Telugu to English Dictionary: yourself

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఈరలు
(p. 145) īralu īralu. [Tel.] You, yourselves. See ఈరు.
ఊహ
(p. 178) ūha or ఊహము ūha. [Skt.] n. Thought, reasoning, a guess, supposition, idea, contrivance. Probability, prospect. ఊహ మీద on a guess, probably. ఊహ చేయు ūha-chēyu. v. n. To think, form an opinion. ఊహపోహలు ūha-pōhalu. n. Thoughts and imaginations. (పోహ is anuk). ఊహించు ūhinṭsu. v. n. To think, reason, guess, contrive, consider, reflect on. బుద్ధినూహించుమా think within yourself అట్లు ఊహింతురు men think so.
ఏడుపు
(p. 197) ēḍupu or ఏడ్పు ēḍupu. [Tel. from ఏడ్చు] n. Weeping, complaint, grievance. Longing, strong desire, or bent of mind. నీయేడుపు నీవు చెప్పు tell your tale yourself. ఎవడి యేడుపు వాడు ఏడుస్తాడు every man knows his own troubles. ఇది వారికి ఒకటే యేడ్పు this is what they have set their hearts on.
తమరు
(p. 509) tamaru tamaru. [Tel.] pron. plu. (used honorifically.) You, yourself. తమరొకరె your honour alone. The genitive is తమ, own, స్వకీయమైన.
నాను
(p. 643) nānu nānu. [Tel.] v. n. To soak, to be steeped, to become wet. నానుచు or నాన్చు nānuṭsu. v. t. To cause to soak. నానజేయు. నానుడి nā-nuḍi. (నాను+నుడి.) n. A rumour. కింవదంతి. A proverb, సామెత. నానుడు nānuḍu. adj. Moist, damp, wet, soaked, sopped, steeped. తడినిన. నానుడుమేల wet land. నానుడువాన soaking rain. విడువకకురియు పొడిపొడివాన. నానుడువాసన a damp smell. నానుపు nā-nupu. v. a. To bleach. చలవచేయు. నానుబోర nānu-bōra. n. A breast of mutton, మాంసముగల రొమ్ము. Ila. iv. 275. నాన్పించు nānpinṭsu. v. a. To get bleached. నానబెట్టు or నానపోయు nāna-beṭṭu. v. a. To soak, to steep. నానబాలు, నానబ్రాలు or నానబియ్యము nāna-bālu. n. New rice that is soaked in water or milk. నానబెట్టిన కొత్తబియ్యము. నానవేయు nāna-vēyu. v. a. To soak, sop, steep. ఊరక యెందుకు నానవేసి చెరుపు కొంటావు why do you ruin yourself by delay?
పొంగు
(p. 800) poṅgu pongu. [Tel.] v. n. To effervesce; to boil or bubble up, overflow, boil over. To swell. To forment. To exult, to be overjoyed, elated, to be in ecstasy. సంతోషించు. To become proud, గర్వించు. పొంగి బోర్లపడు to boil over with pride or delight. ఎండచేత కండ్లు పొంగినవి the eyes are inflamed by the glare. పొంగునీళ్లు boiling water. పొంగు pongu. n. Effervescence, boiling or bubbling up, overflowing. Excess of joy. సంతోషము. Pride, గర్వము. Eruption of the measles. Boiling water in which rice is to be cooked, ఎసరుకాగిననీళ్లు, చిట్టుడుకునీళ్లు. ఎసరుపొంగి పోతున్నది the water is boiling over. నీ పొంగుకుంగ may your pride perish. ఇదియేమి చూచుకొన్న పొంగు on what do you pride yourself? పొంగులక్షణము symptoms of an eruption of measles. పొంగుప్రాలు pongu-prālu. n. A sort of grain. పొంగలించు pongalinṭsu. v. n. To stand erect; to be proud, నిక్కు. పొంగారు pong-āru. (పొంగు+ఆరు.) v. n. To be full, నిండారు., To swell out, ఉబుకు. To rejoice, సంతోషించు. To excel, to be proud, అతిశయించు, విజృంభించు, నిక్కు 'తూర్యములపటుధ్వాన మడరినింగి పొంగారె నత్యంత నిశ్చలంబులయ్యె సైనికినికరంబులద్భుతముగ.' M. VIII. iii. 273. పొంగించు ponginṭsu. To boil. To delight, to please much. చేరెడుబియ్యము పొంగించుకొనినాడు he boiled a handful of rice.
