Telugu to English Dictionary: రూఢి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చాళి
(p. 28) accāḷi or అచ్చాళు aṭṭsāḷi. (K) One who lives a single life, an unmarried person. ఒంటిమనిషి, ఏకాంగిగా మండేవాడు, సంసారపు పీకులాటలేనివాడు అచ్చాళుగానుండు or అచ్చాళిగానుండు to be alone, to be quiet, free from perturbation. 'చారుశిలాముఖ్యజలజలోచనల, చేరికాబంధుల చెలులనీక్షణమె, పగరకుజొరరాక బహుదుర్గమార్గ, మగుకోహళమహర్షి యాశ్రమస్థలిని, జేరిచి మనము నిశ్చింతనేతెంచి, యారూఢిబలయుక్తి నచ్చాళిగాగ, అనికిసన్నద్ధులమై యందమవల.' Pātivratya. 35.
అశ్వము
(p. 99) aśvamu aṣvamu. [Skt.] n. A horse. గుర్రము. అశ్వగతి the pace of a horse. అశ్వదూత a messenger who rides on horseback. అశ్వపాది horsefooted. అశ్వమేథము the sacrifice of a horse, performed anciently by Hindu rajahs. అశ్వరథము a carriage drawn by horses. గుర్రపు బండి, గుర్రాలబండి. అశ్వవైద్యుడు a veterinary surgeon. అశ్వశాల a stable. అశ్వశాస్త్రము veterinary science. అశ్వశిక్ష the training of horses. అశ్వశిక్షకుడు a rough-rider, a horse-breaker. అశ్వారూఢుడు or అశ్వారోహుడు one who is mounted on horseback. రవుతు.
ఆరూఢము
(p. 122) ārūḍhamu ārūḍhamu. [Skt.] adj. Ascended, mounted. పంచారూఢపత్రము a bond signed by five persons, viz., the creditor, debtor, writer, and two witnesses.
నిరూధి
(p. 657) nirūdhi ni-rudhi. [Skt.] n. A thorough understanding, skill. fluency. Fame, ప్రసిద్ధి. నిరూఢము ni-rūḍhamu. adj. Famous. ప్రసిద్ధికెక్కిన.
పంచ
(p. 687) pañca pancha. [Skt.] adj. Five. పమచకము panchakamu. n. A set of five things, as of epigrams. భ్రమరపంచకము a set of five epigrams on a bee. యుద్ధ పంచకము the five books of the Mahabharata (VI. X.) which deal with the battle. A battlefield, యుద్ధభూమి. పంచకళ్యాణి pancha-kaḷyāṇi. n. Black or any other colour with white points; piebald; a horse with a white mark or star in the face and with white legs. పంచకోణము or పంచకోణికోణము pancha-kōṇamu. n. A pentagon. See రోణము పంచగవ్యము pancha-garyamu. n. The five articles derived from the cow, viz.: milk, curds, butter, urine, and dung. పంచగౌడులు panchagaudulu. n. The collective name for the Brahmins of Bengal and the northern provinces. పంచత్వము panchatvamu. n. Death, dying, as being the dissolution of the five elements. పంచజనుడు panchajanuḍu. n. Man in general. మర్త్యుడు. See పాంచజన్యము. పంచజనచర్వణము cannibalism, eating human flesh. A. vi. 70. పంచదళము pancha-daṣamu. adj. Fifteenth. పంచదశకము pancha-daṣakamu. n. Fifteen. పంచదశి pancha-daṣi. n. The fifteenth lunar day, of either the dark or bright fortnight. పౌర్ణిమ, లేక, అమావాస్య. పంచద్రావిదులు The five divisions of the Dravida races, viz. Tamil, Telugu, Malayalam, Kanarese and Mahrati. పంచనఖము panchanakhamu. n. Lit: 'Five clawed,' i.e., a tiger. పులి. పంచనఖి pancha-nakhi. n. An iguana. ఉడుము. పంచపాత్రము pancha-pātramu. n. The 'five dishes:' a phrase used for five cups used in worship. Also, a sort of cup. పంచప్రాణములు pancha-prāṇamulu. n. The five vital airs of the body. Life. పంచభూతములు the five elements. పంచబాణుడు, పంచశరుడు or పంచసాయకుడు pancha-bāṇuḍu. n. Manmadha the god of love, so named from his five arrows. These are five fragrant flowers, viz., the అరవిందము or lotus, the అశోకము Jonesia