Telugu to English Dictionary: వచ్చినాడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంత
(p. 9) anta anta. [Tel.] n. Whole; adj. So much. adv. Then, afterwards. నీ వెంత అడిగితే అంత యిస్తాను I will give you as much as you ask. అంతకంటె then that. అంతకంత as much again. అంతకంతకు by degrees; more and more. అంతకుముందు before that. అంతమంది so many men. అంత. మందిలో among so many persons. అంతమట్టుకు so far, thus far. అంతమాత్రము only so much అంతసేపు so long. అంతలో in the mean time. మూడంతలు three times as much. అక్కడికి పోయినంతలో on his going there. వాడు తనంతనే వచ్చినాడు he came of his own accord. అంతవాడు లేడు. there never was such a man. రాజంతవాడవు thou art equal to the king. నాయంతవాడు my equal, one like me one as tall as I am. అంతే అవును. that probably is the case నిద్రలేచినంతలో when he rose from sleep, as soon as he awoke. నేను తెలిసికొన్నంత as much as I know అంతపని such an act.
అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
ఆమిషము
(p. 118) āmiṣamu or హామిషము āmishamu. [H.] n. Means, property, worth, resources, gross produce. అయిన౛ు. ఆ గ్రామమునకు పోయి ఆమిషము చూచుకొని వచ్చినాడు he went to the village and examined what its resources were. 'తనహామిషము అమ్మి ఆ విలువలో కొంత దాచివేసి' Pritchetts Acts v. 1.
ఇప్పుడు
(p. 137) ippuḍu ippuḍu. [Tel. ఈ+పొద్దు] n. Now, this time. ఇప్పటి of this time. ఇప్పటిపని the present business. ఇప్పటివాండ్లు the people of these days. ఇప్పుడే వచ్చినాడు he is just come.
ఎంత
(p. 180) enta enta. [Tel. ఏ+అంత] adj. How much. ఇది యెంత పొడుగు how long is this? ఎంత అన్యాయము what injustice! ఈ బంగారమెంత ఉన్నది what is the price (or weight) of this gold? అది యెంత పని what great matter is that? ఎంతమాత్రము how much? ఎంతలో within what price? ఎంతమాత్రము కాదు by no means. అట్లు అనడానకు నేనెంతవాణ్ని who am I that I should say so? నీవెంత ఆయనయెంత? what comparison is there between you and him? నేనెంత చెప్పినా notwithstanding all I could say. ఎంత చెల్లించితే అంత మంచిది the more you pay the better అప్పుడు ఎంత రాత్రియైయుండెను what time of night was it then? ఎంత సేపటికి వచ్చినాడు how long after did he come? ఎంతకు అమ్మినాడు for how much did he sell it? ఎంతమాత్రము కూడనిపని a thing quite out of the question. నీవెంత నేనెంత అని పోట్లాడినారు they scorned or insulted one another. ఎంతటి వారు what sort of persons? ఎంతమంది how many (persons.) The conjunction యు is sometimes added as an intensive. ఎంతయు రయంబున with very great speed ఎంతేని entēni. adv. Ever so much, how much soever. ఎంతైనను. ఎంతైన. how vast, how great, ever so great. ఎంతో much. ఎంతో సంతోషముతో with great joy.
ఏమి
(p. 200) ēmi or ఏమీ ēmi. [Tel.] pron. What. నాదగ్గిర యేమిన్ని లేదు. I have nothing with me. వాడు ఏమయినాడు what has become of him? ఇంక చేయవలసినది మరి యేమి లేదు nothing further remains to be done. ఏమైనా ఉండును there may be something. నేనిక్కడ ఉండడమువల్ల ఫలమేమి what is the good of my staying here? సోమ్ము ఏమిన్ని పోలేదు nothing has been lost. ఏమికతంబున (i.e. ఎందునిమిత్తము) for what reason. వాడేమి నేనేమి అంతా ఒక్కటే either he or I, there is no difference. వచ్చినాడా యేమి has he come? నా తండ్రియేమి నేనేమి both my father and I, my father as well as I. ఎవ్వడైనానేమి no matter who it is. అదియేమి యిదియేమి either this or that. ఆ యిల్లు మీకు చాలకయేమి what do you mean by saying the house is too small for you? వాడు రాకయేమి why should he not come? surely, he will? ఏమివచ్చినావు what have you come for? కుక్క యేమి మొరుగుచున్నది how the dog barks! వాడు ఏమిన్ని యేడవలేదు he did not weep at all. ఏమిటి ēmiṭi. pron. & adj. What, of which, what kind of. అదేమిటి what's that? ఏమిటో I don't know what that is వాడు ఏమిటివాడు of what caste is he? ఏమిటికి wherefore, for what reason. ఏమిటికో I know not why. ఏమిన్ని anything whatever. ఏమిన్ని యివ్వడు he will give nothing. ఏమొ or ఏమో ēmo. (ఏమి with ō added for doubt.) I know not what. రాలేదేమో perhaps they did not come.
