(v), ( n), లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట. when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి. the kite does not * ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు. when the wind rose గాలెత్తేటప్పటికి. behind the house a bill *s ఆ యింటికి వెనక వొక కొండ వున్నది. beyond the hills, a wood *s ఆ కొండకు అవతల వొక అడవి వున్నది. the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది. the river *s in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది. the tide is rising పోటు కాలముగా వున్నది. as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.the sun rose ప్రొద్దు పొడిచినది. in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు. when the assembly rose సభ కలిశేటప్పటికి. the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది. he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు. the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు. this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది. Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది. the stench rose కంపెత్తినది.when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి. they rose against us మా మీదికి రేగినారు.