొట్టబోయినాడు he was about to strike her. వారెప్పుడు పోబోతారు when are they going to set out? చెప్పబోయేవుసుమీ take care, you don't mention it. Affixed to the past affirmative participles of many verbs, it denotes completeness: as ఆ గోడ పడిపోయినది the wall has fallen down. ఆ మాటలు ఇప్పుడు ఏటిలో కలిసిపోయినవి those words are now all forgotten; lit: gone into the river. వారక్కడనే ఉండి పోయినారు they settled there. Joined to negative participles it is used to form a past tense negative. రాకపోయెను he did not come. పోకపోయెను he did not go. వినకపోయెను he would not listen. పోవుదెంచు Same as పోవు. Also, to pass, as time, కడచు, పోదోయు pō-dōyu. v. a. To baffle, to push back, to thrust away. పోదోలు pō-dōlu. v. a. To drive off. పోనాడు pōn-āḍu. v. a. To drive off, to turn away, to abandon. To blame, censure, నిందించు, పోగొట్టు or పోగొట్టుకొను to lose. పోని pōni. (neg. part. of పోవు) who or which goes not. పోని దోషము a sin that cannot be removed or done away. లేనిపోని nonsensical. లేనిపోనిమాటలు foolish language. లేనిపోనిపని a foolish thing. లేనిపోనిదేవులు gods that are no gods. పోని. [for పోనిమ్ము.] imperative: Let it go, let it pass. Never mind. పోనొత్తు pōn-ottu. v. a. To do away, to remove. 'అయ్యుంతులు, చిత్తజుబాణములచేత సిగ్గంతయుబోనొత్తి మునిబెండ్లియాడగ తత్తరపడుటెరిగి.' Vish. v. 147. పోపడు pō-paḍu. v. n. To go, పోవు. 'క కోపంబునరాజుకొడుకు గుడ్డులు రెండుం, బోపడునట్లుగగోళ్లన్, వేపెరికి.' M. XII. iii. 243. పోబడి pō-baḍi. (పోవు+బడి.) n. A trace. ౛ాడ. పోబెట్టు pō-beṭṭu. n. A kind of noise expressive of love. అనురాగమువల్ల గలిగినధ్వని. పోము pōmu. (1st. pers. plu. neg. aor. of పోవు.) We will not go. పోరాని pō-rani. adj. Unavoidable, Friendly, loving, dear, ఆప్తమైన. పోరానిచుట్టము a dear relation. పోరామి pō-rāmi. n. Affection, love, friendship, స్నేహము. 'పోరేరారెప్రియంబుగల్గినజనుల్ పోరామిపోబోవునే.' Swa. iii. 173. 'ఆరాములలోనెప్పుడు, పోరాములుచాలనెరపి పురుషోత్తముడున్.' B. X. §. 59. Hardship, trouble, సంకటము. పోయిన pōyina. (past rel. p of పోవు.) Gone, departed, lost. Also, past, last, as పోయిన సోమవారము last Monday: పోయిన నెల last month. పోయివచ్చు pōyi-vaṭsṭsu. v. n. To take leave, to go, వెళ్లు. పోయివస్తాను farewell, goodbye. పోవిడుచు pō-viḍuṭsu. v. a. To abandon, give up, let go. మాను, వదలు.
ప్రణయము
(p. 826) praṇayamu pra-nayamu. [Skt.] n. Affection, love, friendship, friendly or fond regard, acquaintance. ప్రణయకలహము lover's quarrels, discord between man and wife. స్నేహము, ప్రేమము, మంచిమాటలాడడము, వినయము. ప్రణయించు praṇayinṭsu. v. a. To kindle, to make a fire burn. ప్రజ్వలింపజేయు. 'అలరగసోమయాజులరుణాస్తమయంబుల నుల్లసిల్లనగ్నుల ప్రణయింపనూదగను. గంపునచొప్పుడు ధూమాజాలముల్ కలయగ బర్వెనోయన.' Bmj. ii.23. ప్రణయిని praṇayini. n. A beloved woman. ప్రియురాలు.