కట్టుబట్ట
(p. 232) kaṭṭubaṭṭa kaṭṭu-baṭṭa. [Tel.] n. A garment. కట్టుబట్టతో విడిచినారు they left him with the skirt on his back. కట్టుబట్టతో పారివచ్చినాడు he escaped with nothing but the clothes on his back.
కొంచెము
(p. 314) koñcemu or కొంచియము konchemu. [Tel.] n. A little. Littlleness న్యూనత. కొంచెము కొంచెముగా little by little. కొంచెముగా ఎంచు to esteem slightly. కొంచెములో వచ్చినాడు in a little (time) he arrived, i.e., very soon. కొంచెపు బుద్ధి little sense. adj. Little, small, trifling, slight, petty, the least: contemptible, vile, low. కొంచెపువాడు a low fellow. కొంచెముసేపటికి in a short time. కొంచెముచేయు or కొంచెపరుచు konchemu-chēyu. v. a. To diminish. To wrong or injure. కొంచెపుపాటి kon-chepu-pāṭi. adj. Small, middle-sized. కొంచెమున konchemu-na. adv. In the least, for a trifle. కొంచెకత్తె konche-katte. n. A low or common woman. అల్పురాలు, సామాన్యురాలు. కొంచెకాడు konche-kāḍu. n. A low or common man. అల్పుడు సామాన్యుడు. కొంచెతనము konche-. tanamu. n. Littleness: leanness అల్పభావము, సన్నదనము. కొంచెపడు konche-paḍu. v. n. To be wanting, to lack. తక్కువపడు. To become lean సన్నగిలు.
తన్ను
(p. 507) tannu tannu. [Tel.] v. a. To kick. కోడిని గద్ద తన్నుకొనిపోయినది the hawk pounced upon the fowl and carried it off. n. A kick. వానిచేత తన్నులుతినివచ్చినాడు he got a kicking from him. తన్నుకోల a prop, పోటీపెట్టిన కొయ్య. తన్ను బిళ్ల tannu-balla. n. A foot-board తమ్నబిళ్ల a sort of game played by children. H. iii. 183. తన్నులబడు tannula-baḍu. v. n. To get kicked, to suffer blows. తన్నులాడు tannu-l-āḍu. v. n. To kick each other, to exchange blows: to fight, as cocks do. ఒకరినొకరు తన్నుకొను.
