Telugu to English Dictionary: అక్కడికి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంత
(p. 9) anta anta. [Tel.] n. Whole; adj. So much. adv. Then, afterwards. నీ వెంత అడిగితే అంత యిస్తాను I will give you as much as you ask. అంతకంటె then that. అంతకంత as much again. అంతకంతకు by degrees; more and more. అంతకుముందు before that. అంతమంది so many men. అంత. మందిలో among so many persons. అంతమట్టుకు so far, thus far. అంతమాత్రము only so much అంతసేపు so long. అంతలో in the mean time. మూడంతలు three times as much. అక్కడికి పోయినంతలో on his going there. వాడు తనంతనే వచ్చినాడు he came of his own accord. అంతవాడు లేడు. there never was such a man. రాజంతవాడవు thou art equal to the king. నాయంతవాడు my equal, one like me one as tall as I am. అంతే అవును. that probably is the case నిద్రలేచినంతలో when he rose from sleep, as soon as he awoke. నేను తెలిసికొన్నంత as much as I know అంతపని such an act.
అక్కడ
(p. 19) akkaḍa akkaḍa. [Tel. from అ+కడ = that place.] adv. There. ఆ స్థలమందు. అక్కడి of that place. అక్కడక్కడ here and there. అక్కడికిన్నీ సమ్మతించనందున as he would not even yet consent.
అని
(p. 52) ani ani. [Tel.] (Past p|| of అను to say) Having said. This is translated by the word 'That' or 'so' or the infinitive mood is used, as వారు అక్కడ ఉండినారని అన్నాడు he told me that they were there. అవతల వెళ్లరాదని తిరిగీ వస్తిమి we did not think it right to go on and returned; we thought we must not go further; so we came back. నన్ను పొమ్మని చెప్పెను he told me to go. తన సొమ్మని యెంచి considering it his own. దాన్ని నాకని కొన్నాడు he bought it for me. కావలెనని అక్కడికి పోయినాడు he went there on purpose. పండ్లను పటపటమని కొరికినాడు he gnashed his teeth. ఘమ్మని fragrantly. తళుక్కని brilliantly. గడగడమని మాట్లాడినాడు he spoke rapidly. ఈగలు జుమ్మని ముసురు కొన్నవి the flies covered it buzzingly. నీవు ఈ శాలువ కప్పుకొంటే గుమ్మని ఉండును if you wear this shawl it feels warm: or, you will feel warm.
ఉద్యాపనము
(p. 159) udyāpanamu ud-yuktamu.[Skt.] adj. Attempted. Zealous, resolved, determined. ఉద్యోక్తుడు He who is ready or prepared. యత్నించువాడు, సిద్ధముగానున్నవాడు. అక్కడికి పోవలెనని ఉద్యోక్తుడై being about to go. జాబు వ్రాయుటకు ఉద్యోక్తుడనై when I was going to write the letter. క్రూరమైన పనికి ఉద్యుక్తుడై ready to do a cruel deed.
తీరు
(p. 535) tīru tīru. [Tel.] v. n. To end, stop, cease, elapse. To be finished, ended, complete, or ready. To be paid, delivered, discharged, avenged. To be qualified, accomplished, finished, adorned, trim, decked. To be gratified, satiated, wreaked (as passion;) to be assuaged or allayed, to go off. ముగియు, చిక్కబడు. తనివితీర to the full; so as to satisfy one's desires. తీరలేదు it came to nothing, it was ineffectual. కోరికతీసి having gained his end. ఇది నాచేత తీరదు this is out of my power. నాకు తీరీతీరక ఉన్నది I am hardly at leisure. తీరిపోవు to die. To be practicable, or possible. అక్కడికి రాతీరదు I cannot come there, I have not leisure to come. రాకుంటే తీరదు (you) must positively come. వెళ్లక తీరదు I cannot help going. తీరినగుండెగా నున్నాడు he is quite hackneyed. తీరా tirā. (Root in A of తీరు, with the intensive affix ఆ) adv. Ultimately, at last; fairly; just, merely, in short, simply. తీరా మధ్యాహ్నమయ్యేటప్పటికి when it was high noon. ఆ గోడ తీటా పడ్డది the wall actually fell down. తూరా పండుకొనేటప్పటికి when he was fairly asleep. ఆ సంగతి తీరా బయటపడేటప్పటికి when the matter at last became known. తీరా చెల్లించెను he paid it in full. తీరిక or