Telugu to English Dictionary: mogali

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

తిరుగు
(p. 531) tirugu tirugu. [Tel.] v. n. To turn, rove, roam, travel. సంచరించు To be giddy. పరిభ్రమించు. To go back. వెనుకకుమరలు. To come again. మరలవచ్చు. To cease, go off, as, disease, be revoked, as an order. To fail, miss, be fruitless, to break one's faith. అతడు ఈ పనిలో తిరిగినాడు he was engaged in this business. వానికి ఒళ్లు తిరిగినది he felt giddy, he was sick, or vomited. మధ్యతిరుగు to intercede, act between others, be an agent. వానికి నోరు బాగా తిరగదు he does not pronounce well. ఆ మాట నా నోట్లో తిరగదు. I cannot pronounce that word. కావలితిరుగు to stand sentry. తిరగదీయు to tamper with or corrupt a witness తమ మాటకు తిరుగులేదు you are supreme: your word is law. హుండి తిరిగిపోయినది the bill was dishonoured. చుక్కలు తిరిగినది the stars have turned, i.e., it is past midnight. తిరుగాణి (తిరుగు+ఆణి.) a screw. సందుల తిరిగిరి they went round by the alleys. తిరుగు v. a. To go round, encircle. సరివేష్టించు. తిరుగు or తిరుగుడు tirugu. n. A turning, a turning back, తిరుగుట, భ్రమణము. A change మారుపాటు. A screw, a rivet, a carpenter's vice. మర. A bend or turn (as in a road.) The point on which an affair turns. తిరుగుడుబండి a return cart. లెక్కలో తిరుగుడు వచ్చినది or తిరుగుళ్లుపడినవి there is a difficulty, a question, a point to be cleared. తిరుగుడుచీల or తిరుగుడునొక్కు a screw, మర. తిరుగుడు పువ్వు tiruguḍu-puvvu. n. The turning flower, i.e., the sun flower. A sort of gold jewel worn by women. తిరుగుడుత్రాడు a noose, ఉరి, ఉచ్చు. తిరుగుదల tirugudala. n. A turn. మరలుట. వ్యాధి తిరుగుదలగా నున్నది the disease is on the turn. తిరుగుడుపడు to turn, to be giddy పరిభ్రమించు. తిరుగుడుపాటు tiruguḍu-pāṭu. n. Rebellion, resistance. తిరుగబడు or తిరగబడు tiruga-baḍu. v. t. To turn against, to rebel against, to oppose, to attack angrily. తిరగబాటు or తిరుగబాటు tiraga-bāṭu. n. Disobedience, rebellion, turning against. తిరగబోయు or తిరుగబోయు tiraga-bōyu. v. a. To spice, or season (a curry.) తిరగబోత or తిరుగబోత tiraga. n. Seasoning, putting spice, &c., to food. తిరగవేయు or తిరుగవేయు tiraga-vēyu v. a. To turn a thing over. తిరుగ or తిరుగా tiruga. adv. Again. తిరుగడ tirugaḍa. (తిరుగు+గడ.) n. A pipe which is turned by a screw. మరపెట్టినగొట్టము. తిరుగలి or తిరగలి tirugali. (తిరుగు+కల్లు.) n. A hand mill. (or తిరుగు+కలి.) Turning భ్రమము. తిరుగుబోతు tirugu-bōtu. n. A rambler, rover, giddy fool. తిరుగుమొరుగు or తిరుగుమరుపు tirugu-morugu. n. An intricacy, refinement. Ila. iii. 16. తిరుగుమొగము tirugu-mogamu. n. Turning away the face. విముఖము. తిరుగుపారు tirugu-pāru. v. t. To surround. పరివేష్టించు.