ప్రాణము
(p. 845) prāṇamu prāṇamu. [Skt.] n. Air, wind, breath, life, vitality, the living soul. గాలి, హృదయమందలి గాలి, హృదయమందలిగాలి, ఉసురు. In Grammar, a vowel. ప్రాణముతోనున్నవాడు one who is yet living. కొనప్రాణముతోనున్నాడు he is nearly dead. ప్రాణమువిడిచెను he breathed his last, gave up the ghost. పంచప్రాణములు pancha-prāṇamulu. n. The five vital airs, called ప్రాణము, అపానము, సమాణము, ఉదానము, వ్యాసము. అతడు దానిమీద ప్రాణములు విడుస్తున్నాడు or వానికి దానిమీద పంచప్రాణములు he loves her very dearly. ప్రాణముమీదకువచ్చేపని a most perilous affair. వానిప్రాణము మీదికి వచ్చినది he is in danger of his life. ప్రాణముతో పట్టుకొనిరి they caught him alive. నా ప్రాణముపోయినా ఇట్లు చెప్పుదునా I will not say so even if it should cost me my life. వాడు పిడికిట ప్రాణములు పట్టుకొని వచ్చినాడు he arrived half dead. వానికి నేర్పుట ప్రాణసంకటమవును it would cost immense labour to teach him. ఆ విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠచేసినారు literally, they gave life to the image, i.e., they performed the ceremony by which the god is supposed to be lodged in the image. ప్రాణత్యాగము suicide, ఆత్మహత్య. ప్రాణాతురము or ప్రాణసంకటము deadly peril. 'ప్రాణాతురమైనచో పరిణయంబులయందును బల్కుబొంకు సత్యాతిశయంబు.' M. III. v. 67. ప్రాణాపాయము mortal danger. ప్రానావనము saving the life. ప్రాణావసానకాలమున in his last moments. ప్రాణాహుతి the five morsels offered to the five vital principles. ప్రాణస్నేహము intimate friendship. ప్రాణదానముచేసినాడు he gave them their lives, he spared their lives. నా ప్రాణము ఉండేమట్టుకు as long as I live. ప్రాణగొడ్డము prāṇa-goḍḍamu. n. The loss of life, death. చావు, ప్రాణహాని, ప్రాణాపాయము. 'వినునృపరాజ్యామిషముంగొనపలువురచేత ప్రాణగొడ్డంబైయున్నను ధీరుడే మరమినది దనకునుదక్కించుకొను బుధస్తుత్యముగాన్.' M. XII. ii. 208. ప్రాణదుడు prāṇa-duḍu. n. The giver of life, the creator. బ్రహ్మ. ప్రాణనాధుడు or ప్రాణేశుడు prāna-nādhuḍu. n. The lord of (her) life, i.e., a husband or lover, మగడు. Yama, యమధర్మరాజు. ప్రాణవాయువు prāṇa-vāyuvu. n. Oxygen gas. ప్రాణాచారము prāṇā-chāramu. See ప్రాయోపవేశము. ప్రాణాయామము prāṇā-yāmamu. n. A ritual mode of breathing, while mentally reciting certain prayers, stopping one nostril and inhaling or exhaling with the other: నాసికారంధ్రము లవద్ధనుండు వాయువును మంత్రపూర్వకముగా నిరోధించుట. A. iii. 88. ప్రాణి prāṇi. n. A being, or living creature. జంతువు.
బోడ
(p. 910) bōḍa , బోడి or బోడు bōḍa. [Tel.] adj. Bald, bare, hornless, cropped. n. A monk. సన్యాసి. బోడితల bald-head. బోడితలతో వచ్చినాడు he came with his head bare or uncovered. బోడిఆవు a hornless cow. బోడిఅమ్ము a blunt arrow, an arrow without a point. వారిని బాగా బోడిచేసినాడు he stripped them bare, or plundered them. బోడియేనుగు a tuskless elephant. బోడిచెట్టు a pollard or a tree with the boughs cut off. బోడతీరువ gross tax (as on a crop) without deducting charges. 'ఆసపడిబోడవైన నేనగుదుగాని యింటి సొమ్మెక్కకాసైన నియ్య.' S. ix. 3. బోడడు a bald headed man, బోడివాడు. బోడతరము bōda-taramu. n. A plant, Sphœranthus indicus. శ్రావణీ, ముండినిచెట్టు. Ainslie. 167. బోడలు bōḍalu. n. Hornless cattle. కొమ్ములురాని పశువులు. బోడసరము Same as బొడ్డసరము. (q. v.) బోడికోడి bōḍi-kōḍi. [Tel.] n. A coot, Fulica atra (F.B.I.) బోడించు or బోడిచేయు boḍinṭsu. v. a. To make bald to crop the hair on the head entirely, to shave the hair on the head entirely, to shave the head entirely bare. బోడింపు boḍimpu. n. The act of removing the hair on the head entirely. బోడిచేయుట.