తీరికె tīrika. n. Leisure. పనిలేక యూరకుండుట. తీరికచిక్కిన having no leisure. Adorning, trimming, decoration. దిద్దడము. తీరిన tīrina adj. Full. finished, accomplished, cured, settled. తీరు. n. Manner, way, mode, fashion, style, arrangement, విధము. Beauty చక్కన. వాడు బకతీరుమనిడషి he is an odd man. వాడుబకతీరుగానున్నాడు ఒకతీరుగానున్నాడు he is but so and so, he is not well, he is not at ease. ఈ తీరు thus. తీరుతప్పి ఉన్నాడు it is all over with him. తీరుగా tirugā. adv. Properly, duly, aright. దాని ముక్కుకండ్లు తీరుగానున్నవి her nose and eyes are pretty. తీరుగడ or తీరుదల tīru-gaḍa. n. Ending. ముగియుట. తీరుపు or తీర్పు tīrupu. n. End, finishing. A decision, judgment, sentence, decree. తీర్పుచెప్పెను he gave his decision. Justice. న్యాయము. Setting right చక్కబాటు. తీరుపరి or తీర్పరి tīrup-ari. n. A judge. న్యాయాధిపతి. An agent or ambassador చారుడు. A superintendent. అధికారి, కార్యనిర్వాహకుడు. తీరుపడు to be destroyed నశించు. తీరుబడి tīru-baḍi. n. Leisure. సావకాశము. తీరుపాటు tīru-pāṭu. n. A settlement, payment. Leisure. తీరుపాటుగా నుండే unoccupied, at leisure. తీరుమానము or తీర్మానము tīru-mānamu. n. An ending, settlement, rectification. Pause. A decision, resolve. తీరుమానించు or తీర్మానించు to settle, to come to a decision. తీరువ tīruva. n. A settlement, discharge, payment. Duty, dues, fees. గడ్డతీరువ levelling the ground. తీరుపవేయు or తీరువకట్టు to levy a fee or contribution. తీరువజాస్తి tīruva-jāsti. [H.] n. An additional or supplementary assessment నిర్ణయించబడిన పన్నుకంటె పైగా కట్టినపన్ను. తీర్చు, తీరుచు, తీరుపు or తీర్చు tīrṭsu. v. a. To end, finish. To do with, accomplish, perform or play (his part,) go through. ముగించు. To order, arrange. చక్కబరుచు. To cool, quiet, assuage. To adjust, liquidate (a debt). To trim, deck, adorn, straighten, correct, rectify, regulate. దిద్దు. To set, place, draw (as the mark on the forehead). To pass (time, day, or night). To pay give or issue (wages or batta). To settle. To determine, to resolve, to decide. To do away with. పొపు, తొలగించు. To destroy నాశముచేయు. వాయసముతీర్చినది the crow gave a good omen (by crossing my path from left to right.) కోపమునుతీర్చు to revenge oneself, wreak one's anger. చలముతీర్చు, పగతీర్చు to satiate spite. దాహముతీర్చు to quench thirst. తమిదీర్చి satiating one's lusts. వాని పని తీర్చినారు they settled his business or they ruined him. తీర్చుకొను tīrṭsu-konu. v. a. To end, do away with. To settle or pay up as a debt, &c. తీర్పించు tīrpinṭsu. v. a. To cause to decide, or determine.
దయ
(p. 581) daya daya. [Skt.] n. Favour, kindness, grace, regard. Love, affection, attachment. Mercy, pity, tenderness, clemency, compassion. Pleasure, goodness, amiability, a kind heart. కృప, కనికరము. తమ దయ ఎట్లో అట్లు just as your honour pleases. మీదయ thank you. దయచేయు daya-chēyu. v. a. & n. To grant, bestow, allow, give ఇచ్చు. అనుగ్రహించు. To honor or favour with (something) కరుణించు. To come or to go. అక్కడికి దయచేస్తారా will you be pleased to come (or go) there? ఇది దయచేయండి oblige me with this, be so good as to grant me this. దయతప్పిన dayu-tappina. adj. Displeased, disgraced, out of favour ఆయన దయ నామీద తప్పినది. I lost his favour. దయారసము dayā-rasama. n. The spirit of love. Lovingkindness, humanity, benignity, indulgence. దయాళుత్వము dayāḷutvamu. n. Benignity. సర్వదయాళుత్వము universal beneficence, goodness to all creatures. దయాళువు or దయాశాలి dayāḷuvu. n. A kind, gracious, merciful person. కనికరముగలవాడు.
