(adj), not having been long born, not old లేత, పశి, చిన్న. a * man పశివాడు, చిన్నవాడు. a * woman చిన్నది, పడుచు. * fruit పిందె. a * leaf చిగురు, చిగురుటాకు. * grass పసరిక. a * palm tree తాటిమొక్క. * and old పిన్నలు పెద్దలు, శిశబాల వృద్ధులు. in the Bible "a * man" as meaning a servant, attendant, or soldier నౌకరు, భృత్యుడు, పని వాడు. a word used in anger ; thus ; I tell you what * man ఓరే వినురా. I tell you what * woman ఓశే వినవే. a * gentleman దొర కొడుకు. the * prince యువరాజు. a * lady చిన్న ఆమె. a * elephant calf యేనుగు గున్న. a * heifer పెయ్యదూడ. a * buffalo పడ్డ, యెనప్పడ్డ. a * bull కోడె. a * one పిల్ల, పాప. * ones పిల్లు, బిడ్డలు, పశివాండ్లు, చిన్న వాండ్లు. the * చిన్న వాండ్లు, పిల్లలు. ever since I was * చిన్నప్పటినుంచి. Younger, adj not so old as another మరీచిన్న. he is younger than me వాడు నాకంటె చిన్న వాడు. Colman the younger చిన్న కోలుమేను. in my younger days బాల్య మందు, పశితనములో. the youngest child కడగొట్టు బిడ్డ. Young, n. s. the offspring of animals collectively పిల్లలు, బిడ్డలు, చిన్న వాండ్లు. when the tigress is with * పులి చూలుగా వుండేటప్పుడు.