(n), ( s),  పల్లు, రదనము, దంతము plu. Teeth పండ్లు. eye teeth కోరలు. thedouble teeth or jaw teeth దవడపండ్లు, పక్కపండ్లు. the first teeth or milkteeth పాలపండ్లు. to speak between the tenth నోరు బాగా తెరవకుండా పండ్లసందున కసిబిసుమని మాట్లాడుట. he is one who would steal the very teethout of your head యెటువంటి వాణ్నిన్ని నిమిషములో తన వలలో వేసుకొనేవాడు.can't you keep your tongue between your teeth ? నోరు మూసుకొని వూరికెవుండలేవా. the teeth of a saw ఝపము యొక్క పండ్లు. teeth of a key బీగముచెవి యొక్క కక్కులు. teeth of a wheel in a watch &c. గడియారము మొదలైనవాటిలో వుండే చక్రముల మీది నొక్కులు, కక్కులు, పండ్లు. he did his teeth వాడుగోముఖ వ్యాఘ్రముగా వున్నాడు. at last he showed his * తుదకు తన నిజస్వరూపమును బైట పెట్టినాడు. they flung this story in his teeth యీ సంగతివాని ముఖము ముందర తాకనాడినారు. I had the rain in my teeth the whole wayదోవకడాకు నాకు యెదురు వానే కొట్టినది. they cast this business in this teethయీ పనిని గురించి వాణ్ని దెప్పినారు యెత్తి పొడిచినారు. in the teeth of విరుద్ధముగా, అడ్డముగా, యెదురుగా. in the teeth of the wind గాలికి యెదురుగా. in the teeth of the law శాస్త్ర విరుద్ధముగా. he gave them the lie in their teeth మీరు చెప్పినది అబద్ధమని వాండ్ల ముఖము ముందర అన్నాడు. he paid it in spite of his teeth యెంత మనసు లేకపోయిన తుదకు చెల్లించినాడు. he sold the house in spiteof his teeth వానికి యెంత మనసు లేకపోయినా తుదకు ఆ యిల్లు అమ్మినాడు. theyfell upon him * and nail సర్వప్రయత్నముతో వాడి మీద పడ్డారు. he tried * andnail to find out the secret ఆ మర్మమును కనుక్కోవలెనని తన హరణభరణ శక్తిచూచినాడు. he was armed to the teeth సర్వాయుధ సన్నధ్ధుడైనాడు. she had asweet * for this ఆపె మనసు దానిమీద పారినది, ఆపెకు దాని మీద మనసుపోయినది.