(n), ( s), and adj. దేశము, నాడు, సీమ, నాటుపురపు, పల్లెటూరి. native *స్వదేశము. change of * or a foreing * విదేశము. the people or populationప్రజలు. a party in the * వనవిహారము. he died for his * వాడు తన దేశ సుఖముకొరకై ప్రాణమే విడిచినాడు. the * as opposed to the town నాటుపురము, పలె.(as) "he lives in the town but his brother lives in the * " వీడు పట్ణములో వున్నాడు వీడి తమ్ముడు నాటుపురములో వున్నాడు. he is at present in the * వాడు ప్రస్తుతము వుళ్లొ లేడు పల్లెకు పోయినాడు. They are gone up the * నాటుపురానికి పోయినారు. Up * people నాటుపురపువాండ్లు. when he comes down the * నాటుపురము నుంచి పట్ణానికి వచ్చేటప్పుడు. a * gentleman నాటుదొర. a * man పల్లెటూరిమనిషి, నాటుపురపు వాడు. a * woman నాటుపురపు స్త్రీ. he is my * man నా దేశస్థుడు. she is my * woman ఆమె మాదేశపుది. a * cart కట్టెలు మొదలైన సామాను తెచ్చేబండి. * language or vulgar expressions గ్రామ్యము. * folks పల్లెటూరివాండ్లు. * arrack నాటుసారాయి. they are * cousions to us వాండ్లు మేము వొక దేశస్థులు. a country seat జాగీరు. the * began to assemble ప్రజలు కూడుకొన్నారు.