asōka, the చూతము or mango blossom, the నవమల్లిక or Arabian jasmine, and the నీలోత్పలము or blue lotus; these are emblems of five passions denominated ద్రావిణి, శోషిణి, బంధిని, మోహిని and ఉన్మాదిని, that is, flurry, pinning, enslaving, bewitching and maddening. పంచభక్ష్యములు five sorts of cakes. పంచమము panchamamu. n. A tenor note, similar to that of the cook when crowing; also, a note like that of the linnet or cuckoo. The musical treble. The two notes పంచమము and షడ్జము are called the నిత్యస్వరములు or constant (pervading) notes: they are also called స్వయంభుస్వరములు the supreme sounds. adj. Fifth , అయిదవది. Fine, melodious, ఇంపైన. పంచమస్థితి panchama-sthiti. n. The being a Pariah. The Pariah state or condition. పంచమి panchami. n. The fifth lunar day, of either the dark or bright fortnight. పంచముడు panchamuḍu. n. A Pariah, or 'man of the fifth class:' as not belonging to any of the four pure Hindu castes. మాలవాడు. పంచరాశికము pancha-rāṣikamu. n. The rule of five, the double rule of three. పంచలక్షణము panchalakshaṇamu. n. A Purana. పురాణము. పంచలవణములు pancha-lavanamulu. n. Salts in general. The five kinds of salt. See లవణము. పంచలోహము pancha-lōnamu. n. A mixed metal, composed of five ingredients, viz., copper, zinc, tin, lead, and iron. పంచపట్టెలు pancha-paṭṭelu. n. Five streaks. అయిదు చారలు. పంచవన్నెలు pancha-vannelu. n. Five colours. పంచవన్నెలరామచిలుక pancha-vannclarāma-chiluka. n. A paroquet. పంచశాఖము pancha-ṣākhamu. n. The hand. చెయ్యి. పంచాంగము panch-āngamu. n. An almanac, as specifying five different things, viz., the lunar day (తిథి), the day of the week (వారము), the sign in which the moon is (నక్షత్రము), the conjuction of the planets shewing good and bad days (యోగము), and the horoscopes (కరణము). పంచాంగాముప్పు to give a forecast of the day; to tell lies or false stories. పంచాణము panchāṇamu. n. The united five castes of the carpenter, blacksmith, brazier, goldsmith, and stonecutter. పంచాణులు panchāṇulu. n. Workmen, mechanics, or handicraftsmen, పంచాణమువారు. పంచామృతము a meat and drink offering formed of cocoanut kernels, plantains, sugar, honey, and ghee. పంచాయతి panchāyati. n. A court of arbitrators consisting of 'five members.' A Panchayat, an arbitration court. పంచాయతిదారులు arbitrators referees. పంచాయుధము the 'five weapons' of Vishṇu: also as amulet, being a plate of gold on which these are engraven. విష్ణువుయొక్క అయిదు ఆయుధములు, మరిన్ని ఆ అయిదు ఆయుధములయొక్క రూపులు చెక్కించిన పతకపుబిళ్ల. పంచారూఢిపత్రము a bond duly executed, i.e., bearing 'five names' viz., those of the lender, the borrower, the writer, and two witnesses. పంచాస్యుడు, పంచావనుడు or పంచముఖుడు panch-āsyuḍu. n. 'The five faced;' an epithet of Siva. పంచాక్షరి panch-ākshari. n. The 'five syllables.' that is, a certain spell or holy name 'నమశ్శివాయ' Na-mas-Si-vā-ya or 'Salutation to Siva,' similar to the five syllables 'A-ve-Ma-ri-a.' పంచేంద్రియములు panch-ēndriyamulu. n. The five senses or organs. 'సీ మేనిలోగర్ణనాసానేత్రజిహ్వత్వగాహ్వయ పంచేంద్రియములగోష్ఠి.' G. v. 13. పంచేంద్రియబద్ధుడైన panch-ēndriya-baddhuḍ-aina. adj. Carnal, sensual, worldly, given up to one's lusts.
