(v), ( a), to advance by praise ; to the kindness of anotherశ్లాఘించుట, శ్లాఘించి పుచ్చుకొమ్మనుట, మంచిదనుట, శిఫారసు చేసుట. you may readthis book if you like but I do not * it నీ కోర్టమైన యీ పుస్తకమును చదువు నేనుమంచిదనను. he *s bathing స్నానము చేస్తే మంచిదంటాడు. her beauty *ed herto him as a wife దాని అందమే వాణ్ని దాన్ని పెండ్లి చేసుకొమ్మన్నది. I followedthe course which you *ed మీరు యే పని మంచిదన్నారో నేను దాన్నే చేసినాను.the garden in front *s the house; it has not other recommendation ఆయింటికి యెదట తోట వుండడము ఆ యింటికి వొక గుణమే తప్ప వేరే వొక గుణమున్నులేదు. do you think that I would * you a thief ? వొక దొంగను మంచివాడని మీవద్ద తీసుకొని వచ్చి విడుతునా. can you * me a house and two servants and ahorse ? వొక యిల్లు, యిద్దరు పనివాండ్లు, వొక గుర్రము వీటిని శిఫారసు చేయగలవా.you *ed them and I bought them అవి మంచివే కొనుక్కోవచ్చునని నీ వన్నందున నేనుకొనుక్కొన్నాను. you may buy this but I do not * it నీవు కొనుక్కొంటే కొనుక్కోనేను మంచిదనను. he *ed himself to his master by diligence and honestyవాడి జాగరూకతవల్ల నున్ను, పెద్ద మనిషి తనము వల్ల నున్ను, తన యజమానుడి దయసంపాదించుకొన్నాడు. I shall * my son to your care నా కొడుకును తమ వశముచేస్తున్నాను. I * my soul to God and my honour to the king ప్రాణమునుదేవుడికిన్ని మానమును రాజుకున్ను అర్పించినాను. will you * me to that gentlemanfor employment ? వుద్యోగమును నాకు యిచ్చేటట్టు ఆ దొరగారికి నా యోగ్యతనుతెలియచేసి వొప్పగింత పెట్టుతారా. I * you not to do this again దీన్ని నీవు మళ్ళీయిట్లా చేయడము మంచిది కాదు.