పని
(p. 708) pani pani. [Tel.] n. Work, a task. కర్మము. Business, employment, వ్యాపారము. Workmenship, శిల్పము. ఈ కట్టడమునందు మంచిపని చేసియున్నారు there is good workmanship in this building. An affair, act, matter. Service, utility, purpose, object, intention, design. ప్రయోజనము. An order, duty, నియోగము. పనిమీద ఉన్నాడు he is busy. మంచిపని very well, well, good. మంచిపనిచేసినావు you did well or right. అతని పనిచూస్తున్నాను I am engaged in his service: I am acting for him. అతనిపని తీర్చినారు they settled his business, or they killed him. ఇక్కడ నీకేమిపని what business have you here? This word is sometimes omitted in translating; as in నీపనిపట్టిస్తాను I will punish you. ఇంతపనికి నన్నేల వెంటబెట్టుకొనివచ్చినావు why have you brought me for such a trifle or pretence? పనికిమాలి (or) పనిచెడి కూర్చున్నాడు he is sitting idle. వారు వ్యాధిచేత పనిచెడిరి they became infirm through illness. వానితో విరోధము పనికిరాదు he will not stand quarrelling. దాన్ని సంపాదించడము ఎంతపని it is no great matter to get it. నాపని చెరిపినారు they spoiled my work. పనిచెరువుకథలు idle stories. పనికి వచ్చే useful. పనికివచ్చే పిల్లకాయ a promising boy. పనికిరాని or పనికిమాలి useless. అక్కడికి నీవు ఏపనిమీద పోయినావు useless. అక్కడికి నీవు ఏపనిమీద పోయినావు about what business did you go there? నీపనిని నీవు చూచుకొనుము mind your own business. అక్కడికి పోవలసినపనిలేదు there is no need of going there. ఇప్పట్లో వానిపని యిట్లు ఉన్నది he is now in this state. అట్లు చెప్ప పని లేదు there is no need of saying so. పనిగొను pani-gonu. v. a. To undertake a work, to engage in a business. పూనుకొను. To employ, నియోగించు. 'పనిగొనవుతెలియగ బరికించి చూచిన.' Vēma. పనితనము pani-ta-namu. n. Workmanship, elegance. పనితనముగల ఒక మంచము a handsome bed. పనితొడవులు pani-toḍarulu. n. Worked or embossed jewels. పనిపడు or పనివడు pani-paḍu. v. n. To busy oneself with. to engage in, పూనుకొను. To concern oneself with, అక్కరపడు. పనివడి or పనిపడి pani-paḍi. adv. Intentionally. కావలెనని, ప్రయత్నపూర్వకముగా. 'పరులను పనిపడి దూషించెనేని పాపము వచ్చున్.' V. P. iv. 249. పనివాటులు jobs, work. పనిముట్టు or పనిమటము pani-muṭṭu. n. An instrument, tool, impelement. కొరముట్టు, ఉపకరణము. 'పనిమటములుగొంచు పయనమైరండు.' Pal. 314. పనివంచు, పని పంచు or పనిగొను pani-vanṭsu. v. a. To command. నియోగించు. పనివాడు pani-vāḍu. n. A servant: a good workman. పనివిను pani-vinu. v. n. To obtain permission, to take leave. To proceed, to go or come. 'దేవర కీర్తి వెక్కసంబుగ జెప్పవిని చూడగోరి, పనివిని నేను మాభాగ్యంబుకతన.' H.D.i. 847.