దిక్కు
(p. 591) dikku dikku. [Skt.] n. A quarter, part, side, direction. దిశ. An airt or point of the compass. The ten directions named in Hindu books are the four points. N. E. S. W. and the intermediate four: N.-E. (ఈశాన్యమూల) S.-E. (ఆగ్నేయమూల) S.-W. (నైరృతిమూల,) N.-W. (వాయవ్యమూల) to which are added the Zenith and Nadir. దిక్కులుమ్రోయగా while the heavens resounded. Quarter, shelter, asylum, refuge, protection, patronage, శరణము. దిక్కులేని, దిక్కుమాలిన or దిక్కేదిన helpless, resourceless, devoid of any protector; also vile, abominable. దిక్కుగలచోటు a refuge. దిగ్విమల స్వరూపుడై the loveliest in the world. దిక్పతి or దిక్పాలుడు dik-pati. n. A demigod who rules one airt or point of the compass; the regent or genius that governs that quarter. ఈశానాదిదిక్పాలురు the genii of the north-east and other directions దిక్కమొగములు or దిక్కామొగములు dikka-mogamulu. [from దిక్కు+ముఖము.] n. Faces turned in every direction. People that flee in all directions through fear, భయముచేత దిక్కున కొక్కరుగా పోయినవారు. దిక్కా మొగముగా timidly, భీతిచే బెదరియుండినట్లుగా. దిక్కరి dik-kari. (దిక్+కరి.) n. One of the mythica, elephants that support the corners of the world. దిగంతము dig-antamu. (దిక్+అంతము.) n. An end of the earth. దిగంతఖ్యాతి world wide fame. దిగంబరుడు dig-ambaruḍu. (దిక్+అంబరుడు.) adj. Lit. 'Sky vested,' having the air as a robe. Naked, stark-naked, undraped. దిసమొలవాడు. n. An epithet of Siva. దిగంబరురాలు she who is naked. దిగ్గజము dig-gajamu. n. One of the eight elephants (గజ) the guard the cardinal points (దిక్కులు) of the world. A poetical phrase answering to the poles of heaven. దిగ్గజములుమ్రోయ making the welkin ring. కవిదిగ్గజము a leading or classical author. దిగ్బంధము dig-bandhamu. n. A magic rite, restraining by spells the influence of certain stars. cf. Job. XXXVIII. 31. దిగ్భ్రమము dig-bhramamu. n. Giddiness, stupor, amazement. దిక్కులతబ్బిబ్బు, భ్రమము. దిగ్బ్రమితాత్ముడై bewildered, horrified, amazed. దిగ్గిజయము dig-vijayamu. n. Dominion, empire. Universal conquest. A royal progress or tour. దిగ్మండలము or దిగ్మండలి dig-mandalamu. n. The horizon.
దిచ్చుమొగము
(p. 593) diccumogamu diṭsṭsu-mogamu. [Tel.] adj. Disappeared, vanished. అదృశ్యము. n. Disappearance, vanishing. అదృశ్యము. దిచ్చుమొగమగు to disappear, vanish.