బారి
(p. 879) bāri bāri. [Tel.] n. Annoyance, trouble. ఉపద్రవము, తొందర, వ్యధ, హింస, నిర్బంధము. The slope at the side of a great well for bullocks to run down in drawing up water, by a rope running over a pulley. కపిలెయెద్దులకు నిర్బంధముగా నేర్పరిచినదారి. An elephant's tether. ఏనుగుకాలు కట్టెడు గొలుసు. బారివిడుచు to gallop, పరుగెత్తించు. బారిగొర్రె a sheep let go at a feast to be run for, as a victim or prize. 'గోముననిన్నాళ్లుకొడుకనిన్ బ్రోచి, గోమలికినిబారిగొరియగానొసగ, వలసెబోమల్లెపూవంటిరుమాలు, దొంగింపవెండ్రుకల్ తూగిచిందాడ, నించువిల్తునిబారినీగగానేల.' Sār. D. v. 295. why sacrifice yourself to love? మన్మథుని బారిపడినాడు he fell a victim to love. పులిబారికి ప్పినలేడికైవడిన్ like a fawn escaping from a tiger. బారి or భారి bāri. adj. Great, large, big. బారివాండ్లు well to do people, rich folks.
బోర
(p. 912) bōra bōra. [Tel.] n. The breast, the chest. రొమ్ము, అక్కు, ఎద, వక్షము. బోరగించు boraginṭsu. v. a. To turn upside down. బోరగిల్లజేయు. 'కడుపుబోరగించి కన్నులుముకుళించి బిర్రబిగిసికొన్న బీదయోగి.' Vēma. 1624. బోరగిల్లు, బోరగిలు or బోరగిలబడు bōragillu. v. n. To lie on one's face or breast. రొమ్ము భూమినానునట్లు పరుండు. 'పొరలున్ బోరగిలున్ వడింజరుగు.' Bmj. i. 68. బోరప్రాకుడు bōrā-prākuḍu. n. A snake, ఉరగము. బోర్ల bōrla. adv. Upside down, topsy-turvy. బోర్లదోయు to upset, overthrow. బోర్లపడు to lie prostrate: to be overset. దేన్ని చూచి బోర్లపడుతావు what do you pride yourself upon? బోర్లబొక్కలపడు to fall on one's breast or face. బోర్లించు bōrlinṭsu. v. a. To upset, lay a thing on its face.
మట్టి
(p. 943) maṭṭi maṭṭi. [Tel.] n. Earth, soil, mud Scurf or dandruff. మట్టితిన్నపామువలె పడియున్నాడు he is as stupid as a snake gorged with mud. మట్టిగుర్రమున నమ్మి యేటిలోదిగుట to rely on a mud horse and go into a river, i.e., to trust to appearances. మట్టితైలము or మట్టినూనె maṭṭi-tadama. n. Earth oil kerosene or petroleum. మట్టాడు maṭṭ-āḍu. (మట్టి + ఆడు.) v. n. & a. To walk. నడచు. To wander, roam, సంచరించు. To spread, వ్యాపించు. To cut to pieces, తనుమాడు.' అత్తూపుగములు తుత్తమురుదొట్టి మట్టాడి అట్టహాసంబుచేసి.' R. v. 191. మట్టియ Same as మట్టి and మట్టె (q. v.) మట్టు maṭṭu. v. a. To tread or trample, to crush. తొక్కు. n. Trampling, walking over. త్రొక్కుడు. Limit, bounds, measure, restriction, extent; moderation. పర్యంతము. ప్రమాణము. మితి, కొలత, తగ్గుదల. A settle or ring of cord, fibre, &c. to prevent a pot from rolling over, కుదురు. A place, ప్రదేశము. పైమట్టు the upper place or part. అడుగుమట్టు the bottom. ఆ బల్లమట్టుపట్టి తీసుకొనిరా measure the plank కావడిమట్టు the frame or bottom of the slings in a Kāvadi. వానికి తెలివిమట్టు he is wanting in sense. వానితో చెప్పినది నాబుద్ధే మట్టు I was a fool to tell him this. ఈ సంవత్సరము జనముమట్టు this year the assembly is but small. వానికి పుణ్యగతులుమట్టు he has no chance of heaven. మట్టుబీర a kind of బీరకాయ (q. v.) మట్టుగిన్నె a cup with a foot or base attached to it. adj. Limited, small. మితము, తక్కువ. మట్టుకు as far as, up to as much as, in regard to, until, as long as. దీనికి ఒకమట్టుమితములేదు there is no end or limit to it. మట్టుమర్యాదలేనివాడు he who has neither modesty nor moderation. మట్టుమీరవద్దు you must not go beyond bounds. అతడు వచ్చువరకు అని దీనికి ఒకమట్టుపెట్టిరి they laid it aside until his arrival, మనసుచెదరనీక మట్టుపెట్టి.' (Vēma. ii. 278.) curbing and restraining the mind. ఈ మట్టున లేచిపోయిరి with this they went away or thereupon they went away. పోడుగుపడి అంతమట్టున