Telugu to English Dictionary: imputed

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆరోపించు
(p. 122) ārōpiñcu ārōpinṭsu. [Skt.] v. t. To impute. లేనిదిమోపు. Imputing. ఆరోపణము. గుణారోపణము attributing any quality. ఇది నీ మీద ఆరోపింపబడినది this is attributed to you. ఆరోపితము āropitamu. adj. That which is imputed.
ఒచ్చెము
(p. 207) occemu och-chemu. [Tel.] n. A defect, a flaw. Fault. An imputation కొరత, న్యూనత, లోపము, అవమానము. disgrace, నింద. ఒచ్చెము లేనికూరిమి love without a flaw. 'మచ్చరముననొకరునుకొన నొచ్చెమునాయందుగలదె.' Radha. i. 50.
కట్టు
(p. 231) kaṭṭu kaṭṭu. [Tel.] v. a. To tie, bind. బంధించు. To wear, as clothes. ధరించు. To connect, affix, attach. To store up, to lay by. కూడబెట్టు. 'క మున్ కట్టిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండ నేర్తురెపమనుజుల్.' భార. అది. v. To build, erect, నిర్మించు. To fascinate, charm, bewitch. To fabricate, compose, or put a story together. కల్పించు. కట్టుకథ a mere fiction or fable. To impute a sin or offence. దానికి రంకుకట్టిరి they charged her with adultery. తప్పుకట్టు to find fault with, to lay blame on నేరము మోపు. నడుముకట్టు to gird up the loins or be prepared. కనుకట్టువిద్య jugglery, legerdemain. తోటకు నీళ్లుకట్టు to water a garden. గాయముకట్టు to dress a wound. బండికట్టు to get ready a carriage. కత్తికట్టు to put on one's sword or arm oneself. రూకలుకట్టు to pay money. మగ్గములకు పన్ను కట్టినారు they fixed a tax on looms. నిలువకట్టు to strike a balance. ధరకట్టు to set a price. పద్యముకట్టు to compose a verse. ఓడకు చాపకట్టు to set sail. వాకట్టు strike dumb by spells, &c. ఈ మాటను కట్టివిడిచినారు they fabricated this story or scandal. దోవకట్టు to stop up the road. దోవకట్టి దోచినారు they lay in ambuscade and plundered the way farers. కడుపుకట్టు to restrain the appetite. కట్టని (neg. p) Unbuilt or unbound. కట్టని కల్లుకోట a rock fortress not built with hands. కట్టనిగూడు (P. i. 545.) a natural nest, not constructed.
ఘటిల్లు
(p. 399) ghaṭillu ghaṭillu. [Skt.] v. n. To befall, to occur, to happen, to come to pass, to be obtained, be laid, attributed or imputed (as blame) కలుగు. అప్పుడు ఘటిల్లక not being then possible or attainable. ఘటిల్లజేయు ghaṭilla-jēyu. v. a. To effect, accomplish, do, manage.
దిసంతు
(p. 596) disantu disantu. [Tel.] n. Reproach, blame, shame, imputation. దూరుట. దిసంతుకొట్టు or దిసంతడుచు to revile. నిందించు, దూరు. 'చెలినొంచితనిదిసంతులు కొట్టెమేనక.' Swa. iii. 143.
నిర్వాడము
(p. 660) nirvāḍamu nir-vādamu. [Skt.] n. Censure, blame, imputation. నింద. A decision.
నెపము
(p. 676) nepamu or నెపము nepamu. [Tel.] n. Blame; an imputation, charge, accusation, aspersion. నింద, తప్పు. A pretext, pretence, excuse, మిష, వ్యాజము. A cause, కారణము.