నిర్
(p. 657) nir nir. A Sanskrit particle prefixed in words of that language and implying negation, privation, &c. This prefix varies in accordance with the rules of Sanskrit sandhi. In some cases it becomes నిష్ as నిష్ఫలమైన fruitless. When attached to a word which begins with S, it becomes నిస్, as నిస్సందేహముగా doubtlessly. When it is followed by a vowel, it remains unaltered as నిరాటంకముగా unchecked. The compounds in which this prefix is used are here put together. నిరంకుశము nir-ankuṣamu. adj. Unrestrained, free, uncontrolled, resistless. అడ్డములేని. నిరంజనము nir-anjanamu. adj. Free, void of passion or emotion, stainless. నిర్దోషమైన. నిరంతరము nir-antaramu. adj. Continued, continuous, without interval. Interminable, endless. ఎడతెగని, దట్టము. adv. Always, constantly, frequently, generally. నిరపరాధుడు nir-aparādhamu. adi. Blameless, innocent, harmless. నిరపరాధి or నిరనరాధుడు nir-aparādhi n. One who is innocent. నిరపాయము nir-apāyamu. adj. Harmless, అపాయములేని. నిరపేక్షము ṇir-apēkshamu. adj. Undesired, అపేక్షలేని. నిరర్గళము nir-argalamu. adj. Unobstructed, unrestrained, unimpeded. Resistless. అడ్డములేని, నిరర్థకము nir-arthakamu. adj. Vain, fruitless, improfitable, unmeaning. ప్రయోజనములేని. నిరవగ్రహుడు nir-avagrahuḍu. n. One who is unimpeded, independent. అడ్డపాటులేనివాడు, స్వతంత్రుడు. నిరవద్యము nir-avadyamu. adj. Unobjectionable, unexceptionable. నిర్నిరోధకమైన. Vasu. ii. 99. నిరవధికము nir-avadhikamu. adj. Unlimited. మేరలేని. నిరహంకారము nir-ahankāramu. n. Humility, modesty. నిరాకరించు nir-ākarinṭsu. v. a. To transgress, disobey, disregard, neglect, contemn, తిరస్కరించు. నిరాకారము or నిరాకృతి nir-ākāramu. n. Disregard. తిరస్కారము. What is viewless or invisible. The sky, ఆకాశము. adj. Viewless, shapeless, invisible. నిరాకారుడు nir-ākāruḍu. n. One who is without form, the Deity. పరమాత్ముడు. నిరాకృతము nir-ākṛitamu. adj. Removed, rejected, despised, expelled, disregarded. నిరాక్షేపముగా nir-ākshēpamu-gā. adj. Unquestionably, without objection. నిరాఘాటము nir-āghāṭamu. adj. Irresistible, మీరరాని. Easy, unobstructed, without hesitation. నిరాంతకముగా nir-ātankamu-ga. adj. Without scruple or fear, నిర్భయముగా, నిశ్శంకముగా. నిరాదరణ nir-ādaraṇa. n. Helplessness. Disregard. నిరాధారము nir-ādhāramu. adj. Groundless, helpless. నిరాపనింద nir-āpa-ninda. n. Blame, censure, అపదూరు. నిరాబారి nirābāri. n. A saint, sage. ముని. Nila. i. 29. నిరామయము nir-āmayamu. adj. Well, hale, recovered from sickness, free from disease. నిరామయుడు nir-āmayuḍu. n. One who is free from disease. నిరాయాసముగా nir-āyāsamu-gā. adv. Easily, without difficulty. నిరాయుధహస్తుడు nir-āyudha-hastuḍu. adj. Unarmed. నిరాలంబము