పెనయు
(p. 791) penayu penayu. [Tel.] v. n. To twine, కలయు. To struggle, to be implicated. పెనగు. 'రూపు పేరు రెండు రూఢితో గలిగిన, పేరురూపు క్రియను పెనసియుండు.' Vēma. 361. పెనపు penapu. v. a. To cause to be entwined, పెనయజేయు. To unite, కలుపు. To cause to be twisted, పెనచు. To cause to struggle. n. A quarrel. వివాదము. Enmity, విరోధము. పెనపరి penap-aṛi. n. A quarrelsome person, వివాదశీలుడు. One who is fond of creating enmity, భేదశీలుడు.
పొడుచు
(p. 806) poḍucu poḍuṭsu. [Tel.] n. To rise (as the sun or moon, a star, or the tide.) ప్రొద్దుపొడుచు, ఉదయించు, ఏపోటుపొడుచు నీకు వానితిట్లు పొడిచేనాటికి when his curses touch you, or fall upon you. ఏరు పోటు పొడిచినది the tide has risen in the river. To fight, పోట్లాడు. 'పాండవబలంబే కాదశా క్షౌహిణుల్ రూఢింగౌరవసైన్య మీయుభయముంరోషాహేతా న్యోన్యమై యీడబోవక వీకతో బొడువగా నేపారుఘోరాజి నల్లాడెంధాత్రి.' M. I. i. 136. వీకతోబొడువగా on their making a bold attack, ధైర్యముతో పైబడగా. v. a. To pierce, stab, gore. To prick or cause pain. To sting, కుట్టు. రంధ్రము to bore a hole. పొడుచు to put (a worm) on a fish hook ఇచది కండ్లను పొడుస్తున్నది it tries (pricks) the eyes. మోచేతితోపొడుచు to thrust or hit with the elbow, or to elbow. ముద్రపొడుచు to seal, set a seal on. To cut down, or fell, నరకు. 'బొగ్గులకైకల్పతరువు బొడుచుటసుమతీ.' Sumati. v. 73. ఆనపొడుచు to lay a ban or protest, so as to check proceedings, ఒట్టుపెట్టు. A proverb says వానివేలితోనే వానికన్ను పొడిచినారు they pierced his eye with his own finger, i.e., they turned his arts against himself. పొడుపు poḍupu. n. A stab, పొడుచుట. A pricking pain, as that of a boil. The rising of the sun. The swell of a river. ఉదయము, పోటు. 'తడుకద్రోపరి ముచ్చు పొడుపులు.' P. iv. 255. టీ నెరదొంగలుగాక తడుకద్రోపరులైన దొంగలు. నెలపొడుపు the rising of the moon. పొడికథ or పొడుపుకథ a conundrum. పొడుపుడుమాట or ఎత్తిపొడుపుమాట a taunt or jeer, దెప్పు. Ila. iii. 8. పొడుపుగొండ poḍupu-gonḍa. n. A mountain out of which the sun is supposed to rise, ఉదయాద్రి. పొడువ or పొడుపడు poḍuva, n. One who thrusts or pricks. పొడుచువాడు. A wicked man, దుర్జనుడు.
ప్రారూఢి
(p. 847) prārūḍhi pr-ārāḍhi. [Skt.] n. Fame, notoriety. ప్రసిద్ధి. Determination, resolution. నిశ్చయము. 'భయకృత్పల్లనసూచికాస్థితితపః ప్రారూఢిబేరై.' Vasu. iii. 138. టీ ప్రారూఢి. నిశ్చయభావము.
