Telugu to English Dictionary: viḍucu

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆర
(p. 111) āra āṭa. [Tel. from ఆడు] Play, sport, a game: a dance, acting or stage performance. Jest, joke, gambling. ఆటకత్తె, ఆటరి or ఆటది āṭa-katte. [Tel.] n. An actress or public dancer. ఆటకాడు āṭa-kāḍu. n. An actor or dancer. Also a gambler. ఆటగొర్రు āṭa-gorru. n. A rake used in husbandary. ఆటడిగ్గియ A swimming bath. ఆటతోట āṭa-tōṭa. a park. ఉద్యానవనము ఆటపట్టు āṭa-paṭṭu. n. An abode, residence, scene, place. ఆటపాక A playhouse, a theatre. ఆటవిడుపు āṭa-viḍupu. n. A school holiday or play day. ఆటవెలది āṭa-veladi. n. A species of metre ఆటాడు āṭaḍu. (ఆట+ఆడు) v. a. To play a play, to dance a dance, to act.
ఎగ
(p. 182) ega ega. [Tel. from ఎగయు] adv. Up, upward. ఎగగొట్టు ega-goṭṭu. v. a. To throw up, rob, to run away with. ఎగురజేయు, అపహరించు. ఎగగ్రోలు ega-grōlu. v. t. To suck up పీల్చు. ఎగజల్లు ega-zallu. v. t. To scatter upward. పైకి చల్లు. ఎగజేపు ega-jēpu. v. a. To keep in (the milk) or restrain it from flowing (as a cow does unless the calf is with her. ఎగదన్ను ega-dannu. v. t. To kick up. ఎగదీయు ega-dīyu. v. a. To lift or pull up. To raise. ఎగదువ్వు ega-duvvu. v. t. To comb upwards. మీదికి దువ్వు. ఎగదోయు ega-dōyu. v. t. To lift up, push up. ఎగమాడు ega-n-ūdu. v. t. To blow upwards, to disregard. పైకి ఊదు, తిరస్కరించు. ఎగనెత్తు ega-n-ettu. v. t. To lift up. పైకెత్తు ఎగబట్టు ega-baṭṭu. v. t. To hold up. ఎత్తపట్టు. ఎగబీల్చు ega-bīlṭsu. v. t. To snort aloud. ఎగఊపిరి ega-ūpiri. n. A gasp. ఎగబోత ega-bōta. n Spreading upwards, giving bad advice, rumination, a brown study, discontent. ఎగువకు వ్యాపించుట, దుర్భోధనచేయుట. వానికి చెమట యెగబోత దిగబోతగా నున్నది he was in a sweat from head to foot. ఎగబోయు ega-bōyu. v. t. To give bad advice. దుర్భోధచేయు to hint. మాచించు. ఎగబ్రాకు ega-brāku. v. i. To creep up, crawl up. మీదికి ప్రాకు. ఎగరో౛ు ega-rōzu. v. i. To breathe hard. ఎగరొప్పు ega-roppu. n. Breathing hard. ఎగవిడుచు ega-viḍuṭsu. v. t. To let alone. ఊరకవిడుచు. ఎగవేయు ega-vēyu. v. t. To embexxle, misappropriate. అపహరించు.
దిగ
(p. 592) diga diga. [Tel. from దిగు.] adv. Down. downwards. దిగబడు to go down, to sink. దిగజారు to slide down. దిగగాచు to distil. దిగదిగ diga-diga. adv. Rapidly, brightly. వేగముగా, ప్రకాశముగా, 'గీ అబ్జరుచిదూర్పు దిగదిగయుంచుమెరసె.' BD. v. 4, 14. దిగదీయు or దిగదుడుచు diga-dīyu. v. a. To take down. To disenchant, to avert a spell, or the evil eye, to expel a fiend. దిగదుడుపు diga-duḍupu. n. Waving a lamp to break a spell. Disenchantment, diga-drāvu. v. t. To drink down, to let go, to leave, విడుచు. v. n. To come down, దిగు. దిగనాడు diga-n-aḍu. v. a. To do away with or remove (sin.) To put (a fault) out of view. To lay (a vest) aside. To forsake or desert, విడుచు. దిగబట్టుకొను diga-buṭṭu-konu. v. a. To drag down. దిగబడు diga-baḍu. v. n. To get down. దిగు. To sink or give way. ౛ారు; to remain or be left behind, రాలేక దిగబడ్డాడు he stayed behind as he could not come. దిగబడిన పైకము an outstanding balance. ఈ కాగితము నాదగ్గిర దిగబడ్డది this paper remained in my hands. దిగబెట్టు diga-beṭṭu. v. a. To set out of view, set aside. To leave (a thing behind, through forgetfulness.) దిగబోత diga-bōla. n. Spreading downwards. దిగువకు వ్యాపించుట. వానికి చెమట ఎగబోతలు దిగబోతలుగానున్నది he perspires profusely. దిగరోజు diga-rozu. n. Panting. కుట్టూపిరి. వాడు ఎగరోజు దిగరోజులుగా పరుగెత్తుచున్నాడు he runs out of breath. దిగవిడుచు diga-viḍuṭsu. v. a. To throw aside or leave, to leave behind. విడుచు.
