(n), ( s), a chest పెట్టె, బరిణె, డబ్బి. a great chest భోషాణము.a strong * ఖజానాపెట్టె. a poor's * హుండి, భవనాశి అక్షయపాత్ర.a snuff * పొడిభరణి, పొడిడబ్బి. a pill * మాత్రలువేసే భరణి. a scent * అత్తరుడబ్బి. a dice * పాచికలాడే గొట్టము. seat in a theatre నాటకశాలలో వేడుక చూచే వాండ్లు కూర్చుండేటందుకు చుట్టూరు కట్టివుండే చిన్న అరలు, వీటిని. Boxes అంటారు. the * tree వక తరహా చెట్టు. a cuff, as, he gave me a box on the ear నన్ను చంపమీద కొట్టినాడు. * or * iron యిస్త్రి చేసే యినుప పెట్టె. coach * బండిలో బండితోలేవాడు కూర్చుండేచోటు. Christmass boxes పండుగ బహుమానము.