బోరు
(p. 912) bōru bōru. [Tel.] adj. Great, large. బోరుతలుపులు or బోర్తలుపులు large doors, పెద్దకవాటములు. 'వారలుతమ తమవాకిటి, బోరుతలుపులెట్టి సమయములదెరవకతా, రారసిపదిలముసేయుచు, వారూఢస్థితివహించిరా సౌధములోన్.' KP. vi. 130. n. A rush or downpour, as of heavy rain, వానకురియుటయందగు ధ్వన్యనుకరణము. బోరున, బోరన, భోరున or భోరన bōruna. adv. Quickly, rushingly, శీఘ్రముగా. Much, grandly, greatly, heavily (as rain.) వాన జోరున కురిసినది it rained heavily. బోరునిఏడ్బినది she wept bitterly. 'మనుజేశ్వరులెల్లనుబోరన దమయంతీ స్వయంవరమునకు నొప్పంజనుదెంచిరి.' M. III. ii. 28. బోరుకలగు, బోరుకలుగు or బోరుకల్గు bōru-kalugu. v. n. To sound loud, మ్రోగు, ధ్వనించు బోరుకొను bōru-konu. v. n. To resound, sound aloud. 'భేరిమొదలగువాద్యముల్ బోరుకొనగ.' Ila. i. 104. బోరుకొలుపు bōru-kolupu. v. a. To sound. ధ్వనించునట్లుచేయు. 'బూరుగల్ కంచుకొమ్ములు కాహళములు బోరు కొలుపుటకు నంబుధులెల్లగలగ.' ND. ii. 552.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
మాట
(p. 970) māṭa māṭa. [Tel.] n. A word, పదము. A promise, వాగ్దత్తము, ప్రతిజ్ఞావచనము. Slander, నింద. Opinion, rumour, వృత్తాంతము. అతడు నీ మాట చెప్పలేదు he did not speak of you. ఇది వేరే మాట this is another affair, another thing. వానిమాటకాదు this is not about him, I am not talking about him. గడియకు ఒకమాట చెప్పినాడు he changed his mind every hour. మంచిమాట (interj.) Very well. దాన్ని గురించి రెండో మాటలేదు there is no alternative. వారివిద్ద మాటలుపడినాడు he was reproached or reprimanded by them. In some phrases the word మాట need not be translated. Thus, ఆమె తిరిగీ వస్తున్నదనేమాట తెలిసి knowing that she would return. నేను దానిని కొన్నమాట రూఢి it is very true I bought it. ఆమాటే యెరుగను I know nothing of it. ఇందుచేత మాటవచ్చును by this you will get into disgrace. అతడు మాటతప్పలేదు he did not fail in his promise. మాట తప్పినవాడు మాలవాడు a promise breaker is a pariah, i.e., is a mean wretch. నేను పోయినమాట వానికి ఎట్లా తెలిసినది how did he know that I was gone? అతడు పోయేమాట ఉండేమాటా does he propose to go or stay? వాడు ఉండేమాట యింకా తెలియలేదు I do not as yet know that he will remain. మాటకుమాట word for word, literally. నా మాట అడుగుదాటకు transgress not my command. తనమీద మాటరాకుండా ఇట్లా చేసెను he did this to avoid blame. మాటవినుట to obey. ఎంతమాట what nonsense! వానిమాట వాని ఒడిలో వేసినాను I acted as he desired. నీకు మాట నాకు మూట a command is easy to give but hard to perform, or a word from you will make me rich. వెయ్యిమాటలేల why discuss it at length, in a word. ఆ పెండ్లి మాట యీ గ్రంథములో లేదు there is no mention of the marriage in this book నామాటవేరు, నీమాట వేరు I say one thing you say another, my opinion is different from yours, my case is quite different from yours. వానికి నాకు మాటలు లేవు he and I are not on speaking terms. వానితో నీకేమిమాటలు why do you speak with him? ఈమాట వింటే ఆయన యేమనును if he hears of this what will he say? కడపటిమాటయేమి what was the upshot of the business? ఇప్పట్లో వాని మాట సాగదు he has now no influence. కడకు వానిమాటే ముందరికివచ్చినది at last his words proved true. దానిని గురించి ఇంకా యేమాటా తెలియలేదు I do not yet know the