వాన నిలిచినది there was a thunderbolt and then the rain ceased. వానికి అంతమట్టుకు తెలియదు he does not know so much. ఎంతమట్టుకు పోయినావు how far did you go? గొంతుమట్టుకు నీళ్లువస్తున్నవి the water is up to the neck. వాడు ఎంతమట్టుకుంటే అంతమట్టుకు సంతోషిస్తాడు he contents himself with as much as he gets. నా ప్రాణములు ఉన్న మట్టుకు as long as I have life. నామట్టుకు నేను ఉంటాను నీమట్టుకు నీవు ఉండు I shall keep to myself, you keep to yourself. బియ్యము కావలసిన మట్టుకు చిక్కును you can get as much rice as you want. సొమ్ములుమట్టుకు నాకు వద్దు as for the jewels I do not want them. అంతమట్టుకు మంచిపని చేస్తిని so far you did well. ఇంతమట్టుకు వచ్చిన తరువాత ఇకనేమి దాక్షిణ్యము when the matter has come to such a push what is the use of delicacy? వానికి తిండిమట్టుకు బాగా కావలెను he cares for nothing but his dinner. నేనుమట్టుకు పోతిని I alone went. వాని ఒళ్లు శానామట్టుకు నాసిగానున్నది his health is in a great measure recovered. మట్టుఅగు. మట్టుకొను or మట్టుపడు maṭṭu-agu. v. n. To lessen or be diminished. తగ్గు, అడగు. కుదురుపడు. రోగము మట్టుపడినది the disease is moderating. వానికి దాహము మట్టుపడినది his thirst was slackened. మట్టుగా maṭṭu-gā. adv. Moderately, మితముగా. వర్షము మట్టుగానున్నప్పుడు when the rain is moderate. దగ్గు మట్టుగానున్నది the cough is now moderate. మట్టుగా తిన్నాడు he ate moderately. మట్టు చేయు or మట్టుపరచు maṭṭu-chēyu. v. a. To lessen, moderate, diminish. తగ్గించు. వానికి జీతము మట్టుచేసినారు they diminished his pay, వానికి జీతము మట్టుచేసినారు they diminished his pay, వానికి జీతము తగ్గించినారు. మట్టుపెట్టు maṭṭu-peṭṭu. v. a. To keep down, suppress, అడచు. To kill, చంపు. మట్టుమిగులు or మట్టుమీరు maṭṭu-migulu. v. n. To exceed the limits, అతిక్రమించు.
మనసు
(p. 951) manasu or మనస్సు manasu. [Tel.] n. The internal organ of cognition, the intellect, understanding, mind. Inclination, wish, will, pleasure, ఇష్టము. adj. Liking. ఇష్టము. మనసగు manas-agu. (మనసు + అగు.) v. n. To like, ఇష్టమగు. మనోవేగముగా పోయినాడు he went as quick as thought. మనోవ్యాధికి మందులేదు there is no cure for the heart-ache or for a mental disease. వాణ్ని పిలవడానకు నీకెట్లా మనస్సు వచ్చినది how could you find it in your heart to call him? నీకు మనస్సు వచ్చినదానిని తీసికొనవచ్చును you may take which you choose. దానిని చేయడానకు వానికి యింకా మనస్సు రాలేదు he is not yet inclined to do this. తమరు మనస్సు పట్టితే అవును if you once set your heart upon it it will be done. వానికి మనస్సువస్తే ఒకటి, మనస్సు రాకపోతే ఒకటి he is guided by fancy or whim. మనస్సే కైలాసము heaven is in the heart. వానిమనస్సు అభేద్యము his thoughts are inscrutable. వాని మనస్సును ఎందుకు నొప్పించెదవు why should you grieve him or his heart? వానిమనస్సు విరిగినది he is heart-broken. ఈమాట నీమనస్సులో ఉండనీ you must keep this to yourself. అది యేడ్చితే వానిమనస్సు తాళలేదు he could not endure to see her weep. వాని మనస్సు తిరుగలేదు he has not altered his opinion. వానికి మనస్సులో ఒకటి, బయట ఒకటి he has one thing in his heart and another in his mouth. నామనస్సు ఒకవిధముగానున్నది I know not what to think, my mind is confused. 