ṇir-alambamu. n. Independent, అవలంబములేని. నిరాశ nir-āṣa. n. Despair, despondency. ఆసలేమి. నిరాశ్రయుడు nir-āṣrayuḍu. adj. Unprotected, unpatronaized, helpless. అశ్రయములేని. నిరాశకము nirāsakamu. adj. Opposing, rejecting, expelling. Antagonistic, as the potency of medicine. n. A specific, or panacea. నిరసించునది. నిరాస్పదము nir-āspadamu. adj. Groundless. నిరాహారము nir-āhāramu. adj. Fasting. ఆహారము లేని. నిరాళుడు nir-āḷuḍu. n. One who is unrestrained, ప్రతిబంధకము లేనివాడు 'నిన్నొరు లెరుగంగరామి నిశ్చయము, నిరాళుండ వీవు.' L. ii. 210. నిరుద్యోగము nir-udyōgamu. n. Unemployedness: the being in a state of idleness. adj. Passive, inert, unengaged, at leisure. నిరుద్యోగి nir-udyōgi. n. One who is umemployed. నిరుపద్రవము nir-upadravamu. adj. Harmless. ఉపద్రవములేని. నిరుపమానము nir-upamānamu. adj. Incomparable, matchless, సాటిలేని. నిరపహతి nir-upahati. adj. Undisturbed, untroubled, unchecked. నిరుపాధి nir-upādhi. n. Ease, freedom from pain. నిరుపాధికము nir-upādhikamu. adj. Causeless, నిర్హేతుకమైన. నిర్గుణము nir-guṇamu. adj. Indescribable. incomprehensible. Devoid of quality or definable attribute. నిర్గుణుడు nir-guṇuḍu. n. One (the Deity) who is devoid of properties or qualities. The Indescribable One. నిర్ఘటము nir-ghaṭamu. n. A crowded bazaar or shop, బహుజనసమ్మర్ధము గల అంగడి. నిర్జనము nir-janamu. adj. Devoid of human beings, lonely, private, solitary, జనములేని. నిర్జరుడు nir-jaruḍu. n. One who is not subject to decrepitude. An immortal or god. నిర్జరసతి a goddess. నిర్జలము nir-jalamu. adj. Waterless, జలములేని. నిర్దయత nir-dayata. n. Unkindness, దయలేమి. నిర్దయుడు or నిర్దయాత్మకుడు nir-dayuḍu. n. An unkind man, దయలేనివాడు నిర్దోషము nir-dōshamu. adj. Faultless, innocent దోషములేని. నిర్దోషులు the innocent. నిర్దోషముగా nir-dōshamu-gā. adv. Faultlessly, innocently. నిర్దోషత్వము nir-dōshatvamu. n. Innocence, faultlessness. నిర్ధనుడు nir-dhanuḍu. n. One who has no money, a poor man, ధనములేనివాడు. నిర్ధూమధామము nir-dhūmadhāmamu. n. Utter destruction: utter ruin and ashes. 'మీరు తొక్కిన చోటు నిర్ధూమధామంబు.' Dab. 232. నిర్నిద్రము nir-nidramu. adj. Sleepless, awake. నిర్నిమిత్తము nir-ni-mittamu. adj. Needless, causeless. నిర్నీతి nir-nīti. n. Immorality. నిర్భయము nir-bhayamu. adj. Fearless. నిర్భయతన్ fearlessly. నిర్భరము nir-bharamu. adj. Unbearable, సహింపగూడని. Much, excessive, great, అధికము. నిర్భాగ్యుడు nir-bhāgyuḍu. n. One who is luckless, unlucky, or cursed భాగ్యములేని వాడు, దరిద్రుడు. నిర్భీతి nir-bhīti. n. Fearlessness. నిర్మత్సర nir-mastsara. adj. Tolerant, free from jealousy. నిర్మర్యాద nir-maryāda. n. Dishonour, an insult, impudence. నిర్మలము nir-malamu. adj. Pure, transparent, clear, clean, free from dirt or impurities. నిర్మలుడు