(v), ( a), to authorize సెలవిచ్చుట, అనుమతియిచ్చుట, ఉత్తరువుచేసుట, అధికార మిచ్చుట. his Dictionary *s this word యీ మాటకు ఆయన నిఘంటువు ఆధారముగా వున్నది, సాధకముగా వున్నది. the evidence does not * this decision యీ తీర్పుకు ఆ సాక్ష్యము ఆధారము కాలేదు. this will * you in paying the money ఆ రూకలను చెల్లించడానకు నీకు యిది ఆధారముగా వుండును. I do not see nay thingthat *s this conclusion యీ తీర్పుకు ఆధారముగా నాకేమి అగుపడలేదు. I * you! అనగా ofcourse, naturally సుమీ. he had ten horses and fifty servants I * you! పది గుర్రాలనున్ను యాభై మంది పని వాండ్లనున్ను పెట్టుకొని యుండినాడు సుమీ. I * you he thought I was dead నేను చచ్చినానను కొన్నాడు సుమీ. study these books and I will * your learning the language యీ పుస్తకాలను చదువు నీకు యీ భాష రాకుంటే నన్ను అడుగు. this letter will * you to receive the money ఆ రూకలు తీసుకోవడానకు యీ జాబువల్ల నీకు అధికారము కలుగుతున్నది.