పోవు
(p. 822) pōvu pōvu. [Tel.] v. n. To go, proceed. To pass, cease, disappear. To be lost, to die. ఇంటికి పోయినాడు he went home. వానిదోవను వాడు పోయెను he went his way. వానితండ్రి పోయినతరువాత after his father's death. పదిదినములు పోయిన తరువాత after ten days had passed. వాన పోయిన తరువాత after the rain ceased. ఆ పుస్తకముపోయినది the book is lost. వాని కండ్లు పోయినవి he lost his eyes. చిల్లులుపోయిన చెంబు a mug that leaks. పదింటిలో నాలుగుపోతే ఆరు deduct four from ten and six remain. వాడు దానితోపోయినాడు he had (sexual) intercourse with her. Added to infinitives in A, it gives the signification of intent or futurity. వ్రాయబోతే వద్దన్నాడు when I was going to write he told me not to do so. దాన్ని కొట్టబోయినాడు he was about to strike her. వారెప్పుడు పోబోతారు when are they going to set out? చెప్పబోయేవుసుమీ take care, you don't mention it. Affixed to the past affirmative participles of many verbs, it denotes completeness: as ఆ గోడ పడిపోయినది the wall has fallen down. ఆ మాటలు ఇప్పుడు ఏటిలో కలిసిపోయినవి those words are now all forgotten; lit: gone into the river. వారక్కడనే ఉండి పోయినారు they settled there. Joined to negative participles it is used to form a past tense negative. రాకపోయెను he did not come. పోకపోయెను he did not go. వినకపోయెను he would not listen. పోవుదెంచు Same as పోవు. Also, to pass, as time, కడచు, పోదోయు pō-dōyu. v. a. To baffle, to push back, to thrust away. పోదోలు pō-dōlu. v. a. To drive off. పోనాడు pōn-āḍu. v. a. To drive off, to turn away, to abandon. To blame, censure, నిందించు, పోగొట్టు or పోగొట్టుకొను to lose. పోని pōni. (neg. part. of పోవు) who or which goes not. పోని దోషము a sin that cannot be removed or done away. లేనిపోని nonsensical. లేనిపోనిమాటలు foolish language. లేనిపోనిపని a foolish thing. లేనిపోనిదేవులు gods that are no gods. పోని. [for పోనిమ్ము.] imperative: Let it go, let it pass. Never mind. పోనొత్తు pōn-ottu. v. a. To do away, to remove. 'అయ్యుంతులు, చిత్తజుబాణములచేత సిగ్గంతయుబోనొత్తి మునిబెండ్లియాడగ తత్తరపడుటెరిగి.' Vish. v. 147. పోపడు pō-paḍu. v. n. To go, పోవు. 'క కోపంబునరాజుకొడుకు గుడ్డులు రెండుం, బోపడునట్లుగగోళ్లన్, వేపెరికి.' M. XII. iii. 243. పోబడి pō-baḍi. (పోవు+బడి.) n. A trace. ౛ాడ. పోబెట్టు pō-beṭṭu. n. A kind of noise expressive of love. అనురాగమువల్ల గలిగినధ్వని. పోము pōmu. (1st. pers. plu. neg. aor. of పోవు.) We will not go. పోరాని pō-rani. adj. Unavoidable, Friendly, loving, dear, ఆప్తమైన. పోరానిచుట్టము a dear relation. పోరామి pō-rāmi. n. Affection, love, friendship, స్నేహము. 'పోరేరారెప్రియంబుగల్గినజనుల్ పోరామిపోబోవునే.' Swa. iii. 173. 'ఆరాములలోనెప్పుడు, పోరాములుచాలనెరపి పురుషోత్తముడున్.' B. X. §. 59. Hardship, trouble, సంకటము. పోయిన pōyina. (past rel. p of పోవు.) Gone, departed, lost. Also, past, last, as పోయిన సోమవారము last Monday: పోయిన నెల last month. పోయివచ్చు pōyi-vaṭsṭsu. v. n. To take leave, to go, వెళ్లు. పోయివస్తాను farewell, goodbye. పోవిడుచు pō-viḍuṭsu. v. a. To abandon, give up, let go. మాను, వదలు.