nir-maluḍu. n. One who is pure: a good man. నిర్మోగమోటము nir-moga-mōṭamu. n. Unkindness. నిర్దాక్షిణ్యము. నిర్ముక్తము nir-muktamu. adj. Loosed, set free from, disjoined, sundered, separated. n. A snake that has lately cast its skin. నిర్ముక్తపరిధానయై dropping her petticoat. నిర్ముక్తుడు nir-muktuḍu. n. An ascetic, a monk. సన్యాసి. నిర్మోకము nir-mōkamu. n. A snake's skin. కుబుసము నిర్మూలము or నిర్మూలనము nir-mūlamu. n. Extirpation, eradication, utter ruin నిర్మూలమైన ruined. నిర్మూలించు nir-mūlinṭsu. v. a. To eradicate, నిర్మూలముచేయు. వేరులేకపోవునట్లు చేయు. To ruin, నాశముచేయు. నిర్లజ్జము nir-lajjamu. adj. Shameless. సిగ్గులేని. నిర్లేపుడు nir-lēpuḍu. n. Devoid of pride. నిరహంకారి. నిర్వంశుడు nir-vamṣuḍu. n. One who is childless, barren. నిర్వచనీయము nir-vachanīyamu. adj. Inexpressible, undefinable. నిర్వాతము nir-vātamu. adj. Windless or close, as a place. గాలిలేని (చోటు.) నిర్వికారము nir-vikāramu. adj., Unchanged, unaltered, uniform, changeless, immutable. వికారము లేని. నిర్వికారుడై or నిర్వికారచిత్తుడై stead fastly. నిర్విఘ్నము nir-vighnamu. adj. Unobstructed. నిఘ్నములేని. నిర్విణ్ణుడు nir-viṇṇuḍu. adj. Earnest, absorbed, overcome, enrapt. విన్నదనములేని (వాడు.) నిర్వివాదము nir-vivādamu. adj. Undisputed, unquestioned. వాదములేని, నిశ్చయమైన నిర్విషము nir-vishamu. adj. Venomless, నిషములేని. నిర్వైరము without enmity, వైరములేని, నిర్వ్యాజము nir-vyājamu. adj. Without deceit: without obstruction. Honest. నెపములేని, నిర్గేతుకముగా nir-hētukamu-gā. adv. Without cause, causelessly.
నెర
(p. 678) nera , నెరవు, నెరా or నేరా nera. [Tel.] adj. Full. నిండైన. Fine, grand, excellent; great, large, big. నెరమంట a great flame or a great pain. 'పౌరజన కోలాహలంబుతో జంటయై మింటికెగయు నెరమంట గనుంగొని.' S. iii. 269. నెరగొయ్యి a large gully. నెరమాటలు queer speech. 'నెరమాటలు కోడిగములు నరమాటలు జాణతనము.' H. v. 86. నెరకాడు nera-kāḍu. (నెరవు+కాడు.) n. A perfect man. పూర్ణుడు. నెరక neraka. n. A hair. వెంట్రుక. 'నెరకలు తాకినయమ్ముల జొరజొర నెత్తురులువడియ.' Hari vamsa. ii. 192. నెరకొను nera-konu. v. n. To fill, నిండుకొను. 'తమమను కాలాహిప్రపంచము నెరకొని.' Swa. v. 43. నెరడు neraḍu. adj. Rough. గొగ్గి, విషయము. ఆ నేల నెరడుగా నున్నది that ground is rough or uneven. నెరతనము nera-tanamu. n. Respectability 'విజయవివేకశీలతలచే ననుకూలమును నెరతనము నేర్చి.' V. P. ii. 245. నెన్నడుము nen-naḍumu. n. A slender waist. నెన్నుడురు or నెన్నొసలు nen-nuduru. n. The forehead. నెమ్మనము nem-manamu. (నెర+మనము.) n. The heart. నెమ్మొగము or నెమ్మోము nem-mogamu. (నెర+మొగము.) n. A fair face. నెరయు or నెరియు nerayu. v. n. To fill, నిండు. To be fulfilled, నెరవేరు. To become grey, తెల్లనగు. To extend, grow, swell, వ్యాపించు. To shine, ప్రకాశించు. 