(v), ( a), వదులుకొనుట, మానుకొనుట, విడిచిపెట్టుట, త్యజించుట, అప్పగించుట. he *ed the service ఉద్యోగమును మానుకొన్నాడు చాలించుకొన్నాడు. I *ed the money to him, ఈ రూకలు యికను నాకు వుపయోగము లేదని వాడికి అప్పగించినాను. he *ed his breath or life చచచినాడు. I * myself to the will of God దేవుడి మీద భారము వేసి అన్నీ మానుకొని వున్నాను. he is quite *ed అన్నిటికీ లోబడివున్నాడు, యెది వచ్చినా రానిమ్మని వున్నాడు. she *ed herself to him ఎటు చేసినా నీ భారమని వాడికి లోబడ్డది.