ప్రాణము
(p. 845) prāṇamu prāṇamu. [Skt.] n. Air, wind, breath, life, vitality, the living soul. గాలి, హృదయమందలి గాలి, హృదయమందలిగాలి, ఉసురు. In Grammar, a vowel. ప్రాణముతోనున్నవాడు one who is yet living. కొనప్రాణముతోనున్నాడు he is nearly dead. ప్రాణమువిడిచెను he breathed his last, gave up the ghost. పంచప్రాణములు pancha-prāṇamulu. n. The five vital airs, called ప్రాణము, అపానము, సమాణము, ఉదానము, వ్యాసము. అతడు దానిమీద ప్రాణములు విడుస్తున్నాడు or వానికి దానిమీద పంచప్రాణములు he loves her very dearly. ప్రాణముమీదకువచ్చేపని a most perilous affair. వానిప్రాణము మీదికి వచ్చినది he is in danger of his life. ప్రాణముతో పట్టుకొనిరి they caught him alive. నా ప్రాణముపోయినా ఇట్లు చెప్పుదునా I will not say so even if it should cost me my life. వాడు పిడికిట ప్రాణములు పట్టుకొని వచ్చినాడు he arrived half dead. వానికి నేర్పుట ప్రాణసంకటమవును it would cost immense labour to teach him. ఆ విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠచేసినారు literally, they gave life to the image, i.e., they performed the ceremony by which the god is supposed to be lodged in the image. ప్రాణత్యాగము suicide, ఆత్మహత్య. ప్రాణాతురము or ప్రాణసంకటము deadly peril. 'ప్రాణాతురమైనచో పరిణయంబులయందును బల్కుబొంకు సత్యాతిశయంబు.' M. III. v. 67. ప్రాణాపాయము mortal danger. ప్రానావనము saving the life. ప్రాణావసానకాలమున in his last moments. ప్రాణాహుతి the five morsels offered to the five vital principles. ప్రాణస్నేహము intimate friendship. ప్రాణదానముచేసినాడు he gave them their lives, he spared their lives. నా ప్రాణము ఉండేమట్టుకు as long as I live. ప్రాణగొడ్డము prāṇa-goḍḍamu. n. The loss of life, death. చావు, ప్రాణహాని, ప్రాణాపాయము. 'వినునృపరాజ్యామిషముంగొనపలువురచేత ప్రాణగొడ్డంబైయున్నను ధీరుడే మరమినది దనకునుదక్కించుకొను బుధస్తుత్యముగాన్.' M. XII. ii. 208. ప్రాణదుడు prāṇa-duḍu. n. The giver of life, the creator. బ్రహ్మ. ప్రాణనాధుడు or ప్రాణేశుడు prāna-nādhuḍu. n. The lord of (her) life, i.e., a husband or lover, మగడు. Yama, యమధర్మరాజు. ప్రాణవాయువు prāṇa-vāyuvu. n. Oxygen gas. ప్రాణాచారము prāṇā-chāramu. See ప్రాయోపవేశము. ప్రాణాయామము prāṇā-yāmamu. n. A ritual mode of breathing, while mentally reciting certain prayers, stopping one nostril and inhaling or exhaling with the other: నాసికారంధ్రము లవద్ధనుండు వాయువును మంత్రపూర్వకముగా నిరోధించుట. A. iii. 88. ప్రాణి prāṇi. n. A being, or living creature. జంతువు.
ప్రియము
(p. 849) priyamu priyamu. [Skt.] adj. Dear, beloved, desired. ఇష్టమైన. Dear or high, in price. ప్రియవచనములు చెప్పి దాన్ని తీసికొని వచ్చినాను by using fair words I brought her. n. Love. desire, affection, friendship, ప్రేమ. Joy, సంతోషము. ప్రియములాడు to be kind, to speak kindly. కరణాలకు సలాములు కాపులకు ప్రియము చెప్పవలెను give my respects to the clerks and kind regard to the farmers; (as in English give my love to, &c.) ప్రియకము priya-kamu. n. A tree called Nauclea cadamba. కదంబవృక్షము. ప్రియత priyata. n. Friendship, love, స్నేహము, ప్రేమ. ప్రియపడు or ప్రియంపడు priya-paḍu. v. n. To like, to be pleased. ఇష్టపడు. ప్రియవాది or ప్రియంపదుడు priya-vādi. n. A fair speaker, one who speaks what is pleasing, a flatterer. హితమును చెప్పేవాడు, ఇచ్చకము లాడువాడు. ప్రియాళువు priyāḷuvu. n. A tree called మొరలిచెట్టు. ప్రియుడు priyuḍu. n. A lover, a husband, a friend. ఇష్టమైనవాడు, పెనిమిటి. ప్రియ priya. n. A beloved woman. ప్రియురాలు.