పెట్టు
(p. 787) peṭṭu peṭṭu. [Tel.] v. n. To happen. కలుగు. ఉ. హరి. v. a. To put, place. ఉంచు. To lay (eggs), to bring forth (young), కను. To wear, ధరించు. To give, ఇచ్చు. To impute a blame, a crime, &c. మోపు. To raise a wall, కట్టు. To plant, నాటు. To beat, కొట్టు. n. A blow, a thump. దెబ్బ. Bestowal, charity, giving. ఈవి. A time, మారు, తడవ, ఆవృత్తి. When the verb పెట్టు is added to certain verbs like విడుచు, it means Altogether. బొత్తిగా విడిచిపెట్టు to give up entirely. This verb has numerous senses peculiar to certain nouns under which it will be found. పిల్లలుపెట్టు to bear young ones. గుడ్లుపెట్టు to lay eggs. ఆశపెట్టు to tive hopes, tantalise. ఆ తప్పును వానిమీద పెట్టిరి they laid the fault on him. ఆమెకు నూరు రూపాయిల సొమ్ము పెట్టినాడు he gave her a hundred rupees worth of jewels. అన్నముపెట్టు to serve or help food at dinner. కావలిపెట్టు to put a guard over. అపరాధముపెట్టు to pay a fine. నైవేద్యము పెట్టు to offer an oblation. బొబ్బలుపెట్టు to yell. బాధపెట్టు to torture. కనిపెట్టు to watch, to find out, to wait. చెట్లుపెట్టు to plant trees. అట్లు చెయవద్దని నాకు ఒట్లు పెట్టినాడు he adjured me not to do so. పాళ్లుపెట్టు to divide or separate into shares. గురిపెట్టు to take aim. కఠిన పథ్యము పెట్టినాడు he put him on strict diet. అంగడి or దుకాణముపెట్టు to open a shop. ఈ మాటను అంగడిలో పెట్టవద్దు do not talk of this publicity. గోడపెట్టు to build a wall. It is also added to many verbs sometimes without altering the meaning. Thus, చేర్చిపెట్టు or కూడబెట్టు to accumulate store up. పరుండబెట్టు to put to bed. దాచిపెట్టు to conceal or hide. 'ఎవ్వనియింటికి నేడు వారాసులు పెట్టనికోటయై పెరుగుచుండు' Molla. v. 48. దానిని ఒకపెట్టు పెట్టినాడు he gave her a slap. గోడపెట్టు చెంపపెట్టు రెండును వచ్చినవి his luck was bad in both ways. పెట్టుపోతలు శాశ్వతములుకావు meat and drink are momentary matters. మాటలు మా అమ్మవి, పెట్టుసవతితల్లిది the words are those of a mother, but the acts are those of a step-mother. నాల్గుపెట్లు four times. ఒకపెట్టున all at once, simultaneously. పెట్టించు peṭṭinṭsu. v. a. To have it placed or put, &c. మరొకరు ఉంచునట్లు చేయు. నాకు అన్నము పెట్టించినాడు he had food given me. పెట్టుకొను peṭṭu-konu. v. a. To keep, or put, for one's own advantage or use, ఉంచుకొను. కొడుకునకు తన తండ్రిపేరు పెట్టుకొన్నాడు he gave the boy his father's name. ఏముఖము పెట్టుకొని మాట్లాడును has he the face to speak? పెట్టుకోలు peṭṭu-kōlu. n. The act of keeping, పెట్టుకొనుట. పెట్టుచెట్టు peṭṭu-cheṭṭu. n. An epithet of the కల్పవృక్షము. పెట్టుడు peṭṭuḍu. n. Giving, charity, ఈవి, త్యాగము, దానము. పెట్టుబడి peṭṭu-baḍi. n. Money advanced or laid out. An outlay. పెట్టుమండు peṭṭu-mandu. n. A medicine given to acquire complete influence over another, తనకు లోబడియుండుటకుగాను పెట్టేమందు, వశ్యౌషధము. పెట్టుపడు peṭṭu-paḍu. v. n. To receive a blow, to be beaten, దెబ్బతిను.
పొదవెట్టు
(p. 808) podaveṭṭu poda-veṭṭu. [Tel.] v. a. To hint, సూచించు. To impute, attribute, ఆరోపించు.
