(v), ( a), పిలుచుట, కూసుట. to denominate పేరు బెట్టుట, అనుట, చెప్పుట. nothing took place that you could * injustice అన్యాయమన్నది యేమిన్ని సంభవించ లేదు. what do you * this in Telugu ? తెనుగులో దీనికి పేరేమి. the head farmers are called Reddis పెద్ద కాపులు రెడ్లు అనబడుతారు. he calls me his mother వాడు నన్ను తల్లి అంటాడు. he brought me a jumkhan (as rung) as it is called జంబుఖానా అనే ఒకటిని నాకు తీసుకొని వచ్చినాడు he called me నన్ను పిలిపించినాడు, రప్పించినాడు. she called me names నన్ను తిట్టింది. he called a council about this యిందున గురించి సభ కూర్చి ఆలోచించినాడు. * him అతణ్ని రమ్మను, అతణ్ని పిలువు. he called for me నన్ను రమ్మని చెప్పినాడు. he called for the accounts లెక్కలు తెమ్మన్నాడు. he called a meeting సభ కూర్చినాడు. I * you to witness that he did this వాడు యీ పని చేసినది నీవు యెరిగి వుండు దానికి నీవు సాక్షి. the ship called at Madras on her way toCalcutta ఆ వాడ కలకత్తాకు పోవడములో చన్న పట్టణపు రేవుకు పోయినది. I called him back to life. వాణ్ని మళ్లీ బ్రతికించినాను. I will * for you at your house మీ యింటికి వచ్చి నిన్ను పిలుచుకొని పోతాను. to call for పిలుపించుట, తెమ్మని ఆజ్ఞాపించుట. he calls for you అతడు నిన్ను పిలుస్తాడు. he called for help రక్షించమని అరిచినాడు. he called the boon in ఆ పుస్తకము మీద బరువెత్తి పెట్టి అణిగేటట్టు చేసినాడు. he called his debts in తనకు యివ్వవలసిన అప్పును వాండ్లు వాండ్లు చెల్లించి వేయ వలసిన దని ప్రకటన చేసినాడు. to call in old coin పాత నాణ్యమును కరిగి వేసుట. I called his account in question వాడి లెక్కను గురించిసందేహించినాను. when he was beaten he called out కొట్టేటప్పుడు అరిచినాడు.when I * this to mind నేను దీన్ని జ్ఞాపకము చేసుకొన్నప్పుడు. to call out in a duel కాల్చుకొని చత్తాము రమ్మని పిలుచుట. they called out upon him అతణ్ని కూకలు పెట్టినారు, చీవాట్లు పెట్టినారు. to * over or examine పట్టీ ప్రకారము 1ఝడ్తీ చూచుట. I called him to account for his conduct నీవు చేశిన పనికి సమాధానము చెప్పుమని అడిగినాను. God called him to light దేవుడు వాణ్ని భూమిలో పుట్టించినాడు. I called him up వాన్ని నిద్ర లేపినాను. I called the dogs off పయి బడకుండా కుక్కలను యివతలికి పిలిచినాను. they called upon him, to do thisదీన్ని చేయమని వాణ్ని వేడుకొన్నారు. I * upon you to answer this దీనికి నీవు జవాబు చెప్పవలసినది. I * upon or defy you to prove this దీన్ని నీవు రుజువు చేయగలవా, దీన్ని నీవు రుజువు చెయ్యగలవా 0చూతాము. when you go there you had better call on my brother నీవు అక్కడికిపోతే మంచిది మా అన్నను పోయి చూడు. I called upon God to help me నన్ను రక్షించుమని దేవుణ్ని ప్రార్థిస్తిని. to * upon (pay a visit) దర్శనమునకు పోవుట. I called upon him this morning నేడు తెల్లవారి అతని దర్శనమునకు పోయినాను. am I called upon to pay the money? ఆ రూకలను చెల్లించవలశిన భారము నాదా?