'సీ కాటుక నెరయంగ కన్నులునలుపుచు.' B. X. §9. 16. నెరయ neraya. adv. Fully, much, greatly. గొప్పగా నెరపు or నెరువు nerapu. v. a. To fill. నించు To fulfil, నెరవేర్చు. To spread, extend, పరచు. To make, చేయు To enlighten, ప్రకాశింపజేయు. 'మధుర భాషల హరిమిద మైత్రినెరపి.' B. viii. 438. adj. Much, great, అధికము. n. The act of spreading. వ్యాపనము. Greyness of hair. నెరయుట. నెరయిక nerayika. n. Filling, నిండుట. Spreading, వ్యాపించుట. The act of turning grey, as hair, తెలుపగుట. నెరపంది or నెరవెంద nera-vanji. n. A kind of plant. అలక్ష్య. వెరవడి or వెరవణి nera-vaḍi. n. Ful speed. A scrawl or device. నెరవడిగా వ్రాసినాడు he scrawled or flourished in writing. Wit, skill. నెరవాది nera-vādi. n. A skilful, or clever man, సమర్థుడు, నేర్పరి. P. iii. 205. నెరవాదితనము skilfulness. నెరవిద్దె or నెరవిద్య nera-vidde. n. Conjuring, sleight of hand. హస్తలాఘవము, జాలవిద్య. Foppery, conceit. నెరవు neravu. n. Fulness. పుర్తి. Spreading, వ్యాపనము. A way, మార్గము. Understanding, తెలివి. A contrivance. ఉపాయము. The name of a certain tree. 'నెరవుగలుగువారు నెరుపుగలవారు, విద్యచేత విర్రవీగువారు పసిడి గలుగువారి బానిస కొడుకులో.' Vēma. 140. నెరవుగలుగువారు, ఉపాయశాలులు. adj. Full. పూర్ణము. Much, great, అధికము. Proper, యుక్తము. Broad, spacious, విశాలము. Spreading, spread, వ్యాపకము, వ్యాప్తము. నెరవేరు nerar-ēru. [From నెరవు much, and ఏరు.] v. n. To be fulfilled, to prosper, thrive, succeed, నెరవేరిన mature. నెరవేర్చు nerav-ērṭsu. v. a. To accomplish, effect, manage, discharge. నెరయ neraya. adv. Entirely, vastly, extremely. In the least, at all. ముగుల, బొత్తిగా.
మారు
(p. 978) māru māru. [Tel.] v. n. To be changed. మారుపడు. To be transmuted, altered. వ్యత్యయమగు, ఒకటిమరియొకటియగు. ఆరూకలు మారవు that money will not pass. To be ruined, నశించు. n. Opposition, ఎదురు. A time, తడవ, ఆవృతి. ఒకమారు once. ఈమారు this once, or this time. రెండుమార్లు twice. ముమ్మారు thrice. పలుమారు many times. Buttermilk, మజ్జిగ. A course or remove at dinner, రెండవతూరి పెట్టదగిన భోజ్యపదార్థము. మారు. adj. Other, మరియొక. అన్యము. Opposite, opposed, ఎదురైన, ప్రతి. Turned, averted, పెడ. Replying, answering. మారు మనిషి a substitute. మారుమాటు a reply. మారతాళము a false key. మారుమొగము an averted countenance. మారుమూల a bye-place. మారుకొను or మార్కొను māru-konu. v. a. To attack, front, face. ఎదురుకొను. To oppose, to be adverse to. ఎదిరించు. మారుగా māru-gā. adv. Instead of, in lieu of, ప్రత్యామ్నాయముగా. నాకు మారుగా పోయినాడు he went in my place, instead of me. మారుచు or మార్చు māruṭsu. v. a. To change, మారజేయు. మార్పు. మారుపు, మారుదల or మారుపాటు mārpu. n. Changing, మారుట. మార్పు mārpu. n. Exchange, change. A kind of fish. కుండమార్పిళ్లు కూడదు or కుండమార్పులుకూడదు marrying a man's son and daughter