(n), ( s), గుణము, యోగ్యత, అతిశయము. he had the * of supporting them వాండ్లను సంరక్షించిన పుణ్యము వాడికి కలిగినది. he had the * of confessing his crime తప్పును వొప్పుకొన్నాడనే ఘనత వాడికి కలిగినది. he had no great * in knowing French, for his mother was a French woman వాడితల్లి ఫ్రెంచిది గనుక వాడికి ఫ్రెంచి తెలియడము అతిశయముకాదు. he is a man of no * అయోగ్యుడు. he made a * of paying his debts తన అప్పులను చెల్లించడమే వొక ధర్మమన్నాడు. he makes a * supporting his mother తన తల్లిని కాపాడడమే వొక పుణ్యమంటాడు. the * fostering minute శిష్టపరిపాలన నిర్ణయ పత్రిక, అనగా ఆయా వుద్యోగస్థుల యోగ్యతలను యేర్పరచి వ్రాసిన పత్రిక. he has the * of having discovered that art యీ శాస్త్రమును చేసిన పుణ్యము వాడిది. he got his *s వాడికి తగినట్టు జరిగినది. we tried the case on it's *s ఆ వ్యాజ్యము యొక్క మూలమును పట్టి విచారిస్తిమి. the Judge went into the *s of the case ఆ వ్యాజ్యము యొక్క సారాంశమును విచారించినాడు. do you know the relative *s these two grammars? యీ రెండు వ్యాకరణములకు వుండే తారతమ్యము నీకు తెలుసునా.