Telugu to English Dictionary: వాండ్లు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగు
(p. 25) agu agu. [Tel.] (commongly written అవు), v. To be, to become, to prove to be. The present p|| is అగుచు, or అవుచు as అగుచున్నాడు or అవుచున్నాడు he is becoming. మిక్కిలి సిరి అగును much fortune will result. The past p|| is అయి as దొంగ అయి turned a rogue, become a thief. The root in A of అగు is కా as అట్లా కారాదు it cannot happen so. Aorist p|| అగు, అగునట్టి, అయ్యే, అయ్యెడి as క్రూరుడగు cruel. శాలివాహనశక వర్షంబులు 1466 అగునట్టి క్రోధి సంవత్సర కార్తీకశుద్ధ 5 శనివారము Saturday the 5th of the bright fortnight of the month Kārtika in the year Krodhi 'which is' the year 1466 (of the Salivahana æra.) ఇది దొంగతనము అయ్యేపనిగనుక as this is a matter in which a man might prove a rogue. Past Rel. p|| అయిన as నాది అయిన గుర్రము a horse of mine. The imperatives are కమ్ము plu. కండి. Causal forms కాజేయు or కావించు. Negative aorist కాదు, &c. అగుర = అగను+ర = అవును. It is so. 1. To be, to become, as కాకి కోకిలయగునె can a crow become a cuckoo? వాడు ఏమయినాడు what has become of him? దొంగ అయినాడు he proved to be a thief. వాడు నేరస్థుడైనాడు he was found guilty. ఆ పని అవును కాకపోవును that undertaking may or may not be accomplished. వానికి ఆకలి అవుతున్నది he is hungry. ఇట్లు రాత్రియగుట as it was now night. బాలుడగుట as he is but a child. 2. To be made, to be finished, to be spent or expended, to elapse, as పని శీఘ్రముగా కావలెను the work must be done soon. వివాహమగుము marry her. ఆ పెండ్లి అయినది the marriage took place. భోజనమయినది dinner is over. రాజదర్పనమయినది I got a sight of the king. అయినదాన్ని చూపు shew what has been done. ఆ పని అయినది the work is over, it is done. కావచ్చినది it is nearly done. రూకలు అయిపోయినది the money is expended. సంవత్సరము అయినది a year has passed. నెల అవుతున్నది it is about a month since. అర్థమయినదా do you understand it? సాకు భావముకాతేదు I do not understand it. భావముయనది I understand it. స్నానము కావించు to bathe, or to cause to bathe. తీర్పుకాలేదు no decision has been given. మ్రుచ్చిలితెచ్చుట మగతనం బగునె is it a manly thing to steal? 3. To be proper or fit, to be agreeable, as ఇచ్చట నుండనగునే మనకు is it fit for us to remain here? కాని పని an improper or unbecoming act. అట్లా చేయనవునా is it right to do so? పగలు కాచినపాలు ఆ రాత్రికి అవును milk boiled the same day is fit for use that night. అతనికీ నాకు కానందున as we are not on good terms. అయినవాండ్లున్ను కానివాండ్లున్ను friends and enemies. 4. To grow, as ఈ తోటలో ఏమి అవుతవి what is grown in this garden? ఇక్కడ వరి కఅదు rice does not grow here. 5. (Governing a dative) To stand in relation, as వాడు నీకేమవుతాడు how is he related to you? నాకు కావలసినవారు my relations. వానికి మేము ఏమీకాము we are in no way related to him. 6. Added to some nouns it gives them a verbal significance, as వారు ఎప్పుడు ప్రయాణమవుతారు when will they start or set out? విభాగాలు అయి వేరింటి కాపురము చేస్తున్నారు they seperated and live apart.
అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అడ్డము
(p. 38) aḍḍamu or అడ్డమైన aḍḍamu. [Tel.] adj. Cross. నన్ను అడ్డమైన మాటలు ఆడినాడు he reviled me. అడ్డమైనకూళ్లు any food that comes to the hand. నాకు అడ్డమైనపని పెట్టుతున్నాడు he employs me in anything that comes to hand. వాడు అడ్డదోవలు తొక్కుచున్నాడు he goes the wrong way to work. అడ్డకట్ట aḍḍa-kaṭṭa. [Tel.] n. A dam or bank, an embankment. సేతువు, చేలకు నీళ్లు నిలిచేటందుకు కట్టిన గట్టు. అడ్డకత్తి aḍḍakatti. A broad sword. పట్టిసము. అడ్డకమ్మి aḍḍa-kammi. A cross piece, the cross selvage in cloth. అడ్డకర్ర aḍḍa-karra. A cross-piece of timber: an obstacle: a bar. విఘూతము. నా పనికి అడ్డకర్రలు వేయుచున్నాడు he throws difficulties in my way. See అడ్డము. అడ్డగోడ addagōḍa a cross-wall. అడ్డచాపు aḍḍa-tṣāpu. A cross beam. అడ్డవాసము. అడ్డతల aḍḍa-tala. A narrow projecting head: having a narrow fore head. నిడుపు తల. అడ్డదూలము aḍḍa-dūlamu. A cross beam. అడ్డదోవ aḍḍa-dōva. A crossway. అడ్డపలక aḍḍa-palaka. A cross plank. అడ్డపట్టె. aḍḍa-paṭṭe. A thick board drawn by two oxen used for smoothing a ploughed field after the grain is sown. మడిసమముచేసే మాను. అడ్డుపడు aḍḍa-paḍu. [Tel.] v. n. To interpose, to help; to obstruct, impede. విఘూతమగు, వారించు. నా పనికి అడ్డుపడ్డాడు he threw obstacles in my way. భార్యను కొట్టబోతే కొడుకు అడ్డుపడినాడు as he was going to strike his wife his son interposed. నేనడ్డపడకపోతే వాండ్లు వత్తురు had I not interposed they would have died. అడ్డపాటు aḍḍa-pāṭu. [Tel.] n. Obstacle, hindrance, obstruction. అడ్డి, విఘ్నము. అడ్డబాస aḍḍa-bāsa. n. A nose jewel. బులాకి. అడ్డబొట్టు aḍḍa-boṭṭu. A cross mark worn by the Hindus on their fore-head. అడ్డమాను aḍḍa-mānu. A cross bar. వాడు అడ్డవాట్లు వేస్తున్నాడు he throws impediments in the way.
అయి
(p. 76) ayi (past p|| of అగు to become.) Having become, turned into. మాకు అయి నిలిచినాడు he stood like a post., i.e., he has transfixed with surprise &c. దొంగ అయి తిరుగుతున్నాడు he has turned thief. పోకిరి అయిపోయినాడు he has become a wicked fellow. అయిన (past rel. p|| of అగు to become.) Accomplished, becoming, agreeable, suitable. అయినపని a work that is accomplished, a becoming art. అయిన పెండ్లాము a good wife. అయినమందు a suitable medicine. అయినమనిషి a useful or proper man. అయినవాండ్లు friends, relations. See కాని. అయిన is also used to change nouns into adjectives as సొగసైన పిల్ల, ఆశ్చర్యమైన కార్యము a wonderful deed. For other uses, see under ఐన.
అసము
(p. 101) asamu asamu. [Tadbhava form of Skt. యశము] n. Fame, reputation, renown, power, influence, authority, opportunity. కీర్తి, ఉద్రేకము, యశము, అధికారము, బలము, సందు, ఎడము. 'కులగిరిపైనుండి కుంభిని మీదికసమున నురుకు సింహంబుచందమున.' H. D. ii. 2069. తన పనివాండ్లకు అసము ఇచ్చియున్నాడు he has given all his authority to his servants, he has given up the reins to them. మొగుడు అసమిచ్చినందున అది యింత త్రుళ్లుచున్నది she is so conceited as her husband has given the management of things into her hands.
ఆడ
(p. 111) āḍa āḍa. [Tel. corrupted from ఆడు] adj. Female. ఆడగుంపు a mob of women. ఆడకండ్లదానను I am a timid woman ఆడకూతురు a woman. ఆడతనము āḍa-tanamu. n. Womanishness, weakness. ఆడది āḍadi. A woman; plural ఆడవాండ్లు or ఆడవాండ్రు ఆడపడుచు āḍa-paduṭsu. A girl, a young woman. ఆడపాప āḍa-pāpa. Girl. A lady in waiting, a handmaid. ఆడమనిషి āḍa-manishi. A woman.
ఆది
(p. 114) ādi ādi. [Skt.] n. The beginning. మొదలు Also, an aim గురి. ఆదిని at the beginning, at first. ఆదిముని an ancient prophet. ఆదిశేషువు ādi-ṣēshuvu. [Skt.] n. The old dragon, who is worshipped as the supporter of the earth. ఆది, ఆదిగా ādi. n. Etcetera. వాని గృహాదులు his house, &c. మన్వాదులు Manu and others. ఉత్తరాది నుంచి వచ్చినారు they came from the north. ఉత్తరాదివాండ్లు people of the north. దక్షిణాది సరుకులు goods imported from the south. ఆదికము ādikamu. n. Etcetera. అన్నాదికములు food, &c. ఆదికొను ādi-konu. v. i. To have one's eye on కన్ను వేయు 'వృషభమున కాదికొను బెబ్బులియుంబోలె.' భార: విరాట. v. ఆద్యంతములు (ఆది+అంతము) first and last. ఆద్యంత రహితుడు He who is without origin and end. God.