with another man's daughter and son, is wrong. మారుతల్లి. మారుడు తల్లి or మారటతల్లి māru-talli. n. A step-mother. సవతితల్లి. మారుతాళము māru-tāḷamu. n. A picklock, a false key. దొంగ బీగము చెవి. మారుతుడు or మార్తుడు māru-tuḍu. n. An enemy plu. మారుతురు enemies, శత్రువులు. మారుపడు māru-paḍu. v. n. To be changed or exchanged. భేదపడు. To disappear, vanish, అదృశ్యమగు. మారుపు mārupu. n. A kind of fish. Russell. 168. 'మారుపులను జరువారికిచ్చె.' G. i. 111. మాతుపెట్టు or మార్పెట్టు māru-peṭṭu. v. a. To oppose. ఎదిరించు మారుబేరగాడు māru-bēra-gāḍu. n. A retail dealer. చిల్లర వర్తకుడు. మారుబేరము māru-bēramu. n. Retail trade. చిల్లరవర్తకము. మారుమనువు māru-manuvu. n. A woman's second espousals. ఆడదానికి రెండవ వివాహము. మారుమనువుది a woman who is married a second time, దిధిషువు, రెండవపెండడ్లాడినస్త్రీ. మారుమగడు a woman's unlawful husband, ఉపపతి, మారుమలయు, మార్మలయు, మారుమసలు or మార్మసలు māru-malayu. v. a. To rival, to match. సరిగా ఎదిరించు. 'నూత్నభానురుచికి మారుమలయుచునున్న శమంతకంబు.' Vish. vi. 263. 'తానునందరకును తత్తత్స్వరూపమానవాకృతులతో మారుమలయుచును.' L. xiii. 130. మారుమాట or మార్మాట māru-māṭa. n. An answer, ఎదురుత్తరము, ప్రతివచనము. మారుమొగము or మార్మొగము māru-mogamu. n. An averted face. పెడమొగము. మారుమ్రోత māru-mrota. n. A echo. ప్రతిధ్వని. మారుమూల māru-mūla. n. The opposite side, ఎదురుమూల. An out of the way corner or retired place మారుమ్రోయు māru-mrōyu. v. n. To echo. ప్రతిధ్వనిచేయు. మారురూపు māru-rūpu. n. A new appearance, a change of form. రూపాంతరము, మారిపోయినరూపు. మారొడ్డు mār-oḍḍu. v. a. To oppose, ప్రతిఘటించు మారువర్తకుడు māru-ṿartakuḍu. n. A retail dealer. చిల్లరవర్తకుడు. మారుమెడ or మార్మెడ māru-meḍa. n. A twisted neck. మెలిపడి పోయన కంఠము. A. iii. 23.
మొగ
(p. 1035) moga moga. [from Skt. ముఖము.] n. The tip, point, end; the beginning, మొదలు. The mouth of a river, &c. మొన, నదీ సముద్రాదుల ముఖము. An entrance, ద్వారము. ఆ మొగను at the beginning. A blossom, మొగ్గ. మొగకొను moga-konu. v. n. To begin, commence. మొదలుపెట్టు. To meet, turn the face towards, అభిముఖమగు. 'వినుడీసుఖదుఃఖము లనిత్యములుగాన వాని యాగమకాలంబున ముదము శోకము మొగకొననీయమి యురువుశాంతి గోరుజనులకున్.' M. XII. i. 196. See మొగదల.
మొగ
(p. 1035) moga or మగ moga. [Tel.] adj. Male. పురుష. మొగచెంపలు side locks. మొగతనము moga-tanamu. n. Manhood, virility, పుంస్త్వము. మొగవాడు moga-vāḍu. n. A man, a male, a husband. పురుషుడు.
మొగకట్టు
(p. 1035) mogakaṭṭu moga-kaṭṭu. [Tel.] v. n. To sound. మ్రోగు.
మొగడ
(p. 1035) mogaḍa mogaḍa. [Tel.] n. A bud. A boss or knob on a shield or door. మొగ్గ, గుబక. 'విత్తులేనియట్టి వృక్షమొక్కటి పుట్టె ఫలముపువ్వు మొగడపత్రిలేదు, స్వాదులేదు చూడ సాపాటునకు లెస్స, దీనిభావమేమి తిరుమలేశ.' Tirumalēsa. 'పూమొగడతోతులదూగులతాంగిముక్కు.' R. iv. 60.