ప్రయోగము
(p. 837) prayōgamu pra-yōgamu. [Skt.] n. An application, use or employment, as of a weapon, tool, word, or a spell. Administration of a medicine, నడుపుట. A usage. In grammar, a voice. కర్తృ కర్మ క్రియల కూడిక. మహాబిల్వాదిప్రయోగము a prescription of Bilwa and other drugs. దీనికి కాళిదాస ప్రయోగమున్ణది Kalidasa has used this word. యక్షీణీప్రయోగముచేయు to bewitch or send a devil into (a person.) ఈ ఔషధప్రయోగముచేసినాడు he administered this medicine. విషప్రయోగముచేసి చంపినాడు he killed him by means of poison. బాణప్రయోగముచేసినాడు he used an arrow, i.e., discharged it. ప్రయోగించు pra-yōginṭsu. v. a. To use, practise, administer; use, as a weapon. ఉపయోగించు. ప్రయోజకుడు pra-yōjakuḍu. n. One who uses. The original instigator of any act. A clever man, a genius. కార్యమును నెరవేర్చువాడు. వాడు శుద్ధ అప్రయోజకుడు he is quite a useless person. ప్రయోజనము pra-yōjanamu. n. Use, advantage, profit. A thing to be kept or observed, as a holy day, or a feast పండుగ. An affair, business. కార్యము. A cause, motive. హేతువు. శుభప్రయోజనము a happy occasion (as a wedding.) రేపు మాయింట్లో కొంచెము ప్రయోజనము గనుక రావడానికి వల్లలేదు I cannot come to-morrow as there are some rites to be observed at home. అక్కడికి నీవుపోయినందుకు ఏమి ప్రయోజనము what is the use (good, or advantage) of your going there? ప్రయోజనప్రస్తుతములకు వారిని మేముపిలువడములేదు we do not invite them to parties. In Grammar, ప్రయోజ్యకర్త the indirect agent (in the instrumental case.) ప్రయోజకకర్త the direct agent (in the nominative case.)
బెట్టు
(p. 897) beṭṭu beṭṭu. [Tel.] n. Hardness, difficulty, trouble. Respectability, esteem, regard. గౌరవము. హెచ్చు, ఉద్ధతి, అతిశయము. 'నిన్ను పట్టెదమని చలముకొనినపట్టుటబెట్టా.' B. X. 359. నీవు అక్కడికి పోతే బెట్టుదక్కదు if you go there you will not meet with honor, you cannot go there with credit. adj. Hard, trying, కష్టము. Proud, ఉద్ధతమైన. adv. Excessively, violently, much. మిక్కుటముగా, మెండుగా, అత్యంతము. Firmly, గట్టిగా, దృఢముగా. నిండా బెట్టుగానున్నది it is very hard (on us), మిక్కిలి కష్టముగానున్నది. బెట్టుడుత beṭṭ-uḍuta. n. The large or great squirrel. 'పికిలిపిట్టలు, డేగలు, బెట్టుడుతలు.' S. i. 187.
మేలు
(p. 1031) mēlu mēlu. [Tel.] n. Good, kindness. ఉపకారము. Good fortune, prosperity, favour, happiness, క్షేమము, శుభము. Profit, advantage, లాభము. Righteousness, పుణ్యము, సుకృతము. Excellence, superiority, విశేషము. Love, మోహము. Pride, మదము. 'చదువుల మేలులేదొ.' P. iv. 119. అక్కడికి పోతే మేలు it would be better to go there. అదేమేలు so much the better. మేలెరుగు to be grateful, remember kindness. కీడుమేలు తెలిసినవాడు one who knows good and evil. 'మేలుకలిగేవాడు in time of prosperity. 'తత్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలుభూవరా.' Bhārat మేలు or మేలి adj. Upper, higher. ఉపరి, అధికము, పై. Good, better. Noble, fine, excellent, superior, శుభమైన, శ్రేష్ఠమైన. మేలుమిద్దె an upper storey. 