మొక్క
(p. 1034) mokka mokka. [Tel. short for మొలక from మొలచు.] n. A germ, shoot, young plant. నారు, చిన్నచెట్టు. Bluntness, disgrace. నాడిమిలేమి, భంగము. A stup of wood. చెట్టు నరకగా మిగిలినమోడు. మొక్కనగవు a budding smile, a slight laugh. 'గ్రక్కునంబొడము మొక్కనగవుల మోముదమ్ములకు వేరొక్కవింత.' A. iv. 45. మొక్కపైరు young corn. మొక్కకట్టు to transplant. వాణ్ని మొక్కపరచినారు they disgraced him. మొక్కచెడు mokka-cheḍu. v. n. To be disappointed or disgraced, భంగపడు, అవమానపడు. మొక్కచెడి వచ్చినాడు he returned home disgraced. మొక్కచెరుచు mokka-cheruṭsu. v. a. To disgrace, disappoint. భంగపరుచు. మొక్కచేయు mokka-chēyu. v. a. To blunt. పదునుచెరుచు. మొక్క౛ొన్న mokka-ḍzonna. n. Maize, Indian corn, a large species of the Great Millet. Rox. i. 263. మొక్కడి or మొక్కడీదు mokkaḍi. n. An obstinate man. ముష్కరుడు. An elephant without tusks. కొమ్ములు లేనియేనుగు. మొక్కడు mokkaḍu. n. A form or determined man, a strong man. బతిష్ఠుడు, బలిసినవాడు. మొక్కడుగు mokk-aḍugu. n. The stumps of corn which yield a second crop. మొక్కపడు mokka-paḍu. v. n. To be disgraced. మొక్కపరుచు, మొక్కచెరుచు or మొక్కపుచ్చు mokka-paruṭsu. v. a. To disappoint, disgrace. భంగపరచు, అవమానముచేయు. మొక్కపోవు or మొక్కలుపోవు mokka-pōvu. v. n. To become blunt, వాడిచెడు. To be disgraced, to be disappointed, భంగపడు. మొక్కమామిడి mokka-māmiḍi. n. The Cashew nut, జీడిమామిడి.
వచ్చు
(p. 1122) vaccu vaṭsṭsu. [Tel.] v. n. To come, arrive. To happen, occur, take place. చేరు, సంభవించు, కూడు, ప్రాప్తమగు. రేపువత్తురు they will come tomorrow. నిన్నవస్తిమి we arrived yesterday. నాతో కూడావచ్చినాడు he accompanied me. మనసువచ్చినన్నికాగితాలు పుచ్చుకొన్నాడు he took as many papers as he pleased. నీ మనసువచ్చినట్టు చెయ్యి do as you please. This verb is used (like Come in all languages), in numerous senses. వచ్చేతేప next time. వచ్చేనెలలో in the next month. వచ్చేకడగండ్లు రాకమానవు the evil that must happen will happen. As an auxiliary, it is added to the present participle of any verb to denote long habit or continuance, as చదువుచువచ్చినాడు he continued to read. అట్లుచేయుచు వచ్చినాడు I have been doing so all along. అక్కడికి పోవుచువచ్చినాడు he used to go there. It is also joined to the past participle of the verb వలయు. ఇట్లు చేయవలసి వచ్చినది it became necessary to do so. It is added to the infinitive in A. ఇది మాకు తెలియవచ్చినది it came to our knowledge. నాకు బుద్ధిచెప్పివచ్చినాడు he went so far as to advise me. వచ్చు or వచ్చును (the third person singular aorist of వచ్చు) is used with the infinitive as an auxiliary signifying permission, possibility or probability. నీవు అక్కడికి పోవచ్చును you may go there. మేము రావచ్చునా? may we come? అట్లు కావచ్చును it may be so perhaps. రాదు (the neg. aor. 3rd person singular) means must not or cannot. నీవు అక్కడికి పోరాదు you must not go there. నేను చేయరాదు I cannot do it. అట్లా చెప్పరాదా can you not say so? Added to a dative, వచ్చు is used to mean To be got, gained, acquired, to be available. ఆ భాష వానికి వచ్చినది he has learned the language, he knows that tongue. ఈ బియ్యము నెల దినాలకు వచ్చినవి this rice lasted for one month. వానికేమివచ్చినది what happened to him? ఇయ్య మనసువచ్చినది he was inclined to give it. వానికి బుద్ధివచ్చినది he has learnt sense. వానికి మీసాలువచ్చినవి his whiskers have grown. దానికి మళ్లీ కండ్లు వచ్చినవి she has recovered her sight. ఆ బిడ్డకు పళ్లు వచ్చినవి the child has cut its teeth. ఇక్కడ సకారమునకు లోపము వచ్చినది there is an elision of the letter S. వానికి అన్నానికే లోపము వచ్చినది he is even in want of food. వానికి ఒంటికివచ్చినది he fell sick. ఇది పనికివచ్చును this will do, this will be useful. ప్రాణమునకు వచ్చే perilous, hazardous. ఇది నీ ప్రాణమునకు వచ్చును this will put your life in peril. నోటికివచ్చినట్టు వానికి తిట్టినాడు he gave them all the abuse he could think of. అతని పేరు నాకు రాలేదు I cannot recollect his name. ఆ పాఠము వానికి రాలేదు he does not know the lesson. వచ్చుబడి vaṭsṭsubaḍi. n. Income. ఆయతి. రాబడి. వానికి నిండా వచ్చుబడియున్నది he has a large income. వచురాములు vatstsu-rāmulu. (వచ్చుట+రామి.) n. Coming and not coming. వచ్చుటయును రామియును.