ముడి
(p. 1000) muḍi muḍi. [Tel.] n. A knot. గ్రంధి. A knot of hair, వెండ్రుకలముడి. A knot or joint in wood, చెట్టులోనగువానిబుడిపి. The hump of an ox, ఎద్దు మూపురము. A quarrel, కలహము. A form of a letter written like a knot as మామిడి the letter ్మ నాముడి the letter ్న. తాముడి the secondary form of the letter త. i.e., ్త. An union, joining, సంధి. Also, another form of ముడ్డి. (q. v.) వాడు దానిని ముడిపెట్టుకొన్నాడు he tied the nuptial knot to her, he married her. ముళ్లుకత్తిరించేవాడు a pick-pocket. ఆమె తలముడి వీడినది her hair fell loose, the knot being untied. ముడివిప్పు to untie or open a knot. ఆ దారములో ముళ్లుపడ్డవి that string has formed into knots. ముడివక్కలు unbroken (or whole) areca nuts, గుంటపోకచెక్కలు. బొమలుముడిపెట్టు to knit the eye-brows. ఒకవ్యాజ్యమును ముడివేసి విడిచిపెట్టినాడు he cast a bone of dispute between them. 'పడంతిమది ముడిసడలన్.' Bhadra Parin. iii. 297. దాని మనసనేగ్రంధి వీడునప్పటికి. ముడి muḍi. adj. Closed, వికసింపని. Entire, whole, unbroken, ఖండముకాని. ముడిపూలు unblown flowers. 'ముడిపూలపొట్లముల్.' Illa. ii. 163. ముడి౛ొన్నలు the great millet enclosed in its husk. ముడినువ్వులు sesamum seeds which are not cleaned. ముడిపోక an entire areca nut. ముడిబియ్యము rice that is not well cleaned, చేబియ్యము. ముడికట్టు muḍi-kaṭṭu. n. Certain fees on a crop for the benefit of the landlord. A truss of straw, a sheaf. v. a. To tie a knot. To tie a knot in a man's cloth to remind him that you call upon him to be a witness. అందుగురించి పెద్దలు ముడికట్టినారు our anscestors have laid down this rule or held this doctrine. ముడికాడు muḍi-kāḍu. n. One who ties a knot, one who unites, సంధానముచేయువాడు. ముడికాళ్లు muḍi-kāḷḷu. n. Knock-knees. ముడికాళ్లవాడు a man who is knock-kneed. ముట్టికాళ్లవాడు. ముడికాళ్లది a woman who is knock-kneed. ముడికొక్కు muḍi-kokku. n. A weevil. నంగనాచి. ముడికొను, ముడిగొను or ముడిపడు muḍi-konu. v. n. To be tied in a knot. ముడికొన్న or ముడిగొన్న muḍi-konna. adj. Tied, bound. బద్ధమైన. 'ముడిగొన్న సంసారమోహబంధములు వెడదన్ని సుజ్ఞాని వెడలినమాడ్కి.' DRK. 372. ముడికొలుపు muḍi-kolupu. v. a. To cause to be tied in a knot. ముడిగిబ్బ muḍi-gibba. n. An ox, a bull, ఆబోతు. ముడిపంచె or ముడిబట్ట muḍi-panche. n. A plain cotton cloth without any coloured border. నెల్లాగుడ్డ. ముడిపడు or ముడిపడు muḍi-paḍu. v. n. To be tied in a knot, ముడిగలదియగు. To be united, సంధించు. To be entangled, పెనగొను. To be confounded, puzzled. చీకాకుపడు. 'ముడిపడెననియెడదంజిడి, ముడిపడకుడు.' N. vii. 312. 'మొగమున చీకట్లుముడివడ.' HD. ii. 1380. To increase, excel, అతిశయించు. To happen, కలుగు. ముడిపెట్టు or ముడివేయు muḍi-peṭṭu. v. a. To tie a knot. ముడిబొమ్మ muḍi-bomma. n. A kind of fish, Mastacembelus aennalus. ముడియ muḍiya. n. A knot. A bundle of straw or young plants ready to set. కట్ట, మూట. A wager, పందెము. ముడియవిడుపు muḍiya-viḍupu. n. A pick-pocket. ముళ్లువిప్పు దొంగ. ముడివాటు muḍi-vāṭu. n. The act of being tied in a knot, &c., ముడిపడుట.
