(n), ( s), a spectacle వేడుక, తమాషా, ఆట, బూటకము, కల్ల, మాయ.appearance రూపము, ఆకారము. the outward * is very good బయిట రూపుబాగానే వున్నది. his friendship is all మేరే * వాడి స్నేహము వట్టి బూటకము. his piety is all empty * వాడి భక్తి అంతా వట్టి బూటకము.this world is all an empty * యీ ప్రపంచమంతా వట్టి మాయ. in * he was a friend of mine వాడు నాకు బయిటికి స్నేహితుడుగా వుండినాడు. dumb * నోరు తెరవకుండా వూరికే అభినయించి ఆడే ఆట. a puppet * బొమ్మలాట. there was a cattle * here last week పోయిన వారములో యిక్కడ అమ్మజూపపడానకై శానా పశువులను తీసుకొని వచ్చినారు.