'ఇంద్రియములు మనస్థ్సములు' the senses are dependent on the mind. M. XII. v. 596. మనస్థ్సమైనమాట the thought of his heart. మీ మనస్సు as you please, your pleasure. వానిమనస్సువచ్చినట్టు as he chose, as he pleased. మనసియ్యలేదు he did not tell his real thoughts. నీ మనస్సు వచ్చినట్టా or నీమనస్సు పోయినదే దోవా what! are you to do as you like! మనస్సు ఉంచు to give close attention. మనస్సులోనిమాట one's real opinion. తన మనస్సు వచ్చినపనులు whatever jobs he pleased. ఇట్లుచేయుటకు మనస్సురానందున as (he) could not find it in (his) heart to do this. నా మనస్సున పట్టినది it was impressed on my mind. నాలుగు దినాలు మనస్సుపట్టుకొని (లేక. నిలుపుకొని) ఉండు you must keep yourself quiet or restrain yourself for a short time. మనసరి manas-ari. (మనసు + అరి.) n. A wise man. బుద్ధిమంతుడు. 'క అనయమునిజ ప్రచారం, బనయముగాకుండ నచట నతిశౌర్యమునన్, మనసంయేకేసరియని, మనసరిరాకొమరుమూక మనుమను రీతిన్.' R. i. 123. మనసా manasā. adv. Mentally, in the heart. హృదయములో. మనసార manas-āra. adv. Sincerely, willingly. మనసిజుడు, మనఃప్రభవుడు, మనోజుడు or మనోభవుడు manasijuḍu. n. Lit: The mind-born. An epithet of Manmadha, మన్మథుడు. మనస్కరించు manas-karinṭsu. v. n. To be inclined. మనఃపూర్తిగాచేయు, మనస్సు ఉంచు. In correspondence మనస్కరించేది denotes 'please to consider the above: this is equivalent to 'yours truly.' మనస్కరించి willingly, మనఃపూర్వకముగా. మనస్కారము manas-kāramu. n. Fixed attention, profound meditation. మనఃపూర్తి, మనఃప్రయత్నము, చిత్తపరిపూర్తి. మనస్కుడు mana-skuḍu. adj. 'Minded;' a word used in compounds, thus సన్మనస్కుడు a right minded man, a good hearted man. దుర్మనస్కుడు an evil minded man. ఖిన్నమసస్కుడయి heart-broken. భిన్నమనస్కులయి being of various minds. ప్రసన్నమనస్కులయి light hearted, pleased. మనస్తాపము manas-tāpamu. n. Mental distress, displeasure, anger, vexation. ఆమెకు మనస్తాపముగానున్నది she is annoyed or grieved at this. మనస్ఫూర్తిగా or మనఃపూర్వకముగా manas-phūrti-gā. adv. Willingly. మనస్వి manasvi. adj. Attentive, fixing the mind upon anything. Intelligent. జాగరూకుడు. Goodhearted. మంచి మనస్సుగల. మనోజ్షము manōgnamu. adj. Agreeable, pleasing, captivating, lovely, handsome, మంజులమైన, సుందరమైన. మనోరంజని manō-ranjani. n. (Lit. that which delights the mind.) The name of a certain flower with a rank smell, apparently a sort of arum. మనోరథము manō-rathamu. n. A wish, desire. ఇచ్ఛ. నామనోరథము తమరు త్వరగా నెరవేర్తురని నమ్మియున్నాను I trust that you will soon grant what I so earnestly wish. మనోమలికితము manō-malikitamu. n. Misunderstanding. మనోహరము manō-haramu. adj. Heart-stealing, i.e., charming, lovely, alluring, captivating, fascinating, ఇంపైన. n. Vermicelli.
మనిషి
(p. 952) maniṣi manishi. [for Skt. మనుష్యుడు.] n. A man or woman, a person. వానికి రూకలకట్టూ లేదు మనిషికట్టూలేదు he has neither money nor men. మనిషిరాక మాకుకావచ్చును a proverbial expression, meaning, all men are subject to disease. మనిషికి ఒక రూపాయి యిచ్చినాడు he gave each man a rupee. మనిషికొక మాటచెప్పినారు each man gave a different opinion. మనిషికొకమాట చెప్పుతాడు he talks differently to different people. ఒక ఆడుమనిషి a woman. ఆమె లావాటిమనిషి she is a stout person. నీవేమిమనిషివి what a strange man you are! మనిషివా, పశువువా? are you a man or a brute? do you call yourself a man? నా మనిషివి పంపుతాను I will send my man. ఆ దేశపుమనుషులు people of that country.
వడ్డించు
(p. 1126) vaḍḍiñcu vaḍḍinṭsu. [Tel.] v. a. To help at meals, to serve up a meal. అన్నమిడు. వాడన్నమాటలను నీకునీవే యేల వడ్డించుకొంటున్నావు why do you take his words to yourself? 'అనుకయపకపకనగి యవ్వనజుడను నీకునీవె వడ్డించుకొనన్ జనునే.' Ahal. ii. 46. 'అతివవడ్డింపదివ్యాన్నమారగించి.' Ila. ii. 11. వడ్డన or వడ్డెన vaḍḍana. n. Serving out, or helping food. ఇడడము, వడ్డించడము. వడ్డనఅయినది dinner is served. రెండవవడ్డన the second course.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close