(p. 734) pāṭi pāṭi. [Tel.] n. Degree, extent, quantity, size. ప్రమాణము. Value, character, quality, kind, sort. విధము. Fitness. Resemblance, equality, సామ్యము. adj. Equal, సమము. Common, general, సామాన్యము. Due, fit, న్యాయ్యము. Of such a size or character, కొలదిది. పాటికొల an exact measurement. ఈ పాటిచాలును so far will do, thus much is enough. 'పదుగురాడుమాట పాటియై ధరజెల్లు,' the words of many people will carry weight. ఈపాటికి వచ్చియుండును by this time he will have arrived. వానిపాటి యోగ్యత నీకు ఉండినను చాలును it will be enough if you are equal to him. ఏపాటి రూకలు how much money? అది ఒక పాటిగానున్నది it is tolerably good. పాటిరేవు a ford in a river. పాటినేల rich soil (see పాడు.) వీడు ఏపాటివాడు what kind of a man is he? సన్నపాటికర్ర a slender stick. తగుపాటి competent, fit, suitable. కొంచెపాటి small. కొంచెపాటివారు base men, low people. అల్పులు నీకు బుద్ధిచెప్పే పాటివాడు ఇక్కడ లేడు there is no one here fit to advise you. ఇది యేపాటిపని what sort of business is this? పాటిపాటిగా little by little, కొద్దికొద్దిగా. పాటిగొను pāṭi-gonu. v. a. To consider as equal, సరిచేయు.