(v), ( a), తీశివేసుట, తోశివేసుట, నివృత్తి చేసుట, నివారణ చేసుట, యెత్తి వేసుట, పోగొట్టుట, తీసుకొనిపోవుట. he *d the horses ఆ గుర్రాలను వున్న చోట నుంచి మరివొక చోటికి తీసుకొని పోయినాడు. when he *d the boxes to another room ఆ పెట్టెలను అక్కడ నుంచి తీశి మరివొక గదిలో వుంచినారు. he *d the skin of the orange కిత్తిలిపండు తోలు వొలిచినాడు. when death *d them వాండ్లు చచ్చిన తరువాత. when he *d the third bandage మూడోకట్టు విచ్చేటప్పటికి. soap *s dirt సబ్బు మురికిని పోగొట్టుతున్నది. he *d her fears దాని భయమును పోగొట్టినాడు.butter milk *s ill effects of eating mangoes మామిడిపండ్లకు మజ్జిగవిరుగుడు. this *s the pain యిందువల్ల ఆ నొప్పి లేకుండా పోతున్నది. he did this to * the effects of the spell దీన్ని చేసి ఆ మంత్రమును పారకుండా చేసినాడు. do you think this will * the sin? దీనివల్ల ఆ పాపము పోననుకొన్నావా. this *d my doubts దీనివల్ల నా సందేహము తీరినది, నివారణమైనది.