వట్టి
(p. 1123) vaṭṭi vaṭṭi. [Tel.] adj. Empty, mere, plain, simple, naked, downright, utter, gross, false, vain: unprofitable, groundless. ఉత్త. ఏమియు లేని, ప్రయోజనములేని. వట్టిఆవు a dry cow. వట్టికాలు a shin bone, పిక్కవెలుపటికాలు. వట్టిగోడ a mere wall, a blind wall. వట్టికాళ్లతో వచ్చినాడు he came barefoot. వట్టిమన్ను loose earth. వట్టిగాలి mere wind, without rain. వట్టిప్రయాసము unprofitable labour. వట్టిమాట an untrue word, a meaningless word, లేని మాట. అపవాదము. వట్టివరి or వట్టివరులు, a kind of grain. సస్యవిశేషము. వట్టివాడు an empty fool, వ్యర్థుడు. వట్టివేరు vaṭṭi-vēru. n. A fragrant grass usually called Cuscus. Andropogon muricatus. (Watts.) Same as ఆవురుగడ్డివేరు, ఆవురువేరు, విడవలివేరు, ఉశీరము. లామజ్జకము. వట్టు or వట్టిపోవు vaṭṭu. v. n. To dry, become dry, be drained. నీరు ఇంకు, నీరు ఎండిపోవు. ఇంకు. To become lean, కృశించు. n. Drying up, draining, నీరువట్టిపోవడము. A dried vegetable, వరుగు. A scab, ఎండినపక్కు. A hoop, కొయ్యకుగాని దూలమునకుగాని బలమిచ్చుటకు వేసిన కట్టు. A limit, మేర. ఇంతవట్టు thus far, ఇంతమట్టుకు. 'అనుజులదనయులమత్వరిజనులను సమయించివారుసమరోల్లాసంబున మెరయజూడనేర్తు రెజననాధున కింతవట్టుసంజయచెపుమా.' M. IX. ii. 16.
వాటు
(p. 1149) vāṭu vāṭu. [Tel. from పడు and పాటు.] n. The act of throwing. వైచుట. A blow, stroke, దెబ్బ. A mode, manner, way, fashion, విధము. రీతి. Convenience. కత్తివాటు an ineision or cut. 'మాయయామాటకు మారుత్తరంబు వాయెత్తగాలేక వాటు దప్పినను, జోహారు వన్నట్లు.' L. vii. 77. Turning over, upsetting. బండి వాటుపడును the cart will upset. వాటుగాలు vāṭu-gālu. n. A lame leg, a leg that has a convulsive twitch in walking. వడవడములో పక్కవాటుగా పోయేకాలు. 'వాటుగాలును రోలువంటినడుము.' HK. iv. 143. 'వాటుగాలనరాదుచేటుదెచ్చు.' S. ii. 20. వాటుగాలు వేసుకొనుచు వచ్చినాడు he came twitching along or limping. వాటురాయి vāṭu-rāyi. n. A stone for slinging, a pebble or stone that could be easily flung at a person, రువ్వడమునకుతగిన రాయి. 'ద్వి ఒలకులబూడిదెయును వాటురాలు.' BD. v. 680. వాటులాడు vāṭul-āḍu. v. n. To fight, కొట్లాడు. వాట్లీడు vāṭl-īḍu. n. A quarrelsome man, కొట్లాడువాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83586
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79344
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63494
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57657
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39140
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38201
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28486
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28162

Please like, if you love this website
close