మిత్రము
(p. 986) mitramu mitramu. [Skt.] n. A friend, స్నేహితుడు మిత్రుడు mitruḍu. n. A friend. ఆప్తుడు. The sun, సూర్యుడు. మిత్రత్వము mitra-tvamu. n. Friendship. మిత్తభేదము. a breach of friendship. మిత్రలాభము the making of friends. అమిత్రుడు lit. not a friend. i.e., an enemy.
వలయు
(p. 1139) valayu valayu. [Tel.] v. n. To be liked, desired or wanted. ఇష్టమగు, విహితమగు. To be needful, or necessary, ఆవశ్యకమగు. To be proper, యుక్తమగు. To be surrounded, వలయతమగు. 'మృగమువలయంబారెన్.' పంచ. నా. ii. 'స్వబుద్ధిరాజుకు విశేషింపవలయు' (P. i. 391.) the use of his own judgment is much needed in a king. 'కయ్యమునకు నెయ్యమునకు వియ్యమునకు సమతవలయు.' (ib. ii. 47.) in combat, in inter-marriage, and in friendship equality is wanted; or, there should be a similarity. 'ఔగాములరయవలయు.' (ib. iv. 431.) you should look to the chances of gain or loss, of success or failure. వలె, వలెను, వలసినది or వలయును are added as auxiliaries, to the Root in the Infinitive of any verb; to give the idea of obligation or necessity; నేను ఇమటికి పోవలెను I must go home. నీవు ఇక్కడికి రావలెను you must come here, you should come here, I hope you will come here. తమదయ రావలెను మా దరిద్రము తీరవలెను I hope your favour will come and that my poverty will be removed. ఆయన రేపో ఎల్లుండో రావలెను he must be here tomorrow or the next day, i.e., we expect him here tomorrow or the next day. వాడు దానితమ్ముడుగా ఉండవలెను I suppose he must be her brother. నాకు ఆ పుస్తకము కావలెను I want that book. వాణ్ని చంపియుండవలెను they must have killed him. నీకు అట్లురావలెను this serves you right. నీవు సందేహింపవలసినదిలేదు you need not doubt it, there is no occasion to doubt it. వాణ్ని పిలువవలెనని అక్కడికి వెళ్లితిని I went there to call him. ఈ పని చేయవలెనని పోవుచుండగా as I was going there to do this. జగడమాడవలెనని వస్తివా did you come on purpose (or wanting) to quarrel? వలసి (the past p|| of వలయు.) ఇవ్వవలసి యిస్తిని I paid it, because I had to. 'నిశాచరునుద్యోగంబుచూచుకొనవలసి.' Swa. iv. 163. అట్లు చేయవలసివచ్చును it will become necessary to do so. వలసిన (past part of వలయు) is used as an affix (similar to the Latin-ibilis or endus). చెల్లింపవలసిన సొమ్ము money due, the sum payable. 'వ;సినసంపదల్ గలుగవా.' T. ii. 34. టీ వలసిన, కావలసినటువంటి. వలసె or వలసెను (the past tense of వలయు) it became necessary, or requisite. వానితో చెప్పవలసె I was obliged to tell him. 'వినిపింపరాని కార్యము వినిపింపగవలసె.' Swa. iv. 176. The negative aorist of this, వలవదు, వలదు, See under వలదు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83623
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79462
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63506
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57667
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39146
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38211
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28167

Please like, if you love this website
close