మొగడు
(p. 1035) mogaḍu mogaḍu. [Tel.] n. The ridge of a roof, ఇంటినడికొప్పు. plu. మొగళ్లు or మొగడులు and మొగలు. Gen. మొగటి.
మొగడు
(p. 1035) mogaḍu mogaḍu. [Tel.] adj. Stubborn, obstinate. ముష్కరమైన, మొండి. 'అనినచిలుకయు కలికినీవెపుడుమంచి, మొగడు సాహసమెరిగి నీమగడువేగ, నన్నుకనుగీతివచ్చి క్షణంబులోన నీతెగువమాన్పె నేయనగృష్ణుడపుడు.' N. ix. 359.
మొగము
(p. 1036) mogamu or మొకము mogamu. [from Skt. ముఖము.] n. The face. ముఖము. Front, ఎదురు. An entrance, door, ద్వారము. adj. Chief, ముఖ్యము. మొగచాటు moga-ṭsāṭu. n. Surfeit, disgust in eating, ముఖముకొట్టడము. 'తినతినజిహ్వకు తీపైన మొగచాటు, సారెకుబలుకుట చప్పదనము.' Venkatēswara. §. 16. మొగతప్పు or మొగతిరుగు moga-tappu. v. n. To have the face turned away, విముఖమగు. మొగదల mogadala. n. The end or butt (of a wall.) ఎదురు, ముందటిభాగము. మొగవట్ట or మొగముట్టు moga-paṭṭa. n. An ornament for a horse's head something like a cavesson ముఖపట్ట. 'మణులమొగపట్ట పన్నిసాహిణియొకండు.' Swa. iv. 37. మొగపడు moga-paḍu. v. a. To see, చూచు. మొగపాళము or మొగవాళము moga-pāḷamu. n. The front portion of a house, &c. ఇల్లు లోనగు వాని ముందటిభాగము. మొగపిరికి moga-piriki. (మొగము + పిరికి.) n. A tortoise, తాబేలు. మొగముతప్పించు to abscond, disappear. మొగపు mogapu. (మొగ + పూస.) n. The front portion of a necklace, హారాదుల ముఖభాగము. A buckle. కంఠభూషణము యొక్క ముఖభాగము. 'ధాత్రీ మహాదేవి తాల్చిన మున్నీటి మొలమాలిరత్నంపు మొగపనంగ.' Prabhavati Pradyumnam, i. 3. మొగమిచ్చు moga-miṭsṭsu. v. n. To show the face, to favour, to be pleased, సుముఖుడగు. మొగమోటమి, మొగమొటము, మొగమోట or మోగమోటమి mogamōṭami. n. Partiality, pity, compassion, దాక్షిణ్యము. Hesitation, doubt, సంకోచము. మొగమోడు mogam-ōḍu. v. n. To be ashamed. సిగ్గుపడు. 'ముంగిటికే తెంచి మొగమోడనగునె.' Abhim. 47. To be partial, దాక్షిణ్యపడు. To hesitate, సంకోచించు. మొగవాడ moga-vāḍa. n. The front door of a temple. గోపుర ద్వారము. 'అరిమురిమొగవాడ దెరచివీక్షింప.' BD. iv. 661. మొగవీణె moga-vīṇe. n. A kind of వీణె, ముఖవీణె. మొగసరి moga-sari. (మొగము + అరి.) Same as మొగముట్టు (q. v.) మొగసాల, మొగసల or మోసాల moga-sāla. n. An entrance hall. నడవ. ముఖమంటపము, నగరితల వాకిటిచావడి. 'నీ తమ్ముండు పెద్ద మొగసాలం జాలు మానసులం గావలివెట్టి.' M. ix. ii. 34. A porch in front of a house, తలవాకిటిపంచ.
మొగరంబము
(p. 1036) mogarambamu moga-rambamu. [Tel.] n. The large black bee, భ్రమరము, తుమ్మెద.
మొగరము
(p. 1036) mogaramu See మొగ్గరము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close