మోపు
(p. 1046) mōpu mōpu. [Tel. from మోయు.] v. a. To load, place a burden on (another,) మోయుజేయు. To lay (a fault) upon (a person.) To impute, or charge (against another,) ఆరోపించు. To prop up, ఆనించు. చేతులునేలమోపెను he laid or rested his hands on the ground. 'నారిచేసినతప్పు నామీద మోపి.' Sār. D. 545. 'వాడిసూది మోపినయంతటి భూమి ధర్మనందనునకునీక' as much land as the point of a sharp needle can cover, or rest on. Kanyaka Puran. vii. 116. n. A bundle, load, burden. గడ్డిమొదలైనవాటికట్ట, భారము. A bowstring. వింటినారి. adj. Much, heavy, అధికము. ఉత్తరమున వాన నిండామోపుగానున్నది there is rain impending in the north. దెబ్బలు మోపుగాపడినవి the blows fell thick. మోపుగానుండే గాయము a severe wound. 'నగరోపకంఠంబునను మోపువైచి.' B. P. v. 113 మోవరి or మోపుకాడు mōp-ari. n. A sustainer, a supporter, one who props. మూయువాడు, భావవాహకుడు.మోపాది mōpādi. (మోపు + అది.) n. Danger, risk అపాయము, సంకటము. మోపి mōpi. A widow, విధవ, ముండమోపి. ముండమోసినది she wears a shaven pate. మోపించు mōpinṭsu. v. a. (Causal of మోయు.) To cause to bear a burden. To impose. మోయునట్టుచేయు, నిందపెట్టు. ఆ కట్టెలను వానిచేత మోపించిరి they made him carry the fagots of wood. ఆ తప్పును వానిమీద మోపించిరి they caused the fault to be laid upon him. 'మోపరికగుతగ్గు మొగ్గులభరము, మోపించుకొనునట్టి ముగ్ధునికగునె.' BD. page 129. మోపిక mōpika. n. Weight, భారము. Help, aid. కాండ్లమోపికచేసి by the help of the plough. మోపిడు mōp-iḍu. (మోపు + ఇడు.) v. a. To string a bow, విల్లు ఎక్కిడు. మోపుకొను mōpu-konu. v. a. To take upon one's-self. మోపుదల mōpu-dala. n. A charge or accusation. ఆరోపణము. A load, భారము. ఈనమోపుదలగానుండే ఆవు a cow on the point of calving. ఇవ్వ మోపుదలయైన రూకలు money still due, బాకీ ఉన్న సొమ్ము. చాలా మోపుదలగా చెప్పెను he spoke very impressively. వానిమీద నేరము మోపుదల అయినది he was charged with the offence. మోపుదలచేయు mōpudala-chēyu. v. a. To lay, charge, to bring as a charge, impose, ఆ రూకలను నేను ఇచ్చేటట్టు మోపుదలచేసిరి they made the money payable by me. మోపెట్టు mōp-eṭṭu. (మోపు + పెట్టు.) v. a. To place a weight upon, బరువుపెట్టు. ఆ కాగితనములపైని ఈరాయి మోపెట్టు put this weight on those papers. To brace a bow, విల్లు ఎక్కుపెట్టు. 'అర్జునుడు గాండీవంబు మోపెట్టె.' M. v. i. 261.
రోపణము
(p. 1091) rōpaṇamu or రోపము rōpaṇamu. [Skt.] n. Putting on as a load or weight. imputing. మోపుట. రోపము rōpamu. n. An arrow, బాణము. రోపితము rōpitamu. adj. Placed in or upon. ఉంచబడిన.
సొడ్డు
(p. 1356) soḍḍu soḍḍu. [from Skt. శౌణ్ఠ్యమ్.] n. A slap on the head of a loser in a game, applied with both the winner's hands. (Metaphorically,) a defect, fault, imputation, ఆటలో నోడినవాని తలమీదవేయు దెబ్బ, లోపము, న్యునత, కొరత, సొడ్డువేయు to give such a slap with the open hand, to dupe or to make a fool of. 'సోమయాజినిబట్టి సొడ్లవ్రేసెనురంభ.' Vema. 903. 'నిఖిలదేవతలకు నెమకెవేమనసొడ్డు.' ib. 2139. అతడు చేసిన పనిలో నొక సొడ్డుగలదా is there any defect in the work he has done? సొడ్లమర or చొట్లమర soḍla-mara. n. The fish called the Angel shark, Squatina. మత్స్యవిశేషము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close