(p. 1136) vala vala. n. A net. జాలము. 'వలయెత్తినీటిలో నేయంగ.' BD. iv. 1818. నివలనుజిక్కి నిన్నేతలంచు.' L. iv. 241. [For వలపు.] Love, కామము, వలకాక vala-kāka. n. Amorous desire, మన్మధతాపము. (క్షేత్రయ.) వలకాడు vala-kāḍu. n. A lover. కాముకుడు. వసు. iv. వలకారి vala-kāri. n. One who causes another to fall in love. వలపించువాడు, లేక వలపించునది. వలకారితనము vala-kāri-tanamu. n. Prettiness, gracefulness. శృంగారభావము. 'అలవోకగావచ్చి యప్పటప్పటికి సమేలంపు మాటలమేలమాడు, పలుమారు తన మ్రోలకలికిసేతలతోడి వలకారితనమునవన్నె బెట్టు, అన్యాపదేశంబులాడి నెచ్చెలుచే బ్రియమారనేమేని బెట్టిపంపు.' Vish. vi. 19. వలకారివగలు vala-kāri-vagalu. n. Airs, graces, pretty ways or gestures. వన్నెలాడిటక్కులు. వలదొర, వలరాు, వలరాయడు or వలరేడు vala-dora. n. A name of Manmatha, the Hindu Cupid. మన్మథుడు. వలవంత or వల్వంత vala-vanta. n. Amorous desire, మన్మథవ్యధ. Emotion, passion, grief, affliction, misery, మనోవ్యధ, దుఃఖము, పరితాపము. 'ఆత్మవత్సర్వభూతాని యనుటబొంకె, ముద్దియలకైన వలవంతముచ్చటలను, నాటపాటలగతుల గొంతడచుగాని, నోరులేని జంతువులకె నొప్పిఘనము.' A. v. 45. టీ వలవంత, పరితాపము, 'శోకవిషణ్న మానసాంభోరుహలైపథంబుగొని పోయెదరివ్వలవంత మీకునేకారణ జాతమయ్యె.' Vedanta Rasayanam iv. 129.