'లోపలియంతస్తులోని మేల్మిద్దె.' Sārang. D. 113. మేలుగోడ the top wall, battlement, parapet or rail wall. మేలుముసుకు the outer cover. మేలుమాట or మేలువార్త happy news. adv. Up, above, over, మేలు or మేలుమేలు interj. Well done! excellent! better and better! జయ, జయ జయ. మేలుకట్టు mēli-kaṭṭu. n. An awning, a canopy. వితానము. 'మేలిమిమీరగా మేలుకట్టులుగట్టు, రమణీయ చీనాంబరములుగట్టి.' N. ix. 124. మేలుకమ్మిచీర mēlu-kammi-chīra. n. A cotton cloth woven with a coloured border three inches broad. మేలుచెయ్యి mēlu-cheyyi. n. Superiority. హెచ్చు, ఆధిక్యము. adj. Superior, హెచ్చైన. Victorious, గెలుపుగల. మేలుచెయ్యిగానుండు to prevail, to have the advantage. 'అట్లు తమవారు మేలుచెయ్యైన భంగివిని.' M. VI. ii. 2. మేలిమి mēlimi. n. Fineness, excellence. Pure gold. తప్త కాంచనము, అపరంజి. మేలిమి or మేలి adj. Fine, excellent. B. X. 207. మేలిల్లు mēl-illu. n. A upper storey, మేడ, సౌధము. మేలుకొను, మేల్కొను, మేలుకను, మేల్కను, మేలుకాంచు or మేల్కాంచు mēlu-konu. v. n. To awake, rise. To be aroused, stand on one's guard, be alert. నిద్రతెలియు, జాగ్రతపడు. మేలుకొలుపు mēlukolupu. v. a. To awaken. నిద్రలేపు. మేలుకొలుపులు mēlu-kolupulu. n. Matinsong, reveille, music in the dawning. సుప్రభాతములు. cf. 'the dulcet sounds at break of day, &c. మేలుకోలు mēlu-kōlu. n. The act of awaking, మేలుకొనుట. మేలుదురంగి or మేల్దురంగి mēlu-durangi. [H. dorangi] n. Fine velvet. Fine shot silk. ఒకవిధమైన చక్కనిపట్టు. 'పటికంపుమెట్లను జిగిరంగు మేల్దురంగి.' T. iv. 202. మేలువడు or మేల్పడు mēlu-paḍu. n. To fall in love, be enamoured, మోహిమచు, ఆశపడు. 'ఎవ్వనిచూచి మేలుపడితే యరవింద దళాక్షి.' Vijaya. iii. 37. మేలుబంతి mēlu-banti. n. The top line, the copy set to a schoolboy learning to write. A pattern, మాదిరి. One who is or sets an example; a paragon of excellence, an example, ఉదాహరణము. adj. Excellent, శ్రేష్ఠము, శ్రేష్ఠుడు, శ్రేష్ఠురాలు. 'మేదినీనాధులకునెల్ల మేలుబంతిగా బ్రవర్తింపకేల, దుష్కర్మివైతి.' Vish. ii. 116. 'నిజచరిత్రంబు భావిబూభుజులకెల్ల మేలుబంతిగవసుమతియేలుచుండె.' ib. vi. 63. మేలలుమచ్చు mēlu-maṭsṭsu. n. An upper storey, చంద్రశాల. మేలుమచ్చులు a kind of game played by boys. మేలురాసి mēlu rāṣi. n. The top part of a heap of winnowed grain. తూర్పెత్తిన ధాన్యపుసోగు. మేలువాడు mēlu-vāḍu. n. A lover, విటుడు, వలపుకాడు, మంచివాడు. 'అంతరాధకుమేలు వాడైమురారి.' A. v. 56.
మొత్తు
(p. 1038) mottu mottu. [Tel.] v. a. To beat, smite, thrash. కొట్టు. 'కత్తులుకేడెముల్ కరముల దాల్చి, మొత్తిదైత్యులశిరంబులుడుల్లగొట్టి.' Venkaṭāchala Maha. Page. 171. To cut, నరుకు. n. A blow, దెబ్బ. మొత్తించు to cause to beat, కొట్టించు. మొత్తులాడు mottu-l-āḍu. v. n. To fight, dispute or quarrel. కొట్లాడు. 'పుణ్యాహతండులములకు మొత్తులాడి.' A. vi. 91. మొత్తుపడు mottu-paḍu. v. n. To be beaten, కొట్టుపడు, కొట్టబడు. మొత్తికొను or మొత్తుకొను motti-konu. v. n. To beat one's own head or mouth in despair. To lament or wail. అక్కడికి పోవద్దని మొత్తుకొంటిని I entreated him not to go there. 'అసురుసురనుచు నడునెత్తి మొత్తుకొనుచు.' Jagann. ii. 63. మొత్తుకోళ్లు mottu-kōḷḷu. n. Lamentations, howling, outcries, wailing. ఏడ్పు, పెడబొబ్బలు.