ఇప్పుడు
(p. 137) ippuḍu ippuḍu. [Tel. ఈ+పొద్దు] n. Now, this time. ఇప్పటి of this time. ఇప్పటిపని the present business. ఇప్పటివాండ్లు the people of these days. ఇప్పుడే వచ్చినాడు he is just come.
ఇరలవాండ్లు
(p. 138) iralavāṇḍlu irala-vānḍlu. [Tel.] n. Name of a jungle tribe.
ఉప్పళము
(p. 165) uppaḷamu uppaḷamu. [Tel. from ఉప్పు] n. A salt marsh. The soil where salt is manufactured. ఉప్పళపువాండ్లు salt manufacturers.
ఒడ్డె
(p. 209) oḍḍe oḍḍe. [Tel.] n. Drudgery: mean toil. As a proper name ఒడ్డెదేశము, or ఒఢ్రదేశము Orissa. ఒడ్డెవాండ్లు tank diggers, navvies.
కందాచారము
(p. 225) kandācāramu kandācharamu. [H and K] n. The native militia కట్టుబడివాండ్లు adj. Military దంగుసంబంధమైన.
కడ
(p. 234) kaḍa kaḍa. [Tel.] n. A place, quarter, or direction. దిక్కు, పార్శ్వము. The end, extremity అంతము. Distance దూరము. Proximity, సమీపము. ఇరుగడ on both sides. కట్టకడ at the very end. కడకు at last చివరకు. వెలిగడ dry ground. పరగడ a neighbouring field. తలగడ a pillow, being the place of head. చెట్టుకడ at the tree. అతని కడకు వచ్చిరి they came to him. కడ adj. Last. అంత్యము కడసారి the last time. కడ (affix) By, near, at. In the hands or possession of. అది నాకడనున్నది I have it by me. వాని పాదాలకడ పడినారు they fell down at his feet మావాండ్లకడ ఆ మర్యాద కద్దు it is the custom with us, or among us. ౛ాముపొద్దుకడ at sunset. పెందలకడ early. రేపకడ in the morning. కడకుపోవు or కడగాపోవు kaḍaku-pōvu. To be menstruous. కడకన్ను kaḍa-kannu. n. The corner of the eye. క్రేగన్ను, కటాక్షము. కడకంటచూచు kaḍakaṇṭa-ṭsūṭsu. v. n. To glance, view sidelong, to look askance. కడకొరివి kaḍa-koravi. n. A fire brand not quite burnt up కాలగా మిగిలిన కట్టె. కడగా kaḍa-gā. adv. Aside, away. కడలేని kaḍa-lēni. adj. Endless. కడవాడు kaḍa-vāḍu.n. A stranger అన్యుడు. The last male child కనిష్ఠుడు. కడసారి kada-sāri. adj & adv. Last, the last time.
కలియు
(p. 258) kaliyu or కలియు kaliyu. [Tel.] v. n. To mix, join, mingle. To collect, assemble. To coalesce. To agree, correspond, match. To be included in, to fall under. To set to work, being to do. దిక్కులు కలియచూచి looking all round. దృష్టి కలిసినప్పుడు when our eyes met. అతనిభూమిలో కలిసినస్థలము a spot included in his land. ఆ దారి ఇక్కడ కలియుచున్నది that road meets here. సభ కలిపినది, or సభ కలిసిపోయినది the assembly has broken up or adjourned: కలియగలుపు kaliya-galupa n. Familiarity, affability. కలియగలుపుగానుండే familiar, easy, affable. కలియబడు kaliya-baḍu v. n. To meddle with. To rush, fall (upon enemies) వాండ్లు మామీద కలియబడ్డారు they rushed upon us. To become entangled. 'అరుతసరులుకలియంబడుచు.' B. viii. 457. కలియబెట్టు. kaliya-beṭṭu. v. a. To mix, to stir.
కురువ
(p. 298) kuruva , కురుమ or కురమ kurupa. [Tel.] n. Long wool. కురుమగొర్రె or కురుపగొర్రె a sheep with long wool. కురుమవాండ్లు, కురుపగొల్ల or కురుమగొల్ల a caste of shepherds who weave blankets.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83785
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79479
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63525
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57788
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38231
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28181

Please like, if you love this website
close