విడు
(p. 1171) viḍu viḍu. [Tel.] v. n. To separate, become loose, వీడు. To fall asunder, తనకుతానేవదలు, వీడిపోవు, విరిసిపోవు. 'నీళ్లమీదబుగ్గ నిలిచిన యప్పుడు తళ్లువేగవచ్చితాకుగాక, వడెడుకుండకింత విభ్రాంతిపడుదురు.' Vēma. 70. v. a. To relinquish, leave, quit, abandon, give up, loosen, untie, undo, let go, release, separate, త్యజించు, మానుకొను, వదలు, విచ్చు. విప్పు, వీడ్చు, విడుగడ or విడుగర viḍu-gaḍa. n. Release, liberation. విడుదల, విమోచనము. 'ఉర్రిద్రెవ్వగొరికి యిప్పుడ వెరవారగనేనునీకు విడగరనేయం దొరకొనుట నీదుభాగ్యం బరితత్వము దొరగిమైత్రియలవరపు మదిన్.' M. XII. iii. 207. 'అన్యదేశ్యునధర్మువిడుము.' A. iv. 257. విడుగు viḍugu. v. n. To blow or expand, as a flower, వికసించు. 'ముడిగెతొగలడగెరిక్కలు విడిగె పయోజమ్ములుడిగెవెన్నెల.' S. I. 164. విడదొక్కు or విడద్రొక్కు viḍa-dokku. v. a. To allot, set aside, grant, as land. విడిచు ఇచ్చు. ఆయూరికింద నాయూరి పొలములో కొంతభూమి విడదొక్కినారు they allotted some land from one village to that village. విడనాడు viḍa-n-āḍu. v. a. To cast off, desert, quit, relinquish, divorce. విడుచు, విడిచిపెట్టు, వదులు. 'కూళగూళమెచ్చు గుణవంతు విడనాడి.' Vēma. 1752. విడబడు or విడవడు viḍa-baḍu. v. n. To escape, get free, break loose, వీడు, విచ్చలవిడియగు, కట్టువదిలించుకొని నిరంకుశముగానుండు, తెగనుండి వేరుపడు. నిర్భందమునుండి తొలగు. To slip, ౛ోరు.' అతని మహోద్దండగజము, తన్ను దామరచి మదగ్రస్తయగుచు. కడదిమావంతుని బడఝూళిచేసి విడివడిదండెల్ల విరియ దోలుచును.' B. D. iv. 352. అది విడివడిమాట్లాడినది she shook off all shame and spoke.
విడుచు
(p. 1172) viḍucu or విడ్చు viḍuṭsu. [Tel.] v. n. &a. To relinquish, leave, quit, abandon, give up, loosen, slacken, untie, undo, To cease, to terminate. చాలించుకొను, మానుకొను, వదలుకొను. ఆ చెట్టు నాలుగు కొమ్మలు విడిచినది that tree has produced four branches. వానవిడిచెను the rain is over. గ్రహణము విడిచినది the eclipse is now over. చీడవిడిచినది the plague has ceased. అంటువిడిచినది the impurity has passed away. దయ్యమువిడిచినది the demon has quitted him or let him go. క్రోధమునువిడిచినాడు he has laid aside his wrath. చేనిలో ఆవును మేయవిడిచినాడు he let the cow go to graze on the crop. ఆహారమునువిడిచెను he gave up eating. ప్రాణమునువిడిచెను he gave up eating. ప్రాణమునువిడిచెను he gave up the ghost. ఆమె కన్నీళ్లువిడిచెను she shed tears. బాణమువిడుచు to discharge a rocket. ఆ కోటును విడిచిపోయిరి they quitted the fort. తర్పణమువిడుచు to perform a certaian rite. పట్టినపట్టు విడువడు he will never let go his hold.కుమార్తెను అత్తవారియింట విడిచినాడు he left his daughter at the house of her mother-in-law. దినమువిడిచి దినము on alternate days, every other day. బట్టలువిడుచు to strip. ఊపిరివిడుచు to breathe. వారిని చెయ్యి విడిచినాడు he abandoned them. 