వచ్చు
(p. 1122) vaccu vaṭsṭsu. [Tel.] v. n. To come, arrive. To happen, occur, take place. చేరు, సంభవించు, కూడు, ప్రాప్తమగు. రేపువత్తురు they will come tomorrow. నిన్నవస్తిమి we arrived yesterday. నాతో కూడావచ్చినాడు he accompanied me. మనసువచ్చినన్నికాగితాలు పుచ్చుకొన్నాడు he took as many papers as he pleased. నీ మనసువచ్చినట్టు చెయ్యి do as you please. This verb is used (like Come in all languages), in numerous senses. వచ్చేతేప next time. వచ్చేనెలలో in the next month. వచ్చేకడగండ్లు రాకమానవు the evil that must happen will happen. As an auxiliary, it is added to the present participle of any verb to denote long habit or continuance, as చదువుచువచ్చినాడు he continued to read. అట్లుచేయుచు వచ్చినాడు I have been doing so all along. అక్కడికి పోవుచువచ్చినాడు he used to go there. It is also joined to the past participle of the verb వలయు. ఇట్లు చేయవలసి వచ్చినది it became necessary to do so. It is added to the infinitive in A. ఇది మాకు తెలియవచ్చినది it came to our knowledge. నాకు బుద్ధిచెప్పివచ్చినాడు he went so far as to advise me. వచ్చు or వచ్చును (the third person singular aorist of వచ్చు) is used with the infinitive as an auxiliary signifying permission, possibility or probability. నీవు అక్కడికి పోవచ్చును you may go there. మేము రావచ్చునా? may we come? అట్లు కావచ్చును it may be so perhaps. రాదు (the neg. aor. 3rd person singular) means must not or cannot. నీవు అక్కడికి పోరాదు you must not go there. నేను చేయరాదు I cannot do it. అట్లా చెప్పరాదా can you not say so? Added to a dative, వచ్చు is used to mean To be got, gained, acquired, to be available. ఆ భాష వానికి వచ్చినది he has learned the language, he knows that tongue. ఈ బియ్యము నెల దినాలకు వచ్చినవి this rice lasted for one month. వానికేమివచ్చినది what happened to him? ఇయ్య మనసువచ్చినది he was inclined to give it. వానికి బుద్ధివచ్చినది he has learnt sense. వానికి మీసాలువచ్చినవి his whiskers have grown. దానికి మళ్లీ కండ్లు వచ్చినవి she has recovered her sight. ఆ బిడ్డకు పళ్లు వచ్చినవి the child has cut its teeth. ఇక్కడ సకారమునకు లోపము వచ్చినది there is an elision of the letter S. వానికి అన్నానికే లోపము వచ్చినది he is even in want of food. వానికి ఒంటికివచ్చినది he fell sick. ఇది పనికివచ్చును this will do, this will be useful. ప్రాణమునకు వచ్చే perilous, hazardous. ఇది నీ ప్రాణమునకు వచ్చును this will put your life in peril. నోటికివచ్చినట్టు వానికి తిట్టినాడు he gave them all the abuse he could think of. అతని పేరు నాకు రాలేదు I cannot recollect his name. ఆ పాఠము వానికి రాలేదు he does not know the lesson. వచ్చుబడి vaṭsṭsubaḍi. n. Income. ఆయతి. రాబడి. వానికి నిండా వచ్చుబడియున్నది he has a large income. వచురాములు vatstsu-rāmulu. (వచ్చుట+రామి.) n. Coming and not coming. వచ్చుటయును రామియును.