result. మాటలకు పట్టుకొంటే విడవడు if he begins talking he will never stop. అదెక్కడిమాట what nonsense! such a thing is impossible. మాటలు మంచివే కాణి మనసు మంచిదికాదు he talks well but has a bad heart. ఇంకా మాటలు రాని బిడ్డ a child that cannot yet speak. వానికి ఆ ఊరిలో మాట వాసికద్దు లేక మాట సాగుతుంది he has influence in the town. ఆయన మాటకు ఎదురులేదు his word is law. మాటలకుమాత్రము పేదరికములేదు as far as words go he is rich enough. ఒక మాట యిచ్చి పదిమాటలు తీసుకొన్నాడు his reproaches were returned ten-fold. మాటకాడు māṭa-kāḍu. n. A good public speaker, సభయందు భయములేక మాటాడువాడు, వక్త. మాటకారి māṭa-kāri. n. A skilful speaker, యుక్తిగా మాటాడువాడు. A talkative person, వాచాలుడు. మాటలమారి māṭala-māri. n. A talkative person, మిక్కిలి మాటాడువాడు. మాటలాడు, మాటాడు or మాట్లాడు māṭa-l-āḍu. v. n. To speak, talk, converse, to reproach. నన్నెందుకు ఊరికె మాటలాడుతావు why reproach me for nothing? S. iii. 41.
మీరు
(p. 990) mīru mīru. [Tel.] v. n. and a. To exceed, transgress, pass, excel, అతిశయించు, కడచు, అతిక్రమించు. ఇడు మీరిసపడుచు a grown up girl. మీరిన్ excessively, extremely. రూఢిమీర certainly. సొగసుమీర prettily. చ నువుమీర affectionately. బాగుమీరంగ healthfully, cheerfully, i.e., well. బాళి మీరంగ sorrowfully. Vish. iii. 290.
రుటము
(p. 1080) ruṭamu or రుటంపు ruṭamu. [from Skt. రూఢము.] adj. Hard, firm. దృఢము. 'వానిరుటంపుపెందొడలు.' T. ii. 74. రుటముగ ruṭamu-ga. adv. Firmly, certainly. గట్టిగా, రూఢిగా. 'క అటుగాననేను నియ్యెడ, కుటిలాలకనిన్నునిత్తు గురువర్యునకుం, రుటముగనింతకుమిక్కిలి, ఘటితో పాయంబులేదు కలలోనైనన్.' Valeswara. v. 116.
రూడి
(p. 1082) rūḍi Same as రూఢి. (q. v.)
రూఢము
(p. 1082) rūḍhamu rūḍhamu. [Skt.] adj. Sure, certain, true, నిశ్చయింపబడిన. Public, notorious, well-known. ప్రసిద్ధమైన. Opened, blown, as a bud, మొలచిన. రూఢముగా rūḍhamu-gā. adv. Positively, certainly. రూఢి rūḍhi. n. Certainty, truth, నిశ్చయము. Fame, notoriety, ప్రసిద్ధి. రూఢి or రూఢియైన adj. Certain, established, famous, usual or customary. నిశ్చయమైన, ప్రసిద్ధమైన. లోకరూఢిఅయిన universally known, Peculiar, as opposed to యాగిక (etymological or radical,) అనన్య సాధారణమైన. The రూఢ్యర్థము or usual meaning of పంకజము is a lotus but the యాగికార్థము or literal sense is mud-born. రూఢిగా rūḍhi-gā. adj. Positively, certainly. నిశ్చయముగా అది నాకు రూఢిగానున్నది I am confident of it, I know is for certain. రూఢిచేయు or రూఢిపరుచు rūḍhichēyu. v. a. To ascertain, confirm, establish. prove, resolve, determine, నిశ్చయించు, స్థిరపరచు. రేపువెళ్లేటట్టు రూఢిచేసినారు they have determined on going tomorrow. తమరు చెప్పిన దాన్నే రూఢిచేసినారు they have confirmed your statement.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83494
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79317
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63450
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57611
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38165
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28474
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28131

Please like, if you love this website
close