'కొంగుకాసువిడిచిగొబ్బుననీరాదు.' Vema. 171. విడిచిపెట్టు viḍichi-peṭṭu. v. a. To relinquish, leave, quit, abandon, give up. To loosen, untie, undo, చాలించుకొను, వదలు. విడిపించు viḍipinṭsu. v. a. To loose, let go, release. విడిచిపెట్టు, వదలు, పోనిచ్చు. విడిపించుకొను viḍipinṭsu-konu. v. n. To escape, get free, break loose, విడివడు, వదలించుకొను. విడుత viḍuta. n. A time, తడవ. ఒకవిడుత once. రెండువిడుతలు twice. విడుదల, విడుపు, విడ్పు or విడుమర viḍu-dala. n. Release, liberation, setting at liberty, freeing, కడతేరడము, నివృత్తి, విమోచనము. విడుదలసన్నదు a deed of surrender or relinquishment. విడుపు also means Almsgiving, దానము. విడుపరి viḍup-ari. n. One who abandons a friend, &c. పరిత్యాగశీలుడు. A liberal man, త్యాగశీలుడు. విడువడు viḍu-vaḍu. (విడుపు+పడు.) v. n. To separate, to be severed. వీడియెడబాయు.
వీడు
(p. 1200) vīḍu vīḍu. [Tel.] v. n. To be separated, loosened or unfastened, విడిపోవు, విడిచిపెట్టు, వదలు. To become plain or evident, విశదమగు. To be fulfilled, కొనసాగు. To increase, prosper, వర్ధిల్లు. v. a. To cause to be separated, వీడజేయు. 'దేవకీసుతుకోర్కితీగలువీడంగ వెలదికిమైదీగెవీడదొడగె.' BX. వీడజేయు vīḍa-jēyu. v. a. To do away, to cause to be separated. నివృత్తిజేయు. వీడదీయు vīḍa-dīyu. v. a. To take off, to separate. తీసివేయు, చీలదీయు. వీడదొక్కు vīḍa-dokku. v. a. To apportion, assign. పాలుపంచు. వీడుకొను or వీడ్కొను. vīḍu-konu. v. a. To quit, leave, abandon. To take leave or permission, విడుచు, విడిచిపెట్టు, వదలు, పోయివచ్చెదనని చెప్పుకొని వదలు, సెలవుపుచ్చుకొను. 'పామడు పుత్రుల దీవించి పునర్ధర్శన మయ్యెదమనచు వీడ్కొనినిజనివాసంబులకుంజనిరి.' M. IV. i. 54. 'అరణము గనిచ్చి సుఖముండుడనుచు దక్షుడబ్జువీడ్కొని భార్యతోనరిగెనపుడు.' T. iv. 195. వీడుకొలుపు or వీడ్కొలుపు vīḍu-kolupu. v. a. To send away, dismiss, పంపించు. సగనంపు. 'బ్రాహ్మణద్వేషంబులేక బ్రతుకుండని వీడ్కొలిపినంబోయి.' P. iii. 254. వీడుకోలు or వీడ్కోలు vīḍu-kōlu. n. Permission to go. పోవననుజ్ఞ. The act of leaving or quitting, విడుపు. Permission, leave. అనుజ్ఞ, సెలవు. Death, చావు. వీడుచు vīḍuṭsu. v. a. To cause to be separated, వీడజేయు. To let go, give up, విడిచిపెట్టు. వీడు౛ోడాడు vīḍu-dzōd-āḍu. v. n. To undergo a change, to be changed. మారుపాటునొందు. To resemble, సరిపోలు. వీడు౛ోడు Same as విజ్జోడు. (q. v.) విడుపడు, వీడ్పడు, వీడువడు or వీడ్వడు viḍu-paḍu. v. n. To be changed, మారుపడు. To differ, భేదపడు. To totter, as feet, తడబడు. వీడుపాటు or వీడ్పాటు vīḍu-pāṭu. n. Change, మారుపాటు. Difference, వ్యత్యాసము. A decision, settlement. ఏర్పాటు. 'కల్లయున్ నియమువీడ్పాటొందగా.' KP. iii. 269.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101445
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close