వలయు
(p. 1139) valayu valayu. [Tel.] v. n. To be liked, desired or wanted. ఇష్టమగు, విహితమగు. To be needful, or necessary, ఆవశ్యకమగు. To be proper, యుక్తమగు. To be surrounded, వలయతమగు. 'మృగమువలయంబారెన్.' పంచ. నా. ii. 'స్వబుద్ధిరాజుకు విశేషింపవలయు' (P. i. 391.) the use of his own judgment is much needed in a king. 'కయ్యమునకు నెయ్యమునకు వియ్యమునకు సమతవలయు.' (ib. ii. 47.) in combat, in inter-marriage, and in friendship equality is wanted; or, there should be a similarity. 'ఔగాములరయవలయు.' (ib. iv. 431.) you should look to the chances of gain or loss, of success or failure. వలె, వలెను, వలసినది or వలయును are added as auxiliaries, to the Root in the Infinitive of any verb; to give the idea of obligation or necessity; నేను ఇమటికి పోవలెను I must go home. నీవు ఇక్కడికి రావలెను you must come here, you should come here, I hope you will come here. తమదయ రావలెను మా దరిద్రము తీరవలెను I hope your favour will come and that my poverty will be removed. ఆయన రేపో ఎల్లుండో రావలెను he must be here tomorrow or the next day, i.e., we expect him here tomorrow or the next day. వాడు దానితమ్ముడుగా ఉండవలెను I suppose he must be her brother. నాకు ఆ పుస్తకము కావలెను I want that book. వాణ్ని చంపియుండవలెను they must have killed him. నీకు అట్లురావలెను this serves you right. నీవు సందేహింపవలసినదిలేదు you need not doubt it, there is no occasion to doubt it. వాణ్ని పిలువవలెనని అక్కడికి వెళ్లితిని I went there to call him. ఈ పని చేయవలెనని పోవుచుండగా as I was going there to do this. జగడమాడవలెనని వస్తివా did you come on purpose (or wanting) to quarrel? వలసి (the past p|| of వలయు.) ఇవ్వవలసి యిస్తిని I paid it, because I had to. 'నిశాచరునుద్యోగంబుచూచుకొనవలసి.' Swa. iv. 163. అట్లు చేయవలసివచ్చును it will become necessary to do so. వలసిన (past part of వలయు) is used as an affix (similar to the Latin-ibilis or endus). చెల్లింపవలసిన సొమ్ము money due, the sum payable. 'వ;సినసంపదల్ గలుగవా.' T. ii. 34. టీ వలసిన, కావలసినటువంటి. వలసె or వలసెను (the past tense of వలయు) it became necessary, or requisite. వానితో చెప్పవలసె I was obliged to tell him. 'వినిపింపరాని కార్యము వినిపింపగవలసె.' Swa. iv. 176. The negative aorist of this, వలవదు, వలదు, See under వలదు.
వల్ల
(p. 1141) valla valla. [Tel. another form of వలన.] A postposition used as a case ending in the 5th case of nouns and pronouns. By, by means of, from. వానివల్ల తెలిసినది I learned it from him or of him. ఈ మందువల్ల by means of this medicine. adj. Convenient, feasible, practicable, possible. యుక్తము, అనుకూలము. అది వల్లకాదు it is impossible. అక్కడికి పోవల్లలేదు you cannot go there. ఇరి లేకుంటే నల్లకాదు I cannot do without this. చెల్లిస్తేగాని వల్లకాదు you cannot avoid paying it. వాడు ఉంటేగాని వల్లకాదు I cannot do without him. నీవు వస్తేగాని వల్లకాదు your coming is indispensable, it cannot be done unless you come. చెప్పుకోక వల్లకాదు you cannot avoid explaining this. n. A stratagem, expedient, convenience. ఉపాయము, యుక్తి. వల్లపట్టుతప్పి పడినాడు he lost his hold and fell. ఎడమనల్లవాడు a left handed man, ఎడమచెయి వాటముగలవాడు. వల్లకాని valla-kāni. adj. Impracticable, impossible. అసాధ్యమైన. వల్లమాలిన valla-mālina. adj. Much, excessive; impracticable, అపరిమితమైన. వల్లగానుండు valla-ga-n-unḍu. v. n. To be convenient, practicable, possible, feasible. సాధ్యముగానుండు.
శని
(p. 1242) śani or శనైశ్చరుడు ṣani. [Skt.] n. The planet Saturn, or its regent. ఛాయాపుత్రుడు. శనిబాధ or శనివేధ the evil influence of Saturn. నాకాలిశని నేను అక్కడికి పోయినాను through the bad luck of my legs I went there. దానినోటిశని అది అట్లు చెప్పినది through the bad luck of her mouth she said so. నా శనివిడిచినది my bad luck has left me, i.e., my trouble is over. శనిచారము the evil influence of Saturn. శనివారము ṣani-vāramu. n. Saturday. మందవాసరము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149878
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113084
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95706
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close