(v), ( a), బట్టలు తొడుగు, దిద్దుట, సవరించుట, బాగుపరుచుట,పనుపరుచుట, పక్వముచేసుట, వండుట. she *ed her child in red అదిబిడ్డకు యెర్రబట్టలు తొడిగినది. to * food వండుట, పాకముచేసుట.he *ed his own dinner తానుగా వండుకొన్నాడు. he *ed himselfబట్టలు తొడుక్కొన్నాడు. to * a wound గాయము కట్టుట. to * or currya horse గుర్రానికి గొరవము బెట్టుట, తోముట, మాలీసు చేసుట. to * cloth or skin పదనుచేసుట. to * a garden దోహదము చేసుట, యెరుపు మొదలైనవి వేసి పనుపరుచుట. or set right or arrange దిద్దుట. he ploughed and *ed the field ఆ పొలమును దున్ని చక్కపెట్టినాడు. he *ed up the history ఆ కథను మహాశృంగారించి చెప్పినాడు. she *ed herself up అది శృంగారించుకొన్నది.